EPAPER
Kirrak Couples Episode 1

Plants For Home: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే సంపదకు లోటుండదు

Plants For Home: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే సంపదకు లోటుండదు

Plants For Home: వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని చెట్లు, మొక్కలు చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ మొక్కలను ఇంట్లో నాటడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. కొన్ని రకాల చెట్లు, మొక్కలు ఇంట్లోకి సానుకూల శక్తులు ప్రవేశించేలా చేస్తాయి. అంతే కాకుండా ఇంట్లో సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తాయి. కొన్ని రకాల చెట్టను ఇంట్లో నాటడం ద్వారా ఇంట్లో వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ప్రస్తుతం ప్రతి ఇంట్లో పెంచుకోవాల్సి 5 రకాల మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రతి ఇంట్లో నాటాల్సిన 5 మొక్కలు..
తులసి:
హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్కను గౌరవప్రదంగా భావిస్తారు. వాస్తు శాస్త్రంలో కూడా తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం, ఈ మొక్కను ఇంటికి ఉత్తరం, ఈశాన్యం, తూర్పు దిశలో నాటాలి. తులసి మొక్క మన జీవితంలో ఆనందం, శాంతిని కలిగిస్తుంది అంతే కాకుండా అనేక రకాల సమస్యలను తొలగిస్తుంది. తులసిని విష్ణువు, లక్ష్మీదేవికి సంబంధించినదిగా భావిస్తారు. అందుకే దీనిని ప్రతిరోజు పూజిస్తారు.

శమీ చెట్టు:
వాస్తు శాస్త్రం ప్రకారం శమీ వృక్షం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది ఇంటికి దక్షిణ దిశలో ఉంచాలి. ఈ చెట్టును ఇంట్లో నాటడం ద్వారా శని అశుభ ప్రభావాలు ఇంటి నుండి తొలగిపోతాయి. అంతే కాకుండా ఇంట్లో ఆనందం , శ్రేయస్సు పెరుగుతాయి. ఇంట్లో శమీ వృక్షాన్ని నాటడం ద్వారా శివుని ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలలో గణనీయమైన పురోగతి ఉంటుంది. ఈ చెట్టు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమను పెంపొందిస్తుంది.


మనీ ప్లాంట్:
ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే చాలా మంచిదని భావిస్తారు. ఈ మొక్క పని డబ్బు సంబంధిత సమస్యలను తొలగిస్తుందని చెబుతుంటారు. ఈ మొక్క పెరిగేకొద్దీ, సంపద, గౌరవం కూడా పెరుగుతుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్క భౌతిక సుఖాలకు అధిపతి అయిన శుక్రుడికి సంబంధించింది. మనీ ప్లాంట్ అదృష్టాన్ని పెంచుతుంది.

Also Read: మీ ఇంట్లో సిరి, సంపదలు పెరగడం కోసం విష్ణువును ఇలా పూజించండి

అపరాజిత మొక్క:
అపరాజిత మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కను ఇంటికి తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిక్కులలో నాటాలి. ఈ తీగ లక్ష్మీదేవికి సంబంధించినది. ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది. అంతే కాకుండా ఉద్యోగ, వ్యాపారాలలో కూడా చాలా పురోగతి ఉంటుంది. ఈ మొక్క విష్ణువు, మహాదేవునికి కూడా చాలా ప్రియమైనది. దీని వల్ల ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదు.

ఉసిరి మొక్క:
వాస్తు శాస్త్రం ప్రకారం ఉసిరి మొక్క కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీన్ని ఇంటికి ఉత్తరం, తూర్పు దిశలో మాత్రమే నాటాలి. ఉసిరి మొక్క విష్ణువుకు ప్రీతికరమైంది. అందుకే ఈ మొక్కను ఇంట్లో నాటడం ద్వారా, విష్ణువు యొక్క ఆశీర్వాదం మీపై ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Grah Gochar October 2024: అక్టోబర్‌లో ఈ రాశి వారి జీవితంలో డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి కూడా ఉందా ?

Shani Gochar 2024: శని-రాహుల కలయికతో అక్టోబర్‌ నెలలో ఈ రాశుల విధి మారబోతుంది

Do not Donate these 5 things: పొరపాటున కూడా ఈ 5 వస్తువులు ఎవరికీ దానం చేయకండి

Lord Vishnu Pooja: మీ ఇంట్లో సిరి, సంపదలు పెరగడం కోసం విష్ణువును ఇలా పూజించండి

Mool Trikon Rajyog Horoscope: ప్రత్యేక యోగంతో ఈ 3 రాశుల జీవితంలో అన్నీ అద్భుతాలే..

Samsaptak yoga 2024: అక్టోబర్‌లో సంసప్తక యోగం.. ఈ రాశుల వారికి అదృష్టం

Big Stories

×