Astrology 10 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం పన్నెండు రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. చేపట్టిన కీలక పనుల్లో ఆటంకాలు ఎదురైనా చివరికి విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఇతరులను అతిగా నమ్మవద్దు. కోపం, దూకుడు తగ్గించుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు రాకుండా చూడాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఖర్చులు అధికంగా పెరుగుతాయి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
మిథునం:
మిథునం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఛాన్స్ ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గణపతి ఆలయ సందర్శన ఉత్తమం.
కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆంజనేయస్వామి స్తోత్రం పారాయణ శుభప్రదం.
సింహం:
సింహ రాశి వారికి ఆనందదాయకంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా విజయం పొందుతారు. అన్ని రంగాల వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గిట్టనివారితో దూరంగా ఉండడం మంచిది. సంతానంపై సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.
కన్య:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు. ప్రారంభించిన పనులను చిత్తశుద్ధితో పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఉద్యోగులకు అప్పగించిన పనులను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. శారీరక శ్రమ, ఒత్తిడి పెరగవచ్చు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. అనవసర వివాదాల్లో తలదూర్చవద్దు. సమయాన్ని వృథా చేయకండి. శని స్తోత్రం పఠిస్తే మంచిది.
Also Read: భారతదేశంలో ఉన్న ఆరు శక్తివంతమైన దేవి ఆలయాలు, జీవితంలో ఒక్కసారి అయినా వీటిని దర్శించుకోండి
తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైన విజయం పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పనిపై శ్రద్ధతో మన్ననలు పొందుతారు. శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభాలు వరిస్తాయి. గణపతి ఆరాధన మేటు చేస్తుంది.
వృశ్చికం:
ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక ఇబ్బందుల తొలగి లాభాలు సాధిస్తారు. పెద్దల సహకారంతో కీలకమైన పనుల్లో మంచి ఫలితాలు రాబడతారు. ఉద్యోగులకు శారీరక శ్రమ పెరుగుతుంది. అలాగే స్థాన చలనం ఉండవచ్చు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వివాదాల జోలికి పోకూడదు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం మంచిది. దుర్గాస్తుతి పారాయణ శుభప్రదం.
ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారులకు ఆటంకాలు ఏర్పడవచ్చు. బంధుమిత్రుల నుంచి సహకారం ఉంటుంది. పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ బంధం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకోవడం మంచిది.
మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. అనవసర ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తికి సంబంధించిన విషయాలపై వాయిదా వేసుకోవడం మంచిది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శివారాధన మేలు చేస్తుంది.
కుంభం:
కుంభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారంలో ఊహించని లాభాలు పొందుతారు. కొత్తగా వ్యాపారం చేపట్టేవారికి అనుకూలం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. విష్ణ ఆరాధన శుభకరం.
మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అనుకున్నది సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. ఉన్నతాధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. అవసరానికి నగదు సహాయం అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. దుర్గాస్తోత్రం చదివితే మంచిది.