EPAPER

Diwali 2024: దీపావళి వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఎన్ని రోజులు ఈ దీపాల పండుగ జరుపుకోవాలి?

Diwali 2024: దీపావళి వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఎన్ని రోజులు ఈ దీపాల పండుగ జరుపుకోవాలి?

Diwali History: హిందువులు వైభవోపేతంగా జరుపుకునే పండుగ దీపావళి. అమావాస్య చీకట్ల నడుమ ప్రమీదల వెలుగులతో దేశమంతా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ప్రతి ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని కొలుస్తూ పూజలు చేస్తారు. కుటుంబం అంతా సంతోషంగా వేడుక నిర్వహించుకుంటారు. ఇంతకీ దీపావళి ఎందుకు జరుపుకుంటారు? దీపావళి వెనుకున్న చరిత్ర ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


దీపావళి వెనుకున్న కథలు..

దీపావళి పండుక వెనుక ఎన్నో గాథలు ఉన్నట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నట్లు చెప్తున్నాయి. రామాయణం, మహాభారతం, భాగవతాలలో దీపావళి ఏ సందర్భాలలో జరుపుకున్నో అనే విషయాల గురించి ప్రస్తావన ఉంది.


*అయోధ్య మహరాజు, తన తండ్రి దశరథుడి కోరిక మేరకు శ్రీరాముడు 14 ఏండ్లు వనవాసం వెళ్తాడు. తనతో పాటు భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు తోడుగా వెళ్తారు. వనవాస కాలంలో లంకాధీశుడు రావణాసురుడు సీతను అపహరిస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు, రావణుడిని సంహరిస్తాడు. శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకుని సతీసమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు. ఆ రోజు అమావాస్య కావడంతో రాజ్య ప్రజలంతా ఆయనకు దీపాలు పట్టుకుని స్వాగతం పలుకుతారు. నాటి నుంచి దీపావళి పండుగ జరుపుకుంటున్నారని రామాయణం ద్వారా తెలుస్తోంది.

*ఇక రాక్షస రాజు నరాకాసుడి పీడ విరగడైందనే సంతోషంతో ప్రజలు దీపావళి జరుపుకున్నట్లు మహాభారతం చెప్తోంది. ప్రాద్యోషపురానికి నరకాసురుడు రాజుగా ఉంటాడు. భీకర తపస్సు ద్వారా బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొందుతాడు. ఆ తర్వాత దేవతలను, రుషులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తాడు. నరకాసురుడి ఆగడాలు శృతి మించడంతో సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధిస్తాడు. ఆ సంతోషంలో ప్రజలు వేడుకలు నిర్వహించుకుటారు. ఆ రోజు అమావాస్య కావడంతో దీపాలను వెలిగించి సంబరాలు చేసుకుంటారు. అప్పటి నుంచి దీపావళి పండుగ మొదలైందనే కథ ప్రచారంలో ఉన్నది.

*మూడు లోకాలను ముప్పు తిప్పలు పెట్టిన బలి చక్రవర్తి అంతం అయిన రోజున ప్రజలు దీపాలతో వేడుక చేసుకున్నారని గ్రంథాలు చెప్తున్నాయి. శ్రీమహా విష్ణువు వామనుడి అవతారం ఎత్తి, బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కుతాడు. ప్రజలు తమ కష్టాలు తీరాయనే సంతోషంతో దీపావళి జరుపుకుంటున్నట్లు పురాణాలు చెప్తున్నాయి.

*అటు కౌరవులతో మాయా జూదం ఆడి ఓడిన పాండవులు 12 సంవత్సరాలు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు. తిరిగి తమ రాజ్యానికి వస్తారు. ఆ సమయంలో ప్రజలు వారికి దీపాలు వెలిగించి స్వాగతం పలికినట్లు పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి దీపావళి జరుపుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

*పాల సముద్రం నుంచి శ్రీమహాలక్ష్మి ఉద్భవించిన సందర్భంగా దీపావళి జరుపుకున్నారనే మరో కథ కూడా ప్రచారంలో ఉన్నది. మరణాన్ని దూరం చేసే అమృతం కోసం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తారు. ఆ సమయంలో శ్రీలక్ష్మీ దేవి ఉద్భవించి ప్రజలకు సకల ఐశ్వర్యాలను ప్రసాదించిందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అందుకే, దీపావళి రోజున అందరూ లక్ష్మీ పూజ చేస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి.

దీపావళి ఎన్ని రోజులు జరుపుకోవాలి?

దీపావళి మూడు రోజులు నిర్వహించుకునే పండుగ అని పండితులు చెప్తున్నారు. బలి త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అని మూడు రోజులగా నిర్వహించుకుంటారని వెల్లడించారు. ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళి వేడుక జరుపుకోవాలని సూచిస్తున్నారు. దీపావళి మూడు రోజుల్లో తొలి రోజు పార్వతీ పరమేశ్వరుల పూజ, రెండో రోజు సరస్వతీ పూజ, మూడో రోజు లక్ష్మీ పూజ జరుపుకోవాలంటున్నారు.

Read Also:  దీపావళి నాడు దీపాలు ఎందుకు వెలిగిస్తారు? పురాణాలు ఏం చెప్తున్నాయి? శాస్త్రీయ కారణాలేంటి?

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Horoscope 22 october 2024: ఈ రాశి వారికి ఊహించని ధనలాభాలు.. ఇష్టదేవతారాధన శుభప్రదం!

Laughing Buddha: లాఫింగ్ బుద్దా ఎవరో తెలుసా? ఆ విగ్రహం అంత పాపులర్ కావడానికి కారణాలు ఇవే

Budh Gochar 2024: ధన్‌తేరాస్‌లో మిథునం, సింహంతో సహా ఈ 4 రాశుల అదృష్టం మారుతుంది

Diwali Vastu Tips: దీపావళి నాడు ఇంట్లో ఈ మొక్కను నాటితే అప్పులన్నీ తీరిపోతాయి

Diwali 2024 : దీపావళి నాడు ఈ రాశుల వారు రాత్రికి రాత్రే రాజులు అవుతారు..

Jupiter Retrograde Effects: ఒక సంవత్సరం వరకు ఈ రాశుల వారికి ఆర్థిక సంక్షోభం తప్పదు

Big Stories

×