EPAPER

Neighbors  : మీ పక్కంటి వాళ్లకి ఆ వస్తువులు చేబోదులు ఇచ్చారా…?

Neighbors  : మీ పక్కంటి వాళ్లకి ఆ వస్తువులు చేబోదులు ఇచ్చారా…?


Neighbors : ఇరుగుపొరుగు అన్న తర్వాత ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి. ఏదైనా అవసరమై సాయం కోరితే చేయడంలో తప్పులేదు. అలాగే అవసరమైన ఏదైనా వస్తువు అడిగితే మన దగ్గర ఉంటే ఇవ్వొచ్చు. కానీ అలాంటి ఇచ్చేటప్పుడు ఏ వస్తువులు ఇవ్వాలి..ఇవ్వకూడదో తెలుసుకోవాలి. కొన్ని వస్తువు మనం వేరే వారికి ఇచ్చినప్పుడు ఇద్దరికి లాభం ఉంటుంది. కానీ కొన్ని రకాల వస్తువులు మన చేయి దాటి ఇవ్వడం వల్ల ఒక్కోసారి వాళ్లకి మేలు , మనకి నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఇంకొన్ని వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోను అరువు తెచ్చుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోను ఒకరు వాడిన చీపురు మరొకరు వాడకూడదు. అవసరమై పక్కింటి నుంచి చీపురు తీసుకుని మన ఇంట్లో ఉపయోగించకూడదు.

కారణం చీపురు కట్టను హిందూమతంలో లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తుంటారు. అందుకే చీపురును విసిరేయడం, కాళ్లతో తొక్కడం లాంటివి చేయకూడదని పెద్దవాళ్లు చెబుతుంటారు. చీపురుతో శుభ్రంగా తుడిసి ఎవరు తొక్కని ప్రదేశంలోనే పెట్టుకోవాలి..ఎక్కడపెడితే అక్కడ చీపురును పెట్టకూడదని కూడా శాస్త్రం చెబుతోంది. మన ఇంట్లో చీపురు వేరే వారికి ఇస్తే వెంటనే లక్ష్మీదేవి కూడా వెళ్లిపోతుందని పెద్దలు చెబుతున్నారు. ఒక్కోసారి పొరుగువారు కానీ పక్కింటి వాళ్లు కానీ గుండు సూదులు, కత్తులు, కత్తెర, చాకులు లాంటివి కావాలని అరువు అడుగుతుంటారు. కత్తెరలాంటివి కట్ చేయడానికి వినియోగిస్తుంటారు. అవి కుజతత్వానికి సంకేతం. అలాంతి కత్తెరలు, చాకులు ఇస్తే అవి ఇచ్చిన వాళ్లల్లో కానీ, తీసుకున్న వాళ్లలో కానీ భార్యా భర్తల మధ్య సంబంధాలకి బ్రేక్ జరుగుతుందని అర్థం. అందులే అలాంటి వస్తువులు షేర్ చేసుకోరాదు


ప్లాస్టిక్ వస్తువులు, ఉప్పు, ఆయిల్ కూడా ఇతరులకి అరువు ఇవ్వకూడదు. శనివారం పూట ఇతరుల ఇళ్ల నుంచి నూనె తెచ్చుకోకూడదంటారు పెద్దలు. నూనెను శనికి సంకేతంగా భావిస్తుంటారు. ఉప్పు కూడా లక్ష్మీదేవికి చిహ్నంగానూ చూస్తారు. అందుకే ఉప్పు కూడా చేతులు మారద్దని అంటారు. ఉప్పు చేతికి వారివురి మధ్య గొడవలు జరుగుతాయని అంటారు. లవణానికి అలాంటి లక్షణాలు ఉన్నాయట. ఇలా కొన్ని వస్తువులు మనం ఇవ్వకూడదు. తీసుకోకూడదు. ప్లాస్టిక్ వస్తువులు కూడా శని కిందకే వస్తాయి. ఫ్రీ గిఫ్ట్ లుగా ఇస్తుంటారు కొందరు . అలా ఇవ్వడం వల్ల కూడా నెగిటివ్ ప్రభావాలు కలిగే అవకాశాలు లేకపోలేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రకాల రాశులు వారికి కొన్ని వస్తువులు ఇవ్వకూడదు. వృషభరాశి కలిగినా వారు పాలు, పెరుగు కోసం పక్కంటి వెళ్లే గుణం ఉంటుంది. ఆ రాశి వారికి పాలు లాంటివి ఇచ్చిన వారికి ఆర్ధిక కష్టాలు ఎదుర్కొంటారని శాస్త్రం చెబుతోంది.

Related News

Saturn Lucky Zodiacs For 2024: శని అనుగ్రహంతో ఈ 3 రాశుల వారిపై ధన వర్షం

Navratri Auspicious Dreams: నవ రాత్రుల సమయంలో ఈ 5 కలలు వస్తే అన్నింటిలోను విజయం పొందుతారు

Mars Transit Horosope: ఉద్యోగులు, వ్యాపారస్తులకు కుజుడు శుభవార్తలు అందించబోతున్నాడు..

Shani Lucky Zodiacs: ఈ 3 రాశులపై శని ఆశీస్సులతో ఆనందం, డబ్బు పొందుతారు

Budh Gochar: బుధుడి సంచారం కన్యా రాశితో సహా ఈ 5 రాశులకు సిరి సంపదలు ఇవ్వనుంది

Durgapuja 2024 Vastu Tips: నవరాత్రుల్లో దుర్గాదేవి పూజలో ఈ వస్తువులు సమర్పిస్తే అదృష్టం తిరిగి వస్తుంది

Shardiya Navratri Day 3: రేపు శారదీయ నవరాత్రుల మూడవ రోజు.. చంద్రఘంటా దేవిని ఈ విధంగా పూజించండి

Big Stories

×