Big Stories

Temples : రోగం కుదరాలంటే ఆ గుడికి వెళ్లాల్సిందేనా…

Temples

- Advertisement -

Temples : తమిళనాడులోని తంజావూరుజిల్లాలోని వైదీశ్వరుని గుడికి ఒక ప్రత్యేకత ఉంది. చోళరాజులకాలంనాటి ఈ గుడి నాడీ జ్యోతిష్యం అనేది బాగా ప్రసిద్ధిచెందింది. తంజావూరు పట్టణంలో అత్యధికంగా సందర్శింపబడే బృహదీశ్వరాలయము ఉంది. చిదంబరానికి సమీపంలో ఈ ఆలయం కొలువుతీరింది . అంగారకుడు ఒకసారి జబ్బునపడ్డాడట. జబ్బునపడిన అంగారకునికి వైద్యంచేయటానికి వైద్యుడిగా ఈశ్వరుడే అవతారం ఎత్తివచ్చి చికిత్స చేసిన ప్రాంతంకాబట్టి ఈ ప్రాంతానికి వైదీశ్వరున్ కోయిల్ అని పేరువచ్చింది. అలాగే జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్యమహాముని. జ్యోతిష్యంలో ఒక భాగం నాడీశాస్త్రం.బొటనవేలిముద్రల ఆధారంగా భూత, భవిష్యత్, వర్తమానాలను చెప్పే పద్ధతి ఇప్పటికీ ఊరులో కనిపిస్తుంది.

- Advertisement -

ఇక్కడ శివుడ్ని వైదీశ్వరుడు అని పిలుస్తారు.స్వామి దర్శనం సర్వరోగ నివారణం అని నమ్ముతారు. శివుడు వైద్యునిరూపంలో కొలువై వుంటాడిక్కడ. అందుకే వైదీశ్వరున్ కోయిల్ అంటారు.ఈ దేవాలయం 1600 ఏళ్ల క్రితం చెందినది.ఈఊళ్లో దాదాపు 1200పండితులు అనువంశికంగా సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడీ జ్యోస్యాన్ని చెప్పటంలో ఆరితేరినవారు. ఈ నాడీజ్యోతిష్య తాళపత్ర గ్రంథాలు ఇక్కడ గుడిలో ఉన్నాయి. ఆలయం చుట్టూ ఈ నాడీజాతకం చెప్పే వాళ్ళు కనిపస్తారు.

తంజావూరును రాజధానిగా చేసుకుని చోళులు పరిపాలన చేసిన ప్రాంతం ఇది. 18 వ శతాబ్దం చివరలో దేశంలోని సంస్కృతికి కేంద్ర బిందువుగా ఉంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా విదేశీయులు ఈ టెంపుల్ చూసేందుకు వస్తుంటారు.ఈ ఆలయంను రాజ రాజ చోళ-I, మధ్యయుగ చోళ రాజు 11 వ శతాబ్దం AD లో నిర్మించారు. 1987 వ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడ సరస్వతి మహల్ లైబ్రరీ ప్యాలెస్ యొక్క ప్రాంగణంలో ఉంది. ఈ లైబ్రరీ లో కాగితం , తాళపత్రం మీద రాసిన ముప్పై వేల కంటే ఎక్కువ భారతీయ, యూరోపియన్ రాతప్రతుల సేకరణ ఉన్నది. తొమ్మిది నుండి పన్నెండవ శతాబ్దాలలో ఉన్న కాంస్య చిత్రాలు కనిపిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News