EPAPER
Kirrak Couples Episode 1

Banana Leaves : పూర్వం అరటి ఆకుల్లోనే భోజనం ఎందుకు పెట్టేవారో తెలుసా…

Banana Leaves : పూర్వం అరటి ఆకుల్లోనే భోజనం ఎందుకు పెట్టేవారో తెలుసా…

Banana Leaves : ఇప్పడంటే అందరూ ప్లాస్టిక్ పేట్లలోను పింగాణీ ప్లేట్లలో అన్నం తింటున్నారు. ఈ కల్చర్ రాక ముందు స్టీల్ కంచాల్లో తినేవారు. ధనవంతులు వెండి కంచాల్లో తినేవారు. అంతకు ముందు రోజుల్లో కేవలం అరిటాకులు, విస్తరాకుల్లోనే భోజన చేసేవారు. 20, 30 ఏళ్ల క్రితం ఎంత ఐశ్వర్యం ఉన్నా ఇంటికి వచ్చే వాళ్లకి ఆకుల్లో అనే పెట్టేవారు.
అరటిఆకులో భోజనం చేయడానికి,పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది . ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. మరోటి ఏంటంటేవేడి అన్నం వడ్డిస్తే అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. పైగా పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి.అందుకే ఇంటికి వచ్చిన అతిధులకు ఈ రకంతా ఆతిథ్యం ఇచ్చే వారు.


అరటి ఆకులోకాని, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేస్తే ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుందని నమ్మకం..బాదం ఆకులో భోజనం చేయడం వల్ల కఠిన హృదయులవుతారట. టేకు ఆకులో అన్నం తింటే భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుందట. ధర్మ శాస్త్రం ప్రకారం ..అన్నం తినే ముందు నియమాలు పాటించాలి. అన్నీ వడ్డించిన విస్తరి లేదా పళ్లెం ముందు కూర్చోకూడదు . మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి… ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడకూడదు. అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ.

ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే … తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం చేస్తే దీర్ఘాయుష్షు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానంకావడం వల్ల ప్రాధాన్యమెక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే తింటే బలం, ఉత్తర ముఖంగా కూర్చుంటే సంపద ప్రాప్తిస్తుంది. దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది. కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలున్నాయి. అన్నము తింటున్నప్పుడు ఆ అన్నం వడ్డించే వారిని తిట్టడం లాంటివి చేయకూడదు. ఏడుస్తూ తింటూ ,గిన్నె మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు. ఎట్టిపరిస్థితిలోనైనా ఒడిలో కంచం, పళ్ళెము పెట్టుకుని అన్నం తినకూడదు. ఇది చాలా దరిద్రం. భోజన సమయంలో నవ్వులాట, తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుటం మంచిది కాదు.


Related News

Horoscope 25 September 2024: ఈ రాశి వారికి పవర్‌ఫుల్ యోగం.. ప్రమోషన్స్ ఛాన్స్!

Arunachalam food: అరుణాచలం వెళ్తున్నారా? అయితే మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

Lucky Zodiac Signs: 2 గ్రహాల ప్రభావం.. వీరికి ధనలాభం

Horoscope 24 September 2024: నేటి రాశి పలాలు.. ఊహించని ధనలాభం! అవివాహితులకు వివాహం నిశ్చయం!

Negative Energy Signs: ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయా.. ఈ నివారణ చర్యలు పాటించండి

Shardiya Navratri 2024 : నవరాత్రులులోపు ఇంట్లో ఈ వస్తువులు అస్సలు ఉంచకండి

Shani Margi 2024: అక్టోబర్‌లో శని గ్రహం వల్ల 3 రాశుల్లో పెద్ద మార్పు

Big Stories

×