BigTV English

Ellora : ఎల్లోరాలో ఏలియన్స్ సంచరించాయా……

Ellora : ఎల్లోరాలో ఏలియన్స్ సంచరించాయా……
Ellora

Ellora : రాతినే కొండగా మలిచిన దైవసన్నిథి కైలాశ ఆలయం. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహల్లోని కేవ్ 16లో ఈ ఆలయం ఉంది..కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం మాములు విషయంకాదు. ఈ గుడి ప్రత్యేకత అయితే పైనుంచి కిందకు చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం. ఇంతకీ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు. ఎందుకు నిర్మించారనే దానిపై విభిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి..100 అడుగులు ఆ రాయిని చెక్కారు.. పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్లపాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని గుర్తించారు.. క్రీస్తు శకంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది..


ఎంతో మంది విదేశీయులు, ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కట్టడాన్ని ఏమీ చేయలేకపోయారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. షాజహాన్ కుమారుడు ఔరంగజేబు మూడేళ్లపాటు ఆలయాన్ని నాశనం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు. గుడి ఆవరణలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి..ఈ మొత్తం నిర్మాణాన్ని పరిశీలిస్తే.. దీన్ని కట్టడం మాములు మనుషుల వల్ల కాదంటున్నారు. ఎందుకంటే ఆలయంలో చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది.

అలాగే ఆలయం దిగువన గుండ్రని రంధ్రాలు కూడా చాలా లోతుగా ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే ఆలయం కింద ఓ పట్టణం ఉందంటున్నారు. ఈ చిన్న గుహ నుంచి కిందికి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం. అప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరూ లేరు. కాని నాటి కట్టడాలు చూస్తే వేలఏళ్ల క్రిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా..ఈ నిర్మాణాన్ని అవే చేశాయా అనే సందేహాలు ఎప్పటి నుంచి ఉన్నాయి. ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అని తెలుస్తుంది..


Tags

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×