EPAPER

Numerology: మీ పుట్టిన తేదీ ప్రకారం.. ఏ వస్తువుల వల్ల అదృష్టం వరిస్తుందో తెలుసా.. ?

Numerology: మీ పుట్టిన తేదీ ప్రకారం.. ఏ వస్తువుల వల్ల అదృష్టం వరిస్తుందో తెలుసా.. ?

Numerology: న్యూమరాలజీ ప్రకారం, జాతకంలో గ్రహాల స్థానం ఎప్పటికి అప్పుడు బలపడుతుంది. అయితే న్యూమరాలజీలో పుట్టిన తేదీ ప్రకారంఏ వస్తువులను ధరించాలి లేదా ఏ వస్తువులను వెంట ఉంచుకుంటే అదృష్టం వరిస్తుందో తెలుస్తుంది. అయితే న్యూమరాలజీలో పుట్టిన తేదీ ప్రకారం ఏఏ తేదీ వారికి ఏ వస్తువులు వెంట ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


పుట్టిన తేదీ: 1, 10, 19, 28

న్యూమరాలజీ ప్రకారం సంవత్సరంలోని ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారు బంగారం ధరించాలి. బంగారం జాతకంలో గ్రహాల స్థానాన్ని బలపరుస్తుంది. ఇలా చేయడం వల్ల అఖండ విజయం సాధిస్తారు. దీని కోసం బంగారు నెక్లెస్, ఉంగరం లేదా చెవి కమ్మలు ధరించినా మంచి ఫలితాలు ఉంటాయి.


పుట్టిన తేదీ: 2, 11, 20, 29

ఏడాదిలో ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారు తరచూ వెండి నాణేన్ని తమ వద్ద ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలన్నీ క్రమంగా బలపడతాయి. దీంతో జీవితంలో విజయం సాధిస్తారు. ఇంట్లో కూడా ఎప్పటికీ ఆనందం, శాంతి ఉంటుంది.

పుట్టిన తేదీ: 3, 12, 21, 30

3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు పసుపు రుమాలును తమ వద్ద ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రహాల స్థితి బలపడుతుంది.

పుట్టిన తేదీ: 4, 13, 22, 31

4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు చెక్కతో చేసిన పెన్ను తమ వెంట ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆలోచించే శక్తి, అవగాహన పెరుగుతుంది. దీనితో పాటు మేధస్సు కూడా అభివృద్ధి చెందుతుంది.

పుట్టిన తేదీ: 5, 14, 23

5, 14, 23 తేదీల్లో పుట్టిన వారు ఆకుపచ్చ రంగుతో తయారు చేసినటువంటి పరుసును తమ వెంట ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రహాల స్థితి బలపడుతుంది. దీనివల్ల జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

పుట్టిన తేదీ: 6, 15, 24

6, 15, 24 తేదీల్లో పుట్టిన వారు వజ్రాన్ని ధరించాలి. ఇలా చేయడం వల్ల మీరు జీవితంలోని అన్ని సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.

పుట్టిన తేదీ: 7, 16, 25

7, 16, 25 తేదీలలో జన్మించిన వారు మెటల్ వాచ్ ధరించాలి. ఇలా చేయడం వల్ల మనిషి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు జీవితంలో ప్రతి నిర్ణయాన్ని ఆలోచనాత్మకంగా తీసుకునే శక్తి లభిస్తుంది. దీంతో భవిష్యత్తులో తప్పకుండా విజయం సాధిస్తారు.

పుట్టిన తేదీ: 8, 17, 26

8, 17, 26వ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ నీలిరంగు రుమాలును వెంట ఉంచుకోవాలి. ఇది వాతావరణంలో సానుకూల శక్తి యొక్క అనుభూతిని సృష్టిస్తుంది. దీంతో దృష్టి తప్పు దిశలో మరల్చకుండా తోడ్పడుతుంది.

పుట్టిన తేదీ: 9, 18, 27

9, 18, 27 తేదీల్లో పుట్టినవారు కాలవను చేతుల్లో కట్టుకోవాలి. ఇది చెడు కన్ను నుండి రక్షించడంలో సహాయపడటమే కాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

Tags

Related News

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Vastu Tips: చనిపోయిన వారి ఫొటోను ఇంట్లో ఏ దిక్కున పెట్టాలి ?

Shukra Gochar 2024: శుక్రుడి రాశిలో మార్పు.. మొత్తం 12 రాశులపై ప్రభావం

Shani Kendra Trikon Rajyog: ఈ 3 రాశుల వారిపై శని అనుగ్రహం వల్ల ధనవంతులు కాబోతున్నారు

Ashwin Month 2024 : అశ్వినీ మాసం ఎంత కాలం ఉంటుంది ? ఉపవాసాలు, పండుగలు జాబితా ఇదే..

Big Stories

×