EPAPER
Kirrak Couples Episode 1

Garuda Purana : గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకంటే నష్టమేనా..?

Garuda Purana : గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకంటే నష్టమేనా..?

Garuda Purana : గరుడ పురాణం గురించి చెబితే కొందర భయపడుతుంటారు. వ్యాసభగవానుడి 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. నరకం గురించి పాపుల శిక్షల గురించి గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు విష్ణువు చెప్పిన సమాధానాలు గరుడ పురాణంలో ఉన్నాయి. గరుడ పురాణం గురించి భయపడటానికి కారణం . నరకలోక వర్ణన , పితృలోక వర్ణన గురించి ప్రస్తావించారు ముఖ్యంగా ప్రేత కల్పము ఉండటం వల్ల దీన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా అన్న సందేహాలు వస్తుంటాయి. ఏ పాపం చేస్తే ఏ నరకంలో పడతాం, ఎన్ని సంవత్సరాలు ఉంటాం, ఎన్ని జన్మాలు ఉంటాయి, ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది, పాపానికి ఫలితం ఎలా ఉంటుంది ఇలా నరకలోక శిక్షలు గురించి ఉంటాయి. ప్రతీ అధ్యాయంలో పరమభీకర వర్ణన ఉంటుంది. భూలోకంలో ఇష్టవచ్చినట్టు తప్పులు చేస్తే పడే శిక్షలు ఏంటో కళ్లకు కట్టినట్టు గరుడ పురాణం వివరిస్తుంది. అలాంటి పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవడంలో తప్పులేదని పండితులు చెబుతున్నారు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియుల ఇళ్లల్లో ఎవరైనా చనిపోతే 12రోజులపాటు గరుడ పురాణం పఠిస్తుంటారు. మరణించిన తర్వాత వ్యక్తి ఎలా వెళ్తాడు, శరీరం నుంచి ఆత్మ ఎలా వస్తుంది, ఆత్మ ఎక్కడెక్కడ ఎలా ప్రయాణం చేస్తుంది., ఎక్కడ ఆగుతుందన్న వివరాలు గరుడ పురాణాల్లో ఉంది. అలాంటి వివరాలు మనం చూడలేం. తెలియదు కూడా. అలాంటి విషయాలు గరుడ పురాణం చెబుతుంది. చనిపోయాక ఏం జరుగుతుందో వాళ్లు మనకు చెప్పలేరు. అలాంటి వైజ్ఞానిక విషయాలను చెప్పేది అపురూప పురాణం ఒక్కటే. మరణించిన తర్వాత ఆ వెనుక ఏం జరుగుతుందో చెప్పే పురాణం కాబట్టి ఇంట్లో ఉంచకూడదని కొందరు భయపడుతుంటారు. అలాంటి భయాలు అవసరం లేదని నిక్షేపంగా గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు.


Tags

Related News

Pitru Paksha Ekadashi 2024 : ఇందిరా ఏకాదశి ఉపవాసం ఎప్పుడు ? ఏకాదశి వ్రతాన్ని ఎలా పాటించాలి

Surya Nakshatra Gochar 2024: ఈ 4 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే జరగబోతున్నాయి

Shani Vakri 2024 : శని గ్రహం తిరోగమనంతో నవంబర్ 15 వరకు ఈ రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు

October Lucky Zodiacs: ఈ 3 రాశుల వారు త్వరలో బుధుడి అనుగ్రహంతో కోటీశ్వరులు కాబోతున్నారు

Horoscope 27 September 2024: ఈ రాశి వారికి ఊహించని ధన లాభం.. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం!

Vastu Tips: వాస్తు ప్రకారం ఈ 7 వస్తువులను పొరపాటున కూడా కింద పడేయకూడదు

Mahalaya 2024 Date: మహాలయ అమావాస్య ఎప్పుడు ? దీనిని ఎందుకు జరుపుకుంటారు?

Big Stories

×