EPAPER

Astrology: నేటి రాశి ఫలాలు.. వీరికి ధన లాభ యోగం!

Astrology: నేటి రాశి ఫలాలు.. వీరికి ధన లాభ యోగం!

Astrology: నేటి రాశి ఫలాలు బుధవారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు తెలుసుకుందాం. ఏ రాశి వారికి శుభ పరిణామాలు ఉన్నాయో తెలుసుకుందాం.


మేషం:

మేష రాశి వారు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. దృఢ నిశ్చయంతో పనులు చేస్తే విజయం వరిస్తుంది. వీరికి ధన లాభయోగం. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య సమస్యలు తీరడంతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయుడిని పూజించడం మంచింది.


వృషభం:

ఈ రాశి వారికి గ్రహబలం మిశ్రమంగా ఉండడంతో శుభ ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. బంగారం, వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సమయపాలన పాటించాలి. ఈ రాశి వారు తప్పనిసరిగా వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి.

మిథునం:

మిథునం రాశి వారికి మంచికాలం. మానసిక ప్రశాంతత ఉంటుంది. వీరికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. పెద్దల సలహాలు పాటించాలి. బుద్ధిబలంతో పనులు పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కలహాలు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికంగా కలిసి వస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభఫలితాల కోసం మహావిష్ణువును ఆరాధించాలి.

కర్కాటకం:

కర్కాటక రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. లాభాలు పొందుతారు. కొత్త వస్తువులు కొనుగోలే చేస్తారు. అందరితో స్నేహంగా వ్యవహరించాలి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీలక నిర్ణయాలతో వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. రామాలయాన్ని దర్శించుకోవాలి.

సింహం:

ఈ రాశి వారికి అనకూలంగా లేదు. ఏదైనా పని ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అభిప్రాయం భేదం ఏర్పడడంతో నిరుత్సాహపరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. కనకధారాస్తవం చదవాలి.

కన్యరాశి:

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. పని ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కొన్ని సంఘటనలు మనస్తాపానికి గురిచేస్తాయి. శివుడిని పూజించాలి.

తుల రాశి:

తుల రాశి వారికి అనకూల ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్దిపై ఆలోచిస్తారు. అలంకరణ వస్తువులు కొనుగోలే చేస్తారు. ఆర్థికంగా లాభాలు వరిస్తాయి. మీకు రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఈశ్వరుడిని దర్శించుకోవాలి.

వృశ్చికం:

ఈ రాశి వారికి దైవబలం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా లాభం పొందుతారు. రావాల్సిన డబ్బు వస్తుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కొంతకాలం వేచి ఉండటం మంచిది. విజయాలు సాధిస్తారు. గణపతి అష్టోత్తరం పఠించాలి. వినాయకుడి ఆలయాన్ని దర్శించుకోవాలి.

ధనస్సు:

ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రారంభించిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. వ్యాపారులకు అనుకూల సమయం. బంధువులతో ఆచితూచిగా వ్యవహరించాలి. సమయపాలన అవసరం. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరమైన వాటిని ఆలోచిస్తారు. భయాందోళనలు వీడాలి. వినాయకుడిని పూజించాలి.

మకరం:

మకర రాశి వారికి అనకూల ఫలితాలు ఉన్నాయి. ప్రయత్న కార్యసిద్ధి ఉంది. కీలయ నిర్ణయాల విషయంలో ఆచితూచిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు చేయకూడదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటిస్తే కలిసి వస్తాయి. మాట పట్టింపులకు పోవద్దు. లక్ష్మీదేవి ఆరాధన చేయాలి.

కుంభం:

కుంభ రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు. భూలావాదేవీల్లో లాభాలు పొందుతారు. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంది. బంధువులతో అనవసర చర్చలు వద్దు. శుభ కార్య ప్రయత్నాల్లో ఆటంకాలు తలెత్తే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది.

మీనం:

మీన రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. ముందుచూపుగా వ్యవహరిస్తే ఆటంకాలు తొలుగుతాయి. కొంతమంది ఇబ్బంది పట్టే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచింది. ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆలోచనలు వస్తాయి. కలహాలకు దూరంగా ఉండడం మంచిది. వేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది.

Related News

Budh Gochar: అక్టోబర్ 10 న ఈ రాశుల వారి జీవితాలు అద్భుతంగా మారబోతున్నాయి

Lucky Zodiac Signs For Money: మేష రాశితో సహా ఈ రాశుల వారు త్వరలో గొప్ప అదృష్టవంతులు అవుతారు

Durga Puja Rashi 2024: దుర్గాపూజ సమయంలో ఈ రాశుల తల రాతలు మారబోతున్నాయి.. ఇందులో ఏ రాశులు ఉన్నాయంటే ?

Shardiya Navratri 2024 Day 4: నవ రాత్రులలో నాల్గవ రోజున కూష్మాండ దేవి పూజా విధానం వివరాలు ఇవే

Black Magic: ఫొటోలకు చేతబడి చేయొచ్చా? వామ్మో.. జాగ్రత్త, బలైపోతారు!

Laxmi Narayan Yog: 5 రోజుల తర్వాత తులా రాశిలో లక్ష్మీ నారాయణ యోగం..ఈ 3 రాశులకు బంగారు కాలం

Weekly Lucky Zodiacs: ఈ 3 రాశుల వారికి వచ్చే వారం అంతా బంగారు మయం కానుంది

×