Big Stories

Bhadradri:భదాద్రిలో వసంతం మొదలైంది…

Bhadradri:భద్రాద్రి సీతారాముల కల్యాణోత్సవానికి ముందు ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా మంగళవారం నుంచి స్వామివారి కల్యాణోత్సవం పనులకి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. రామయ్య సన్నిధిలో వసంతోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ నెల 30న జరిగే వేడుకల్లో భాగంగా రోలు, రోకలికి పూజలు చేశారు.

- Advertisement -

ముత్తయిదైవులతో పసుపు కొమ్ముల్ని దంచి పసుపు తయారు చేశారు. అలాగే కళ్యాణ తలంబ్రాలు కలిపారు. అనంతరం బేడా మండపంలో స్వామివారిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేసి ఉత్సవ మూర్తులకు వసంతాలు చల్లి ఘనంగా డోలోత్సవం, వసంతోత్సవం వేడుకగా నిర్వహించారు. ఈ నెల 30న జరిగే సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ పనులను దేవస్థాన అర్చకులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

- Advertisement -

తొలుత ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఉత్తర ద్వారం వద్దకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు, మహిళలు పసుపు దంచి కల్యాణ పనులను ప్రారంభించారు. పసుపు, కుంకుమ, గులాలు, అత్తరులు, సుగంధ ద్రవ్యాలతో భక్తులు కల్యాణ తలంబ్రాలు కలిపారు.శేష భక్త జనంతో ఉత్తర ద్వారo వద్ద రామనామ స్మరణల మధ్య సందడి వాతావరణం నెలకొంది. ఈనెల 30, 31 తేదీలలో జరిగే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Wednesday Remedies:బుధవారం చేయకూడని పనులు

Kasi Prasad:కాశీ ప్రసాదంలో మార్పు ఎందుకు చేశారంటే

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News