EPAPER
Kirrak Couples Episode 1

Brahmotsavam:బ్రహ్మోత్సవాలకు సిద్దమైన చెరువుగట్టు

Brahmotsavam:బ్రహ్మోత్సవాలకు సిద్దమైన చెరువుగట్టు

Brahmotsavam:నల్గొండ జిల్లాలో ఉన్న చెరువు గట్టు ఆలయంలో శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. త్రేతా యుగం లో పరుశురాముడు 108 క్షేత్రములలో శివలింగాన్ని ప్రతిష్టించి కొన్ని వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాను . అట్టి క్షేత్రములలో చివరిదైన ఈ క్షేత్రం లో శివలింగాన్ని ప్రతిష్టించి ఘోరమైన తపస్సు చేశాను . ఎంతకు స్వామి వారి దర్శనం కలగలేదు దానికి కోపోద్రుక్తుడై ఆ శివలింగం పై పరశువుతో కొట్టే సమయంలో స్వామి ప్రత్యక్షమై ఈ క్షేత్రం చాలా మహిమానిత్వమైన విరాజిల్లుతుందని వాగ్దానం చేశాడటు. కలియుగాంతం వరకు భక్తుల చిరకాల కోరిక తీరుతుస్తుందని వరమిచ్చాడట. అప్పట్నుంచి ఇది సుప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్నది.


చెరువుగట్టు క్షేత్ర పరిధిలో కొండ కింద శ్రీ పార్వతీ అమ్మవారు కొలువుదీరారు. పరివార దేవతలుగా మల్లిఖార్జున స్వామి.. సుబ్రహ్మణ్యస్వామి.. భద్రకాళీ వీరభద్రస్వామి కొలువై ఉన్నారు. గట్టుమీద స్వామివారికి పరివార దేవతలుగా విఘ్నేశ్వరస్వామి.. ఆంజనేయస్వామి.. ఎల్లమ్మ తల్లి ఉన్నారు. క్షేత్రపాలకుడుగా కాలభైరవ స్వామి ఉన్నారు. అనారోగ్య సమస్యలు ఉన్న వారు ఆలయ ప్రాంగణంలో భక్తులు సంచరిస్తే వారికున్న రోగాలు మటుమాయం అవుతాయని భక్తుల నమ్మకం. అందుకే దేవాలయ ప్రాంగణంలో మండల.. అర్ధమండల దీక్ష తీసుకొని స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తుంటారు. స్వామివారి దర్శనానంతరం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఆపరేషన్ బండ ఉంటుంది. కడుపులో గడ్డలున్నవాళ్లు ఈ బండపై పడుకుంటే ఆ గడ్డలు కరిగిపోతాయంటారు.

చెరువుగట్టు ఆలయంలో ప్రతి నెలా అమావాస్య ముందు రోజు చతుర్దశి రోజు రుద్రహోమం చేయడం ఆనవాయితీ. ప్రతీ అమావాస్య రోజు స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించి తదనంతరం స్వామివారిని వాహనసేవలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ గావిస్తారు. ఆ రోజున సుమారుగా లక్ష మంది భక్తులు వస్తుంటారు. ఈఆలయం ప్రాంగణంలో నిద్ర చేసినవారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే కొందరు 11 అమావాస్యలు.. 9 అమావాస్యలు.. 7 అమావాస్యలు నిద్ర చేస్తుంటారు. గుట్టపై స్వామివారి పాదాలు ఉంటాయి. కోరికలు నెరవేరాలని భక్తులు తలపై పాదుకలు పెట్టుకొని తడిబట్టలతో 11, 21, 41 ప్రదక్షిణలు చేస్తారు.


Related News

Horoscope 30 September 2024: నేటి రాశి ఫలాలు.. ఆదాయాన్ని మించిన ఖర్చులు!

Vishnu Rekha In Hand: విష్ణువు రేఖ చేతిలో ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయాలే సాధిస్తారు

Tirgrahi yog 2024 October: త్రిగ్రాహి యోగంలో ఈ 3 రాశుల వారు డబ్బు పొందబోతున్నారు

Lucky Zodiac Sign : 4 రాజయోగాల అరుదైన కలయికతో ఈ 3 రాశుల వారు ధనవంతులు కాబోతున్నారు

October Lucky Zodiac: శని-రాహువు కలయికతో 5 రాశులకు అడుగడుగునా ప్రమాదాలే

October Month Lucky Rashifal: అక్టోబర్ లక్ష్మీ నారాయణ రాజయోగంతో వీరి జాతకం మారబోతుంది

Masik Shivratri 2024 September: మాస శివరాత్రి ఎప్పుడు ? తేదీ, పూజ శుభ సమయం ఇవే

Big Stories

×