EPAPER
Kirrak Couples Episode 1

Custard Apple Tree : సీతాఫలం చెట్టు ఇంట్లో ఉండవచ్చా..

Custard Apple Tree : సీతాఫలం చెట్టు ఇంట్లో ఉండవచ్చా..
Custard Apple Tree

Custard Apple Tree : ఇంటి నిర్మాణానికే కాదు చెట్లు, మొక్కల పెంపకంలోను వాస్తును ఫాలో అవుతుంటారు . ప్రత్యేకించి చెట్లను పెంచే విషయంలో ఈ వాస్తు పద్ధతిని పాటించడం ప్రత్యేకమే అని చెప్పాలి. వాస్తు ప్రకారం కొన్ని చెట్లు మన ఇంట్లో పెంచడం ఎంతో మంచిదని, మరికొన్ని చెట్లను పెంచే కూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అందుకు కారణాలు చెప్పారు. వాస్తుపరంగా చాలామంది సీతాఫలాన్ని నివాసం వుండే ఇంటి ఆవరణలో పెంచకూడదంటారు. ఇంటి ఆవరణలో ఉన్నట్లయితే దాన్ని తీసేయడం లేదా నరికి వేయడం చేయకుండా ఉసిరి లేదా అశోకా మొక్కల్ని అదే పరిధిలో పెంచితే దోషనివారణ పూర్తిగా తొలగిపోతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.


వాస్తు శాస్త్రం ప్రకారం సీతాఫలం చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా అంటే… పెంచుకోకూడదు అనే వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సీతాఫలం చెట్టును ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని సూచిస్తున్నారు. మన ఇంటి ఆవరణంలో సీతాఫలం చెట్టు ఉంటే దానిని నరికి వేయకుండా, చెట్టు పక్కనే ఉసిరి చెట్టు లేదా అశోక చెట్టును అదే పరిధిలో పెంచితే వాస్తు దోషం తొలగిపోతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఈ సీతాఫలాలతో లక్ష్మీ దేవిని పూజించడం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి, అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది. సీతాఫలం ఆధ్యాత్మికంగా ఎంతో మంచి ఫలితాలను ఇవ్వడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే విట‌మిన్ సి, రైబోప్లేవిన్, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎన్నో ఉంటాయి. సీతాప‌లాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు.

వాస్తు ప్రకారం మన ఇంటి ఆవరణంలో పెద్ద వృక్షాలను నాటకూడదు అని చెబుతుంటారు.అలా పెద్ద వృక్షాలను నాటడం వల్ల మన ఇంట్లోకి గాలి, వెలుతురు లేకుండా మన ఇంట్లో ఎప్పుడూ ప్రతికూల వాతావరణాన్ని ఏర్పరుస్తాయి అందుకోసమే పెద్ద చెట్లను ఇంటి ఆవరణంలో పెంచకూడదు అని చెబుతుంటారు.అదేవిధంగా బ్రహ్మజముడు, రేగు చెట్టు వంటి చెట్లను ఇంటి ఆవరణంలో పెంచకూడదు.


Related News

Horoscope 2 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Engilipoola Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ వచ్చేసింది, పువ్వులు ఎలా ఎంగిలి అవుతాయో తెలుసుకోండి

Navaratri 2024: నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సుల కోసం ఏ రంగు దుస్తులు ధరించాలొ తెలుసా ?

Lucky Zodiac Signs: అక్టోబర్‌లో వీరు పట్టిందల్లా బంగారమే !

Horoscope 1 october 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయం పదింతలు!

Surya Grahan 2024 : పితృ అమావాస్య నాడు సూర్య గ్రహణం రానుంది.. ఈ వస్తువులు దానం చేస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి

Shardiya Navratri 2024 : శ్రీ రాముడు కూడా శారదీయ నవరాత్రి ఉపవాసం చేసాడని మీకు తెలుసా ?

Big Stories

×