Gajalakshmi : హోలీ పండుగ తర్వాత మూడు రాశులకి గజలక్ష్మి రాజయోగం కలగబోతోంది. శనిగ్రహానికి ఏడున్నర సంవత్సరాలు ముగుస్తాయి. వాస్తవానికి 2023 ఏప్రిల్ 22న దేవగురు బృహస్పతి మేషరాశిలో సంచరించ బోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో గురు, చంద్రుడు కలిసి ఉండటం వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో సంపద, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. మొత్తం 9 గ్రహాలు రాశిచక్రాన్ని ఎప్పటికప్పుడు సంచరిస్తాయి. దీనివల్ల ఇతర గ్రహాలతో మైత్రి ఏర్పడుతుంది. ఈ గ్రహ సంచారాలు, గ్రహ సంయోగాలు అనేక శుభ , అశుభ యోగాలను సృష్టిస్తాయి. అదే సమయంలో హోలీ పండుగ మార్చి 08న వచ్చి.. ఆ తర్వాత ఓ ప్రయోగం జరగబోతోంది. బృహస్పతిని గ్రహాల దేవుడుగా పరిగణిస్తారు. దేవతలకు గురువు అయిన బృహస్పతి ఏప్రిల్ 22న ఉదయం 03:33 గంటలకు తన మీన రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఇప్పటికే ఈ రాశిలో కూర్చున్నాడు .2023వ సంవత్సరంలో గజలక్ష్మీ రాజయోగం ఏర్పడటం వల్ల శుభప్రద ప్రభావం అన్ని రాశుల వారిపైనా పడనుంది. అయితే అన్ని రాశుల వారి కంటే.. ఈ మూడు రాశుల వారికి గరిష్ట లాభాలు, విజయాలు కలుగనున్నాయి.
మేషరాశి:
ఈ రాశి.. రాశులవారీగా చూస్తే ప్రథమ రాశి. 2023లో బృహస్పతి రాశి మారడం వల్ల ఏర్పడిన గజలక్ష్మి యోగం మేషరాశి వారికి చాలా శుభప్రదం. ఫలప్రదం. ఈ రాశివారు జీవితంలోని ప్రతి రంగంలో విజయాన్ని ప్రయోజనాలను పొందుతారు. అదృష్టం కారణంగా.. మీరు వ్యాపారం, ఉద్యోగం, వృత్తిలో విజయాలను సాధిస్తారు. ధన లాభాలకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంతో సంబంధం ఉన్న వారికి ఏడాది పొడవునా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులు విద్యారంగంలో విజయం సాధించగలరు. ప్రేమ వ్యవహారాలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ అవకాశాలు కలుగుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. అదృష్ట సహాయంతో, మీ పనులన్నీ పూర్తవుతాయి. పాత పనులన్నీ పూర్తవుతాయి. ఆదాయంలో కూడా పెరుగుదల ఉండవచ్చు.
మిథున రాశి
గజలక్ష్మి రాజయోగం ఏర్పడటంతో మీ ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది. పాత పెట్టుబడులు కూడా లాభపడతాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఒక ప్రత్యేక వ్యక్తి ఒంటరి వ్యక్తుల జీవితంలోకి ఎంట్రీ కొట్టవచ్చు. వారితో మీరు బలమైన సంబంధాన్ని ప్రారంభించే ఆలోచన చేయవచ్చు.
ధనుస్సు రాశి
గజలక్ష్మి రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే బృహస్పతి మీ రాశి నుండి ఐదవ స్థానంలో సంచరించబోతున్నాడు. ఈ సమయంలో వ్యాపారవేత్తలు వ్యాపారంలో విజయం సాధిస్తారు. అదే సమయంలో, ప్రేమ సంబంధాలలో కూడా మాధుర్యం కనిపిస్తుంది. విద్య గురించి చెప్పాలంటే, విదేశాలలో చదవాలని ఆలోచించే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.