EPAPER

Temples: ఆ ఆలయంలో కొబ్బరి మొక్క నాటితే మగ పిల్లాడు పుడతాడట, గులాబీ మొక్క నాటితే ఆడపిల్ల పుడుతుందట

Temples: ఆ ఆలయంలో కొబ్బరి మొక్క నాటితే మగ పిల్లాడు పుడతాడట, గులాబీ మొక్క నాటితే ఆడపిల్ల పుడుతుందట

Temples: ప్రపంచంలో పిల్లలు కలగక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు ఎంతో మంది ఉన్నారు. వంధ్యత్వం అనేది ఆధునిక ప్రపంచంలో ఎక్కువైపోయింది. మారుతున్న జీవనశైలి, ఆహార పద్ధతులు భార్యాభర్తల్లో సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తున్నట్టు ఇప్పటికే సైన్స్ చెబుతోంది. అయితే హిందూ మతం ప్రకారం ఎన్నో నమ్మకాలు ప్రజల్లో ఉన్నాయి. పిల్లలు కలగని భార్యాభర్తలు కొన్ని దేవాలయాలకు వెళ్లడం ద్వారా లేదా ఆ దేవాలయాల్లో ఇచ్చిన ప్రసాదం తినడం ద్వారా పిల్లలు పొందే వరాన్ని దక్కించుకుంటారని ఎంతోమంది నమ్మకం.


మనదేశంలో ఇప్పటికీ పిల్లల కోసం నోములు, వ్రతాలు, పూజలు ఎన్నో చేస్తూ ఉంటారు. గుడులు చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని ఆలయాలు సంతానోత్పత్తి వరాన్ని అందిస్తాయని చెప్పుకుంటారు. ఈ దేవాలయాలకు వెళ్లి దేవుడికి మొక్కడంతో పాటు అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని తినడం వల్ల… వారికి త్వరగా పిల్లలు కలిగే భాగ్యం దక్కుతుందని అంటారు. ఈ దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకోండి.

శివుడి ఆలయం
పశ్చిమగోదావరి జిల్లాలోని శివదేవుని చిక్కాల గ్రామం ఉంది. ఇక్కడ ఉండే శివుడి దేవాలయంలో శివరాత్రి రోజు పూజలు చేస్తారు. ఆ రోజు కచ్చితంగా మొక్కలు నాటుతారు. పిల్లల్లేని భార్యాభర్తలు మొక్కలు నాటడం వల్ల వారికి పిల్లలు కలిగే అవకాశం ఉంటుందని నమ్ముతారు. కొబ్బరి మొక్క నాటితే మగపిల్లాడు పుడతాడని, గులాబీ మొక్క నాటితే ఆడపిల్ల పుడుతుందని చెప్పుకుంటారు.


చిలుకూరు బాలాజీ టెంపుల్
చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళితే కచ్చితంగా వీసా వస్తుందని నమ్మకం ఉంటుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ కు కచ్చితంగా వెళ్తారు. అంతేకాదు ఈ ఆలయంలో గరుడ ప్రసాదం అందిస్తారు. ఆ ప్రసాదం కోసం మహిళలు అధికంగా వెళుతూ ఉంటారు. ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ ప్రసాదాన్ని అందిస్తారు. ఈ ప్రసాదం తింటే ఖచ్చితంగా పిల్లల పుడతారని నమ్ముతారు. చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాదులో ఉంది.

గుంటుపల్లి గుహలు
ఏలూరు జిల్లా కామవరపుకోటకు దగ్గరలో గుంటుపల్లి గుహలు ఉన్నాయి. కార్తీకమాసం వస్తే ఈ గుహలకు ఎంతోమంది భక్తులు వెళతారు. కార్తీకమాసం మూడో సోమవారం గుంటుపల్లి గుహలు జనాలతో నిండిపోతుంది. అక్కడ ఉండే శివుడి విగ్రహం ముందు మహిళలు నిద్ర చేస్తారు. నిద్ర చేసినప్పుడు కలలో పిల్లల వస్తువులు ఏవైనా కనిపిస్తే వారికి సంతాన భాగ్యం కలుగుతుందని నమ్ముతారు. అందుకే కార్తీకమాసంలో పిల్లల్లేని మహిళలు అక్కడికి ఎక్కువగా వెళుతూ ఉంటారు.

ద్వారకా తిరుమలేశుడు
తిరుమల తర్వాత అంతటి పేరును సంపాదించిన వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారకా తిరుమల. దీన్ని చిన వెంకన్న ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఏటా బ్రహ్మోత్సవాలను రెండుసార్లు నిర్వహిస్తారు. ఆ బ్రహ్మోత్సవాల్లో గరుత్మంతునికి పూజలు చేస్తారు. అక్కడ గరుడ ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. ఆ గరుడ ప్రసాదాన్ని పూజ అనంతరం అర్చకులు ప్రజలందరికీ ప్రసాదంగా అందిస్తారు. ఎవరైతే సంతానం లేని మహిళలు ఉంటారో వారు ఆ ప్రసాదం కోసం బారులు తీరుతారు. ఆ ప్రసాదాన్ని తినడం వల్ల తమకు సంతానం కలుగుతుందనేది వారి నమ్మకం. అయితే ఎవరు పడితే వారు ఆ గరుడ ప్రసాదాన్ని స్వీకరించకూడదు. గరుడ ప్రసాదం తీసుకోవాలనుకునే మహిళలు చాలా నిష్టతో ఉండాలి. ప్రసాదం తీసుకోవడానికి మూడు రోజుల ముందు ఇంట్లో పూజలు చేయాలి. మాంసాహారాన్ని ముట్టకూడదు. ఆ తర్వాతే ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించాలి.

Also Read: దీపావళి రోజు బల్లిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

పైన చెప్పిన ఆలయాలన్నీ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ ఆలయాలకు వెళ్లి దైవాన్ని దర్శించుకుని పిల్లలను కన్న భార్యాభర్తలు కూడా ఎందరో ఉన్నారు. సైన్స్ ను నమ్మేవారు ఇదంతా కేవలం కల్పితం అని కొట్టి పడేస్తారు. కానీ దైవాన్ని నమ్మేవారు మాత్రం ఆ దేవుని మహత్తు ఎంతో ఉందని విశ్వసిస్తారు. మేము ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని ఎలా స్వీకరించాలన్నది మీ ఇష్టం.

Related News

Elinati Shani: మకరరాశి వాళ్లు వచ్చే ఆరు నెలలు జాగ్రత్త.. లేదంటే..?

Lucky Rashi till December: దీపావళి నుండి క్రిస్మస్ వరకు వీరు రాజులా గడుపుతారు

Rahu Shani Nakshatra Gochar 2024 : శని-రాహువు అరుదైన పరివర్తన యోగం.. వీరికి అపారమైన సంపద రానుంది

Sun Transit Astrology: ఈ 3 రాశుల వారు సూర్యుడి దయతో సంతోషకరమైన సమయాన్ని పొందబోతున్నారు

Laxmi Narayan Yoga 2024: కేవలం మరో 5 రోజుల్లో ఈ 4 రాశుల వారు బుధుడి అనుగ్రహంతో కోటీశ్వరులు కాబోతున్నారు

Friday Lucky Zodiac: శుక్రవారం గౌరీ యోగం.. ఈ 5 రాశులపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది

Big Stories

×