Big Stories

Diwali : ఈ వ్యాధి ఉంటే దీపావళి రోజు జాగ్రత్త

- Advertisement -

Diwali : దీపావళి.. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండగతో ఇంట్లో వెలుగులు నిండుతాయని ప్రజల విశ్వాసం. ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్‌ చేసుకుంటారు. మతాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి ఆనందంగా దీపావళి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చుకుంటారు. ఆస్తమా రోగులు మాత్రం ఈ పండగకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కాలుష్యాన్ని వారు తట్టుకోలేరు.

- Advertisement -

వ్యాధి మరింత ఎక్కువై చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. పొగ, టపాకుల శబ్ధం కారణంగా వాళ్లు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాబట్టి దీపావళి రోజు ఆస్తమా ఉన్నారు బయటికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుల సలహా తీసుకోవాలి. ఎప్పుడూ ఇన్‌హేలర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. పొగ ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దేశంలో రోజు రోజుకీ ఆస్తమా రోగులు బాగా పెరుగుతున్నారు.

వీళ్లు దీపావళి రోజు రాత్రి, మరుసటి రోజు ఉదయం కూడా బయటకు వెళ్లొద్దు. ఎందుకంటే ఈ సమయంలో కాలుష్య స్థాయి చాలా అధికంగా ఉంటుంది. అంతే కాకుండా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాణాసంచా పేల్చినప్పుడు గుండె చప్పుడు వేగమై ధమనులు కుచించుకుపోతాయి. ఆ తర్వాత అనేక సమస్యలు వస్తాయి.

ఇక చిన్న పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని టపాకాయలకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే బాణాసంచా పొగతో పిల్లలకు కళ్లలో సమస్యలు వస్తాయి. అంతేకాకుండా వాళ్లు తీవ్రమైన అలెర్జీలకు కూడా గురవుతారు. అంతేకాకుండా వృద్ధులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బాణాసంచా రేణువు కంట్లో పడితే కళ్లను రుద్దవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News