EPAPER

Astrology: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా అదృష్టమే!

Astrology: నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా అదృష్టమే!

Astrology: జ్యోతిష్య ప్రకారం.. అన్ని గ్రహాలు రాశుల సంచారం రాశిచక్ర మార్పులు మొత్తం 12 రాశుల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఈ 12 రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.


 

మేషం: ఈ రాశి వారికి అదృష్టఫలాలు వరిస్తాయి. మానసికంగా దృఢంగా ఉండడంతోపాటు చేసిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు చేస్తున్న ప్రయత్నంలో అవసరానికి అనుగుణంగా సాయం అందుతుంది. చంద్ర ధ్యానం పఠిస్తే.. సమస్యలు తొలగడంతోపాటు ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. అలాగే వ్యాపారం సాధారణంగా ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుంచి మద్దతు ఉంటుంది.
వృషభం: వృషభ రాశి వారు ఈరోజు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు పొందుతారు. పెండింగ్ పనులను పరిష్కరించుకుంటే విజయం సాధిస్తారు. శత్రువులపై విజయం పొందుతారు. అయితే కొన్ని సంఘటనలు బాధను కలిగించవచ్చు. ముఖ్యంగా బంధువుల నుంచి ఫిర్యాదులు ఎదురవుతాయి. శివ సందర్శనం శుభప్రదం.
మిథునం: ఈ రాశి వారకి మంచి రోజు. చేపట్టిన వ్యవహారాల్లో శ్రమ ఫలించడంతో లాభాలు వస్తాయి. అయితే కీలక సమయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. ఒక్కోసారి మీరు చూపించే ఉత్సాహం నష్టం కలిగించవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా అడగకుండా ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకూడదు. చేసే పనిపై దృస్టి సారిస్తే విజయాలు చేకూరుతాయి.
కర్కాటకం: ఈ రాశివారికి జీవితం ఆనందకరంగా ఉంటుంది. మానసికంగా దృఢంగదా ఉంటారు. కుటుంబంతో ఆనందంగా సమయం కేటాయిస్తారు. అవసరానికి అనుగుణంగా డబ్బు చేతికి అందుతుంది. కీలక సమయాల్లో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. ఈ రాశి వారికి బంధువుల నుంచి ప్రభావం, ప్రాముఖ్యత పెరుగుతుంది. అందరి నుంచి ఆశించిన మద్దుతు లభిస్తుంది.
సింహం: సింహ రాశి వారు ఉదయం నుంచి చురకుగా కనిపిస్తారు. చేసే పనిలో ఆచితూచి వ్యవహరిస్తే అదృష్టం వరిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటారు. అయితే అనవసర ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరిస్తే పోగొట్టుకున్న సంపదను తిరిగి పొందవచ్చు. శివ పార్వతులను పూజిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
కన్యరాశి:  ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు వస్తాయి. కానీ అక్కడక్కడ గంరగోళం, ఒత్తిడి ఉండడంతో మీరు చేసే పనిలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంలో బలహీనతలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. తొందరపాటు పనులకు దూరం ఉండాలి. చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన దైవాన్ని పూజించాలి.
తులరాశి: ఈ రాశి వారికి అవసరానికి తగిన సహాయం అందుతుంది. చేసే పనిలో కీర్తిని పొందుతారు. బంధువులు, స్నేహితుల నుంచి మద్దతు ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. గోవింద నామాలు చదివితే వచ్చే సమస్యలు అనుకూలంగా మారుతాయి.
వృశ్చికం: ఈ రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. చేసే పనుల్లో ఊహించని ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో పనులు పూర్తి చేసుకోవాలి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ధనుస్సు: ఈ రాశి వారికి చేసిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మీతో ఉన్న అందరినీ కలుపుకోవడంతో చేపట్టిన పనులు త్వరగా పూర్తి కావడంతో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశ్వీరాదాలు పొందుతారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. ఇష్టమైన దైవాన్ని పూజిస్తే శుభప్రదంగా, ఫలప్రదంగా ఉంటుంది.
మకరం: ఈ రాశివారు మానసిక ఒత్తిడి జయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. బంధువులను కలుస్తారు. తొందరపడి పనిచేయకుండా ఆచిచూతి వ్యవహరిస్తే సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారంలో లాభాలు పొందుతారు.
కుంభం: కుంభ రాశివారికి మంచి రోజు. టీం సభ్యుల సహకారం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికపరంగా లాభం చేకూరుతుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. చేపట్టే పనులు సక్సెస్ కావడంతో కొంత ఆదాయం వస్తుంది. శివ నమస్మరణ తప్పనిసరి.
మీనం: ఈ రాశి వారికి శారీరక శ్రమ పెరుగుతుంది. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. పాత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో నిరుత్సాహం పడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. తొందపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆచితూచి వ్యవహరిస్తే వ్యాపారంలో లాభాలు ఉంటాయి. నవగ్రహ శ్లోకం చదివితే ఉపశమనం ఉంటుంది,


Tags

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×