Diwali 2024: హిందువులు అత్యంత ఘనంగా జరుపుకునే పండగల్లో దీపావళి కూడా ఒకటి. సాధారణంగా దీపావళి రోజు సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణేశుడిని, కుబేరుడిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. దీపావళి ప్రత్యేక పండుగ రోజు లక్ష్మీ దేవిని పూజిస్తే అంతా శుభమే కలుగుతుందని హిందువులు నమ్ముతారు. అంతే కాకుండా సంపద పెరుగుతుందని విశ్వసిస్తారు.
ఇవే కాకుండా ఇప్పుడు చెప్పే జ్యోతిష్య పరిహారాలు చేయడం వల్ల జీవితంలో మంచి జరుగుతుంది. అంతే కాకుండా మీ ఇంట్లో డబ్బుకు కూడా ఏ లోటు ఉండదు. మరి ఆ పరిహారం ఏంటీ ? ఎలా చేయాలనే విషయాలను గురించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి రోజు చేయాల్సిన పరిహారాలు:
ఈ దీపావళి రోజు రాత్రి 11:30 నుండి 12:30 గంటల మధ్య నెయ్యితో నింపిన 3 దీపాలను పూజా గదిలో ఉంచండి. ఈ దీపాలలోని ఒకదానిలో ఒక గుండ్రని వత్తిని , మిగిలిన రెండు దీపాలలో పొడవాటి వత్తిని ఉంచండి. ప్రతి దీపంలో ఒక తామర గట్టను ఉంచండి. కిరాణా దుకాణాల్లో కూడా ఇవి సులభంగా లభిస్తాయి. ఇలా చేసిన తర్వాత మూడు దీపాలను తీసుకొని, ఉసిరి లేదా బెల్వ పత్ర చెట్లలో ఏదైనా ఒకదాని దగ్గరికి వెళ్లండి.
చెట్టు దగ్గరికి వచ్చి రెండు పొడవాటి వత్తులతో ఉన్న దీపాలను వెలిగించి చెట్టు క్రింద ఉంచండి. దీని తరువాత, మీ అరచేతిపై అందులో గుండ్రని వత్తి ఉన్న దీపం పెట్టుకుని వెలిగించండి. ఆ తర్వాత మహాలక్ష్మీ దేవిని స్మరించుకోండి. అనంతరం మీ ఇంటి ఇలవేల్పును స్మరించండి. దీనితో పాటు, రుణ విముక్తి కోసం లేదా ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి కోసం దేవుడిని ప్రార్థించండి. ఇప్పుడు ఆ దీపంతో పాటు మిగిలిన రెండు దీపాలను చెట్టు దగ్గర ఉంచండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీకు ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి.
Also Read: మకరరాశి వాళ్లు వచ్చే ఆరు నెలలు జాగ్రత్త.. లేదంటే..?
దీపావళి రోజు రాత్రి మనం చెట్టు దగ్గర ఉంచే మూడు దీపాలలో, ఒకటి లక్ష్మీ దేవి కోసం. రెండు పొడవాటి వత్తి దీపాలలో ఒకటి వినాయకునికి, మరొకటి తల్లి సరస్వతికి. మూడు దీపాలు వెలిగించడం వల్ల అందరి దీవెనలు మీకు లభిస్తాయి. అంతే కాకుండా మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. ఫలితంగ మీ ఇంట్లో డబ్బుకు ఏలోటూ ఉండదు.