EPAPER

Dhana Thrayodashi 2023 : ధన త్రయోదశికి బంగారం కొనబోయే ముందు.. !

Dhana Thrayodashi 2023 : ధన త్రయోదశికి బంగారం కొనబోయే ముందు.. !
Dhana Thrayodashi

Dhana Thrayodashi 2023 : దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశికి ఎంతో కొంత బంగారం కొంటే.. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని భారతీయుల నమ్మకం. అందుకే ఈ పండుగ వేళ.. బంగారం కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకుంటాయి. అయితే.. ఈ ధన త్రయోదశి సందర్భంగా మీరూ బంగారం కొనాలనుకుంటే.. కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోండి. లేకుంటే మీరు మోసపోవాల్సిరావచ్చు.


బంగారపు స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. బంగారం నాణ్యతను బట్టి దానిని 24, 22, 18 క్యారెట్లుగా విభజించారు. 24 కేరట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అంటారు. దీంతో నగలు తయారీ సాధ్యంకాదు. దీనిని బిస్కెట్ల రూపంలో అమ్ముతారు.దీనికి ఇతర లోహాలు కలిపి 22, 18 క్యారెట్ల బంగారంగా మార్చి నగల తయారీలో వాడతారు.
ఇందులో 22 క్యారెట్ల బంగారం స్వచ్ఛత, మన్నికపరంగా బాగుంటుంది.

మీరు ఏ బంగారునగ కొన్నా.. దానిపై హాల్ మార్క్ ఉందో లేదో చూడాలి. ఈ హాల్ మార్క్‌లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) లోగో, ఆభరణం స్వచ్ఛత, 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID ఉంటాయి.


ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. ఈ మార్క్ ఉంటే.. ఆ బంగారునగ ప్రభుత్వం సర్టిఫై చేసిందని అర్థం. ఈ మార్క్ ఉన్న నగను మీరు భవిష్యత్తులో అమ్ముకున్నా కూడా.. తరుగుపోను మంచి ధర పలుకుతుంది.

ఒకవేళ.. హాల్ మార్క్‌లో ఉన్న నాణ్యత కంటే తక్కువ నాణ్యమైన నగ అమ్మినట్లు తేలితే.. 2018 నాటి BIS చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం.. అమ్మిన సంస్థ.. కొనుగోలుదారుకు డబుల్ పరిహారం ఇచ్చి తీరాల్సి ఉంటుంది.

బంగారం ధర రోజురోజుకీ మారుతుంది. కనుక మీరు ఏదైనా నగను ఎంపిక చేసుకుని, అడ్వాన్స్ కట్టే ఉద్దేశంలో ఉంటే.. ఆ రోజు ధర ప్రకారమే డబ్బు కట్టి రసీదు తీసుకోండి. సాధారణంగా దీపావళి ఓ వారం ఉందనగానే బంగారం రేటు పెరుగుతుంటుంది.

ఆభరణాలు కొనేటప్పడు.. మేకింగ్ ఛార్జీ ఎంతో అడగాలి. ఈ చార్జి ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. అలాగే.. కొనే నగలో వజ్రాలు, కెంపుల వంటివి ఉంటే.. వాటి నాణ్యతా సర్టిఫికెట్‌ను అడిగి మరీ తీసుకోవాలి.

బంగారం కొనేటప్పుడు.. నగదుకు బదులు డిజిటల్ పేమెంట్‌ మోడ్‌ లేదా క్రెడిట్ కార్డ్‌ని వాడటం వల్ల అది ఒక ఆధారంగా ఉంటుంది.
నగ కొనేటప్పుడు.. ఆ నగ రీసెల్లింగ్, బైబ్యాక్ పాలసీ గురించి తెలుసుకోండి. కొనుగోలు తాలూకూ రసీదును అడిగి, షాప్ స్టాంప్ వేయించి మరీ తీసుకోండి.

Related News

Horoscope 8 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పండగే.. పట్టిందల్లా బంగారమే!

Ganesh Chaturthi 2024: అప్పుల బాధ తొలగిపోవాలంటే.. గణపతిని ఇలా పూజించండి

Lucky Zodiac Signs: సెప్టెంబర్ 18 నుంచి వీరికి డబ్బే.. డబ్బు

Horoscope 7 September 2024: నేటి రాశి ఫలాలు.. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయి!

Ganesh Chaturthi: గణేష్ చతుర్థి నాడు ఇలా చేస్తే దురదృష్టం దూరం అవుతుంది..

Trigrahi Rajyog Horoscope: మిథున రాశి వారిపై త్రిగ్రాహి యోగంతో ఊహించని మార్పులు జరగబోతున్నాయి

Ganesh Chaturthi 2024: వినాయక చవితి స్పెషల్.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా విష్ చేయండి..

Big Stories

×