Gomatha Photo : గోమాత ఫోటోను కలిగే లాభాలేంటో తెలుసా

Gomatha Photo : దేవుడి విగ్రహాల్ని పూజించి ఆరాధించే హిందూవుల ఇళ్లల్లో ఎన్నో ఫోటోలు ఉంటాయి. ప్రతీ పూజా మందిరంలో అనేక దేవుడి ఫోటోలు తారసపడుతుంటాయి. కొంతమంది ఇష్టదైవాలను, కులదైవం ఫోటోలను తప్పకుండా ఉంచుకుని పూజిస్తారు. మరికొందరు అందరి దేవుళ్ల చిత్రాలను పెట్టుకునేందుకు ఇష్టపడతారు. ఎన్ని ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకోబుతున్న ఫోటో మాత్రం ఉండి తీరాలి.

ఈ కష్టాలు తొలగిపోవాలంటే…

ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా ఏదో ఒక సందర్భంలో అప్పులు అనేవి చేస్తూ ఉంటాం. అప్పు తీసుకునేటప్పుడు బాగుంటుంది కానీ.. వాటికి వడ్డీ కడుతూ.. అసలు తీర్చేందుకు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఎన్ని ప్లాన్లు వేసినా.. ఎంత డబ్బు పొదుపు చేసినా ప్రతికూల ఫలితాలే ఎదురవుతుంటాయి. ఇలా అప్పుల తిప్పలతో ఇబ్బందులు పడే వారు కొన్ని పరిహారాలను పాటిస్తే అత్యంత త్వరగా రుణ విముక్తి పొందొచ్చు.

జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమాత ఫోటో పూజా మందిరంలో ఉంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఆవును కేవలం జంతువుగానే కాకుండా గోమాతగా పరిగణిస్తారు.

గోమాత్ర విగ్రహాన్ని ఈ దిక్కులో పెట్టాలి…

గోమాత ఫోటోతోపాటు వీలైతే ఆవు,దూడ ఉన్న ఫోటోను కూడా పెట్టుకోవచ్చు. లేదంతా ఆవు,దూడ ఉన్న విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టుకుంటే శ్రేయస్కరం, శుభఫ్రదం. గోమాత ఫోటో ఇంట్లో ఉండటం వల్ల ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుంది.
మనం నివసిస్తున్న ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలున్నా గోమాత చిత్రపటాన్ని ఉంచడం వల్ల అవి తొలగిపోతాయి.

నూతన గృహ ప్రవేశ సమయాల్లో ఆవు, దూడను ఆనవాయితీ ఇప్పటికీ మనం పాటిస్తున్నాం. ఆవుదూడ, ఇంట్లో తిరిగేతే వాస్తు దోషాలు నివారించబడతాయన్న నమ్మకంతోనే మనం ఆచారాన్ని పాటిస్తున్నాం. వెండితో తయారు చేసిన ఆవు,దూడ ఉంట్లో పవిత్రమైన విధి విధానాలు మనం ఇంటికి వస్తాయి.

కామధేనువు విగ్రహాన్ని ఇంట్లోని తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశలో ఉంచాలి.. ఈ విగ్రహం త్రిదేవి లక్షణాలను కలిగి ఉంటుంది. దేవాలయాలు లేదా ఇంట్లోని ప్రధాన ద్వారం వద్ద లేదా ఏదైనా అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఈ విగ్రహాన్ని అమర్చాలి. సాగర మధనం సమయంలో కామధేనువు లక్ష్మీదేవిగా అవతరించినట్లు కొన్ని గ్రంథాల్లో వివరించారు. అందుకే కామధేనువు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పరిగణిస్తారు

More Reading

Post navigation

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *