Big Stories

Kadamba tree : కదంబ వృక్షానికి పూజతో కొత్త జీవితం

- Advertisement -

Kadamba tree : అతి సుకుమారమైనది కదంబ వృక్షం. పార్వతీదేవికి ఇష్టమైన ఈ వృక్షం నుంచి పువ్వులు కోసుకోకూడదు. కింద పడినవి మాత్రమే తీసుకుని పూజ చేయాలని శాస్త్రం చెబుతోంది. దేశంలో మూడు చోట్ల మాత్రమే ఈ వృక్షాలు కనిపిస్తున్నాయి. ఎరుప రంగు పూలనిచ్చే కదంబ చెట్టు వారణాశి , మదురై, త్రిపురాంతకంలో మాత్రమే కనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో కృష్ణ వృక్షంగాను, దక్షిణ భారతదేశంలో పార్వతి వృక్షంగా దీనికి పేరు ఉంది. కదంబ వనం గురించి మణిద్వీపంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. కదంబ వనమనేది జ్ఞానస్వరూపమైంది. కదంబ వనంలో అమ్మవారు శ్యామల రూపంలో ఉంటుంది. లలితా సహస్రనామాల్లో మంత్రిణి అనే దేవత పేరు ఉంది ఆమె శ్యామలాదేవి.

- Advertisement -

కదంబ వనంలో ఉండే శ్యామలాదేవి ఎన్నో శక్తులు ఉన్నాయని శాస్త్రాలు చెప్పే మాట . సంగీతం, సాహిత్యం వంటి కళల రూపాలలో బ్రహ్మ విద్యారూపంలోను, విద్యాదేవత, వాగ్దేవత శ్యామలాదేవి. అందుకే కదంబ వనంలో ధ్యానం చేసినా, స్మరించినా అవి జ్ఞానదాయకం అవుతాయి. భూమి మీద లభించే కదంబ జాతుల్లో సముద్రపాల ఒకటి. తీగ కదంబం కూడా అని పిలుస్తారు. తీగఆకారంలో కనిపించే ఈజాతి చాలా అరుదుగా ఉంటుంది. ఎక్కువగా కనిపించేది రాజ కదంబ జాతి మాత్రమే. ఇది వికసించినప్పుడు టెన్నిస్ బంతిలా కనిపిస్తుంది. చుట్టూ కేశాలు ఉంటాయి. పసుపు రంగును కలిగి ఉంటుంది. దీని నుంచి అద్భుతమైన సుగంధం వస్తుంటుంది. ధూళి కదంబం అనే మరో రకం కేవలం శృంగేరిలో మాత్రమే ఉంటుంది.

ఆకాశంలో నీటిని ఆకర్షించి భూమి మీద వాన కురిపించే శక్తి కదంబ వృక్షాలకు ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. కదంబ వనం ఉంటే వర్షాభావ పరిస్థితులను తేలిగ్గా బయటపడే మార్గం దొరికినట్టే. కదంబ వనంలో అమ్మవారిని ధ్యానించడం వల్ల మనకు దూరంగా ఉన్న ఫలాలు దరి చేరతాయని విశ్వాసం. లలితాదేవి పూజలో కదంబ పుష్పాలను తప్పకుండా వినియోగిస్తారు. కదంబ వృక్షానికి ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. గ్రహదోషాలు ఉన్న వారు కదంబ వృక్షానికి అర్చన చేస్తే సమస్యల నుంచి బయటపడతారని విశ్వాసం. ఈ పూజ చేసిన వారు పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News