BigTV English

Changes in Uttarayanam:-ఉత్తరాయణంలో జరిగే మార్పులు ఇవే

Changes in Uttarayanam:-ఉత్తరాయణంలో జరిగే మార్పులు ఇవే

Changes in Uttarayanam:- సూర్యుడు ప్రయాణించే దిక్కును భూ వాతావరణంలో మార్పులు వస్తాయి. ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి ప్రారంభించి నదీ స్నానాలు చేస్తారు. వీటిని అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. మాఘ మాసంలో పుణ్యనదిలో స్నానం చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఆలయాల్లో దేవతామూర్తులను ప్రతిష్ఠ చేయటానికి ఈ సమయం యోగ్యమైందని పేర్కొన్నారు. యంత్రాల ద్వారా దేవతాశక్తిని ఆలయంలో నిక్షిప్తం చేయటానికి ఈ కాలంలో జరిగే గ్రహ సంచారం ఎంతో అనుకూలంగా ఉంటుంది.తెలుగువారి తొలి పండుగ ఉగాది ఉత్తరాయణం, చైత్రమాసంలో వస్తుంది.


ఉత్తరాయణ కాలంలోనే చెట్లు కొత్త చిగుళ్లు తొడుగుతాయి. పుష్పించి, కాయలు కాచి మధుర ఫలాలను ఇస్తాయి. స్త్రీ, పురుషుల మధ్య పరస్పర ఆకర్షణ ఎక్కువగా ఏర్పడేది ఈ కాలంలోనే అని విజ్ఞానశాస్త్రం చెబుతున్నది. వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. అప్పటివరకు వణికించిన చలి మెల్లగా తగ్గుముఖం పడుతుంది. సమశీతోష్ణ స్థితి నెలకొంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉత్తరాయణ పుణ్యకాలం సమస్త మానవాళికి పుణ్యప్రదం.

ఉత్తరాయణంలో దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెబుతుంది. సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం, శక్తి… ఈ రెండూ సౌరశక్తి విశేషాలు. వాటిలో దైవీశక్తిని గ్రహించిన మహర్షులు ఉత్తరాయణంలో సూర్యుడి ఉపాసన చేయాలని ప్రముఖంగా పేర్కొన్నారు. సూర్యుణ్ని నారాయణుడిగా, శోభను, శక్తిని పోషించే ఆయన మహిమను ‘లక్ష్మి’గా భావించి ఆరాధిస్తారు. లయ కారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వల్ల పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు అనుకూలం. సాధారణ వ్యవహారంలోనూ ఉత్తర దిక్కునూ, ఉత్తర భూములనూ పవిత్రంగా భావించడం అలవాటు.


సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఒకవైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలు గాను అభివర్ణించారు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయనం నందు మేలుకొని ఉంటారని అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని, ఆ విషయం అందరికీ చెప్పడం కోసమే పెద్దలు ఈ పండుగలను జరపడం మొదలుపెట్టారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×