Big Stories

Chanting Omkar :ఓంకారం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి

- Advertisement -

Chanting Omkar : మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఓంకారాన్ని జపించాలని చెబుతున్నారు పండితులు. మిగిలిన శబ్దాలతో పోల్చితే ఓంకారం నుంచి పుట్టే ధ్వని మనస్సుకు శాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే అన్ని శబ్దాలకి నాంది ఓంకారమనన్న శాస్త్రాలు చెబుతున్న మాట. ప్రకృతిలో కూడా ఓంకార శబ్ధానికి ఎంతో విశిష్టత ఉందని చెప్పవచ్చు. ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు శరీరంలో ఒక రకమైన ప్రకంపనలు వస్తాయి. ఎంత ఒత్తిడి ఉన్నా శరీరానికి ఉపశమనం కలుగుతుంది. మనకి తెలియకుండానే ఏదో ఒక శక్తి లోపలికి ప్రవేశించిన భావన ఏర్పడుతుంది. ఓంకారాన్ని చక్కగా ఉచ్చరించగలిగితే ఆరోగ్య పరంగా మేలు జరుగుతుంద

- Advertisement -

డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పనికూడా ఉండదని నిపుణులు చెబుతున్న మాట. నాభి నుంచి ఓంకార శబ్దాన్ని పలికితే ఊపిరితిత్తులు శుభ్రపడతాయని శాస్త్రీయంగాను తేలింది. 32 సెకన్లపాటు ఈ శబ్దాని పలికితే ఆ ఫలితాలు వేరుగా ఉంటాయి. గుండెకి జరిగే రక్తప్రసరంగా సవ్యంగా సాగుతుంది కూడా…రోజుకి కనీసం పావుగంటైనా ఈ శబ్దాన్ని పలికితే ఒంట్లో ఉండే స్ట్రెస్ మొత్తం దూది పింజలా ఎగిరిపోతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. మెడిటేషన్ చేసే వారు 21 సార్లు ఓంకార శబ్దాన్ని పలికితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఒక మతానికి సంబంధించిన విషయంగా చూడొద్దని చెబుతుంటారు. థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల వారికి రోగం నుంచి విముక్తి కలుగుతుంది.

గొంతులో నుంచి పలికే ఈ బ్రహ్మండ శబ్దంతో థైరాయిడ్ ను ఉత్పత్తి చేసే హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయి. పూర్వం రోజుల్లో రుషులు రోజులు తరబడి నిద్రాహారాలు మాని ఘోరమైన తపస్సు చేయగలిగారంటే అది ఈ శబ్దానికి ఉన్న పవర్. ఓంకారం వచ్చే శక్తి వల్ల వాళ్లు అలా ఆరోగ్యంగా జీవించారు. ఏదైనా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా సరే ప్రశాంతాంగా ఈ శబ్దాన్ని జపిస్తే దాని ఫలితం కళ్లారా చూడచ్చు. ఫలితాన్ని స్వయంగా అనుభవించవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News