Big Stories

Mantras for Delayed Marriage : వివాహం కావడం లేదా అయితే ఈ మంత్రం జపించండి

Mantras for Delayed Marriage : వయసొచ్చిన కొడుకు, కూతుళ్లకి ఇంకా పెళ్లి కాలేదంటే తల్లిదండ్రులు ఎంతో మదనపడుతుంటారు. అయితే ఇంట్లో కొన్ని వాస్తుపరమైన దోషాలు కూడా దీనికి కారణమవుతాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ దోషాలను నివారించడం వల్ల సులభంగా పెళ్లవుతుందని సెలవిస్తున్నారు. అబ్బాయిలకు వివాహం చేయాలనుకుంటే వారి గది దక్షిణం లేదా పశ్చిమ దిక్కులో ఉండాలి.

- Advertisement -

కుటుంబంలో యుక్త వయసుకొచ్చిన కూతురు వివాహం చేసుకోడానికి సముఖంగా లేకపోతే గాజు ప్లేటులో క్రిస్టల్ బాల్స్ వేసి ఆమె గదిలోని ఉత్తర దిక్కును ఉంచండి. కుజ దోషం వల్ల పెళ్లిలో జాప్యం జరుగుతూ ఉంటే వారు ఉండే గది తలుపులకు ఎరుపు లేదా గులాబీ రంగు వేయండి. దీని వల్ల కుజ దోషం ప్రభావం తగ్గుతుంది. జన్మ జాతక చక్రంలో నాగదోషం కానీ కాలసర్పదోషం కానీ ఉండటం దీనివల్ల వివాహం అనేది అసలు సెట్ కాదట.

- Advertisement -

ఓం మహా యాక్షిని పతిమ్ వస్యం కురు కురు స్వాహా అని కొన్ని వేల సార్లు జపిస్తే కచ్చితంగా వివాహం అయ్యే ఆస్కారం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. వివాహం ఆలస్యం అయిన స్త్రీలు ఈ జపాన్ని జపిస్తే కచ్చితంగా లబ్ధి జరుగుతుందని వారు తెలియజేస్తున్నారు. పెళ్లి ప్రయత్నాలు విఫలమైన అమ్మాయి లేదా అబ్బాయిలు ఉండే గది గోడలకు పింక్, లేత పసుపు లేదా తెలుపు రంగులను ఉపయోగించాలి. దీని వల్ల వివాహ అడ్డంకులు తొలగిపోతాయి.

తొందరగా వివాహానికి సూచించబడిన కాత్యాయనీ మంత్రం :
ఓం కాత్యాయనీ మహామయే, మహాయోగిన్యాధీశ్వరీ !
నాంద్ గోప్సూతత్ దేవి పాటిమ్ మే కురు తే నమః !!

మంచి వివాహ జీవితానికి ఉద్దేశించిన కాత్యాయనీ మంత్రం :
ఓం షంగ్ శంకరాయ సకల్ జన్మర్జీత్ పాప్ విధ్వామ్స్ నాయ్ !
పురుషార్ద్ చౌతుస్టాయ్ లాభయ్ చ పాటిమ్ మే దేహి కురు కురు స్వాహ !!

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News