EPAPER

Birth Day:పుట్టిన రోజు తిథుల ప్రకారమే చేసుకోవాలా..

Birth Day:పుట్టిన రోజు తిథుల ప్రకారమే చేసుకోవాలా..

Birth Day:వాస్తవానికి పుట్టిన రోజు అనేది తిధుల ప్రకారం చేసుకోవడమే సర్వత్రా శుభకరం. మన భారతీయ హిందు సాంప్రాదాయ ప్రకారం దీపాన్ని వెలిగించే సంస్కృతి మనది. దీపాన్ని ఆర్పే సంస్కృతి కాదు మనది.పద్దతిగా అంటే మనం తెలుగు నెలల ప్రకారం ఏనెలలో ఏపక్షంలో ఏ తిధి రోజున పుట్టమో గుర్తుపెట్టుకుని ఆరోజే పుట్టిన రోజు జరుపు కోవడమే నిజమైన పుట్టిన రోజు అవుతుంది.అందుకే అవతార పురుషులైన శ్రీకృష్ణుని,శ్రీరాముని పుట్టిన రోజులు మనం తిధుల ప్రకారమే జరుపుకుంటాము.


ప్రతి జన్మనక్షత్రంమందు , పుట్టిన రోజునందు అపమృత్యు పరిహారం కోసం ఆయుష్య సూక్తంతో హోమం చేయాలి .ఈ హోమం అ మనిషికి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది .వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది . ఇంద్ర, రుద్రాద్రి ,దేవతలుకు చేసే ప్రార్థనలు వారికీ సకల శుభాలనూ ఇస్తాయి .అరోజు చేసే దానాలు వారికి పుణ్యం ఇవ్వడం కాకుండా మన కన్నా తక్కువ స్థితిలో ఉన్నవారికి సహాయం చెసామన్న తృప్తిని కలిగిస్తాయి.

పుట్టిన రోజు రుద్రాభిషేకం ఇంటిలో అయిన ,ఆలయంలో అయిన చేయడం మంచిది .తీరిక ఉంటె లలితసహస్రనామం ,విష్ణుసహస్రనామం పారాయణము చేయవచ్చు .ఇంతే కాకుండా గ్రహచరాదులతో అపమృత్యు దోషం ప్రాప్తి కలిగినా…మృత్యుంజయ హోమం శ్రేయస్సుని ఇస్తుంది. ఉదయన్నే నువ్వుల నూనెతో తల స్నానం చేసి ,నూతన వస్త్రధారణ ,రక్షా తిలకం ధరించడం ,ఇంటిలో పూజ గది లో దేవుళ్ళకి హారతి ఇచ్చి ,ఆ హారతిని గ్రహించటం చేయాలి. ఇవి అరిష్టాలని పోగొడతాయి.


పసిపిల్లలకి ఒక ఏడాది పూర్తి అయ్యేవరకు ప్రతి మాసం లో జన్మ తిథి నాడు జన్మదినము చేయాలి .అ తరువాత ప్రతి ఏడది జన్మతిథి నాడు జన్మ దినం జరపాలి .ఇదీ మన సంప్రదాయం జన్మదినం నాడు కులదేవతలను ఉదయం నిద్ర లేచిన వెంటనే తలుచుకొని స్మరించాలి. ఆ తరువాత గణపతినీ , సూర్య భగవానుని ,ఆ తరువాత మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని నమస్కరించాలి. పుట్టినరోజు నాడు షేవింగ్ ,గోళ్లు తీయడం ,కలహం , ప్రయాణం , హింస విడిచి పెట్టాలి .

Related News

Guru Favorite Zodiac: బృహస్పతి సంచారంతో ఈ 2 రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు

Durga Puja Week Lucky Rashi: ఈ వారంలో లక్ష్మీ నారాయణ యోగంతో 5 రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారు

Shani Transit: దీపావళి నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం

Mangal Gochar 2024: అంగారకుడి సంచారంతో ఈ 3 రాశుల వారికి అపారమైన సంపద

Weekly Horoscope: అక్టోబర్ 6 నుంచి 12 వరకు రాశిఫలాలు

Horoscope 6 october 2024: ఈ రాశి వారికి ఉద్యోగులకు పదోన్నతి.. లక్ష్మీదేవిని ధ్యానించాలి!

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

×