EPAPER

Eloped Woman Protest: భర్తను కాదని మరిదితో పారిపోయిన మహిళ.. నెల రోజుల తరువాత రోడ్డుపై ధర్నా చేస్తూ..

Eloped Woman Protest: భర్తను కాదని మరిదితో పారిపోయిన మహిళ.. నెల రోజుల తరువాత రోడ్డుపై ధర్నా చేస్తూ..

Eloped Woman Protest| ప్రేమించే భర్త, చక్కని కాపురం వదిలేసి మరొక యువకుడి వ్యామోహంలో పడిన ఓ యువతికి విధి గుణపాఠం నేర్పింది. భర్తను కాదని తను ప్రేమించిన వ్యక్తితో పారిపోయిన ఆ మహిళ నెల రోజులు తిరగకుండానే రోడ్డున పడింది. తనకు న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ ఇంటి ఎదుట కూర్చొని వారం రోజులుగా నిరసన చేస్తోంది. ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది.


బిహార్ రాష్ట్రం ముజఫర్ పూర్ నగరానికి సమీపంలో ఉన్న జమాలాబాద్ గ్రామంలో నివసించే కిరణ్ దేవి గత వారం రోజులుగా గ్రామ సర్పంచ్ ఇంటి ముందు నిరసన చేస్తోంది. ఆమెను ఆ గ్రామ సర్పంచ్ కుమారుడు మనీష్ మోసం చేశాడని తనకు న్యాయం చేయాలని ఆమె తన నాలుగేళ్ల కొడుకుతో నడిరోడ్డుపై కూర్చొని దీనావస్థలో నిరసన చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. జమాలాబాద్ గ్రామానికి చెందిన ప్రమోద్ దాస్ అనే యువకుడితో కిరణ్ దేవి అనే యువతికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏడాది తరువాత ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో నగరంలో చదువుకొని అప్పుడే గ్రామానికి వచ్చిన మనీష్ అనే యువకుడు వచ్చాడు. మనీష్ మరెవరో కాదు.. ప్రమోద్ దాస్ కు వరుసకు తమ్ముడి వరుస దూరపు బందువు. పైగా ఆ గ్రామానికి సర్పంచ్ కుమారుడు. అనుకోకుండా మనీష్ ఒక రోజు ప్రమోద్ దాస్ ఇంటికి వచ్చాడు. అక్కడ ఎంతో అందంగా ఉన్న కిరణ్ దేవిని కలిశాడు. ఆ తరువాత తరుచూ వారింటికి వచ్చేవాడు. ఈ క్రమంలో వరుసకు తన వదిన అయిన కిరణ్ దేవితో మనీష్ కు సన్నిహితంగా మెలిగేవాడు.


ఆ తరువాత వారిద్దరూ ప్రతిరోజు ఫోన్ లో మాట్లాడుకునేవారు. కొన్ని నెలల తరువాత ఒక రోజు మనీష్ తాను కిరణ్ దేవిని ప్రేమిస్తున్నాని చెప్పాడు. కిరణ్ దేవి కూడా అతడి ప్రేమలో పడింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో మనీష్ ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పాడు. కానీ తమ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించవు గనుక గ్రామం వదిలి ఢిల్లీ పారిపోదామని.. అక్కడే ఇద్దరం కలిసి సంతోషంగా ఉంటామని కిరణ్ దేవిని నమ్మించాడు.

మనీష్ లాంటి యువకుడిని గుడ్డిగా నమ్మిన కిరణ్ దేవి ఒక రోజు గుట్టు చప్పుడు కాకుండా తన మూడేళ్ల కొడుకుని తీసుకొని మనీష్ తో కలిసి పారిపోయింది. ఒక మారుమూల గ్రామంలోని గుడికి వెళ్లి అక్కడ వారిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఢిల్లీ నగరానికి వెళ్లి ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. జీవనం సాగించేందుకు మనీష్ కూలీ పనికి వెళ్లే వాడు. అంతా బాగానే గడిచేది. కానీ సరిగా నెల రోజుల తరువాత మనీష్ ఒక రోజు ఇంటికి రాలేదు. ఇంట్లో కిరణ్ దేవి తన బిడ్డను తీసుకొని అతడి కోసం ఎదురు చూస్తూ ఉంది. మూడు రోజులైనా మనీష్ తిరిగి రాలేదు. అతని ఫోన్ స్విచాఫ్ ఉండే సరికి.. ఏం చేయాలో తోచక పొరుగింటి వారి సాయం అడిగి రైలు టికెట్ తీసుకొని తిరిగి తన గ్రామానికి చేరుకుంది.

Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?

అక్కడ మనీష్ ఇంటికి వెళ్లగా అతని తండ్రి గ్రామ సర్పంచ్ ఆమెను ఇంట్లోకి రానివ్వలేదు. ఎక్కడ ఉండాలో తెలియక కిరణ్ దేవి తన మొదటి భర్త.. ప్రమోద్ దాస్ ఇంటికి వెళ్లింది. కానీ ప్రమోద్ దాస్ ఆమెకు కొంత డబ్బులిచ్చి పంపించేశాడు. ఇక అప్పటి నుంచి కిరణ్ దేవి.. గ్రామ సర్పంచ్ ఇంటి ముందు కూర్చొని తన భర్త మనీష్ ని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తోంది. మనీష్ ను అతని తండ్రి ఎక్కడో దాచిపెట్టాడని కిరణ్ దేవి ఆరోపణలు చేసింది.

అయితే ఈ విషయంలో పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని.. తమ వరకూ విషయం వచ్చినప్పుడు సాయం చేస్తామని తెలిపారు.

Related News

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Big Stories

×