EPAPER

Yercaud : అందాలకు మరోపేరు ఏర్కాడ్

Yercaud : అందాలకు మరోపేరు ఏర్కాడ్

Yercaud : తమిళనాడులోని తూర్పు కనుమల్లో ఉన్న సర్వరాయ కొండల్లో సముద్రమట్టానికి సుమారు ఐదువేల అడుగుల ఎత్తులో ఉంటుందీ ‘ఏర్కాడ్‌’. దట్టమైన అడవిలో యూ ఆకారంలోని వంపుల్లో ప్రయాణిస్తూ వెళ్లడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. కాఫీ, నారింజ, పనస, జామ, యాలకులు, మిరియాల తోటలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో అభయారణ్యం కూడా ఉంది.


అబ్బురపరిచే వ్యూ పాయింట్స్..
ఇక్కడ ఉన్న పెద్ద సరస్సులో షికారు చేసేందుకు రకరకాల బోట్లు ఉంటాయి. ట్రెక్కింగ్‌ చేసేవాళ్లకీ ఈ ప్రాంతం అనుకూలమే. ఇక్కడి కొండల్లో రాళ్లతో సహజంగా ఏర్పడిన లేడీస్‌, జెంట్స్‌, చిల్డ్రన్‌, ఆర్థర్‌సీట్స్‌.. వంటి వ్యూ పాయింట్స్‌లో కూర్చుని చుట్టూ కనిపించే పచ్చని అడవుల్నీ, ప్రకృతి అందాలను చూస్తుంటే సమయమే తెలియదు. మెట్టూరు డ్యామ్‌, కావేరీ నదీ అందాలు, ఇతర ప్రదేశాల్ని దగ్గరగా చూసేందుకు టెలీస్కోపు కూడా ఉంది. ఇక్కడ ఎలుగుబంటి గుహ నుంచి ఉన్న సొరంగం కర్ణాటకలో బయటపడుతుందట.

పన్నెండేళ్లకు ఒకసారి విరిసే కురింజి పూలు..
ఇక్కడి ఓ గుహలో కావేరీ అమ్మవారి సహిత సర్వరాయని గుడి ఉంది. శత్రువుల నుంచి తప్పించుకున్న టిప్పుసుల్తాన్‌ ఈ గుహలోనే తలదాచుకున్నాడట. అన్నాపార్క్‌, కిలియూర్‌జలపాతం.. ఇలా మరెన్నో ప్రదేశాలు ఆకర్షిస్తాయి. పన్నెండేళ్లకోసారి విరిసే కురింజి పూల అందాలకీ, 30 రకాల అరుదైన ఆర్కిడ్‌ పూలకీ ఈ ప్రదేశం పెట్టింది పేరు. ఎమరాల్డ్‌ లేక్‌లో పడవ విహారం సందర్శకుల్ని మైమరిపించడం ఖాయం. సేలం నుంచి రోడ్డుమార్గంలో ఏర్కాడ్‌కు చేరుకోవచ్చు.


Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×