EPAPER
Kirrak Couples Episode 1

Curse: తరాలపాటు.. వేధించే శాపాల గురించి తెలుసా..?

Curse: తరాలపాటు.. వేధించే శాపాల గురించి తెలుసా..?

Curse: పెద్దలు చేసిన పనుల కారణంగా ఎదురైన కొన్ని శాపాలు.. 7తరాల పాటు వారి వంశాన్ని వేధిస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. అవే.. దేవశాపం, సర్పశాపం, ఋషిశాపం, మాతృశాపం, పితృశాపం. అసలు ఈ శాపాల అర్థం ఏమిటో తెలుసుకుందాం.


సర్పశాపం: కొందరు అదేపనిగా పాములను చంపుతూ ఉంటారు. దారిన పోయే పాములను వాటి మానాన వదిలేయకుండా.. వెంటాడి మరీ చంపేవారికి, పుట్టలను పగలగొట్టి సర్పాలను ఇబ్బందిపెట్టిన వారికి, పుట్టల మీద తెలియక మూత్రవిసర్జన చేసిన వారికి, రుతసమయంలో పుట్టలవద్ద సంచరించిన వారికి ఈ శాపం ప్రాప్తిస్తుంది.

ఋషిశాపం: మునులు, ఋషులు, సిద్ధులు లోక క్షేమంకోసం మూరుమూల ప్రాంతాల్లోని ప్రశాంత వాతావరణంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొందరు దేశ సంచారం చేస్తూ ప్రజలకు ధర్మ బోధ చేస్తుంటారు. మరికొందరు ప్రజల మధ్యే జీవిస్తూ.. సేవలో తరిస్తుంటారు. ఇలాంటి వారికి హాని చేయటం వల్ల బుుషి శాపం ప్రాప్తిస్తుంది.


దేవశాపం: దేవాలయాలు, ఇతర దేవతా స్థానాలను ధ్వంసం చేయటం, వాటి పవిత్రతకు భంగం కలిగించే పనులు చేయటం, అక్కడి సొత్తును కాజేయటం వల్ల దేవశాపం ప్రాప్తిస్తుంది.

మాతృ, పితృ శాపాలు: పుట్టింది మొదలు రెక్కలొచ్చే వరకు తమ బిడ్డల కోసం కొవ్వుత్తుల్లా కరిగే పోయే తల్లిదండ్రులకు హాని చేసిన వారికి ఈ శాపాలు ప్రాప్తిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు.. ముసలివారై, తమ పనుల కోసం పిల్లల మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు వారిని నిరాదరించటం, వారి మనసును కష్టపెట్టటం వంటివి చేయటం తగదు. అలాంటి సమయంలోనూ తల్లిదండ్రులు బిడ్డలను శపించరు. కానీ.. ఆ పాపానికి దైవం ఆ బిడ్డలకు ఈ శాపాలను ప్రాప్తింపజేస్తుంది.

Related News

Shash Rajyog Effect: దీపావళి తర్వాత ఈ 3 రాశుల వారు రాజ భోగాలు అనుభవించబోతున్నారు

Shiva Favourite Zodiac: శివుడికి ఇష్టమైన ఈ 5 రాశుల వారికి ప్రమాదాలు అస్సలు దరిచేరవు

Weekly Horoscope: వచ్చే వారం ఈ రాశులకు ధన లాభం-సంతోషం

October Horoscope Zodiacs: అక్టోబర్‌లో ఈ రాశుల వారికి వ్యాపారంలో అన్నీ విజయాలే

Shani Nakshatra Parivartan 2024: శతభిషా నక్షత్రంలోకి శని.. పూజకు ముందు ఈ రాశి వారికి అదృష్టం రాబోతుంది

Pradosh Vrat 2024: రెండవ ప్రదోష వ్రతం ఎప్పుడు ? తేదీ, శుభ సమయం, ప్రాముఖ్యత వివరాలు ఇవే

Horoscope 28 September 2024: ఈ రాశి వారికి ప్రమోషన్ ఛాన్స్.. ఇష్టదైవారాధన శుభకరం!

Big Stories

×