Telangana Police using Drones for Case Instigations: విశ్వనగరంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ నగరంలో నేరాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. నగర పరిధి బాగా పెరిగింది. పోలీసులకు సకాలంలో నేరగాళ్లను పట్టుకోలేకపోతున్నారు. గత ఏడాద 8.97 శాతం కేసులు పెరిగాయి. డయల్ 100కి ఫోన్ కాల్ చేసినా సంఘటన స్థలానికి ట్రాఫిక్ జామ్ తో పోలీసులు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు. దీంతో పోలీసులు నిర్ణక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నేరస్తులను పట్టుకుంటున్నారు పోలీసులు కొన్ని సందర్భాలలో ఘటన ప్రాంతానికి చేరుకునేలోగా ఆనవాళ్లు తొలగిపోతున్నాయి. అందుకే ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని తెలంగాణ పోలీసు శాఖ భావిస్తోంది. డ్రోన్స్ విధానం ద్వారా నేరస్థులను సకాలంలో గుర్తించడమే కాకుండా..కొన్ని సందర్భాలలో నేరాలు జరగకుండా నిరోధించవచ్చని భావిస్తున్నారు పోలీసులు.
నేరాల పరిశోధనలో..
ఇప్పటిదాకా సైన్యం, రక్షణ విభాగాలలో కీలక పాత్ర వహించాయి డ్రోన్లు. శత్రు స్థావరాలపై నిఘా, నక్సల్స్ గాలింపు చర్యలలో డ్రోన్స్ ఉపయోగించేవారు.ఇప్పుడు తెలంగాణ పోలీసులు డ్రోన్లను ఉపయోగించి అత్యాధునిక పద్ధతిలో నేరాలను నిరోధించవచ్చని భావిస్తోంది. ఇప్పటికే డ్రోన్స్ వినియోగంలో పోలీసులకు శిక్షణ నిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. డ్రోన్లను ఎలా వినియోగించాలి..ఎలాంటి పరిస్థితిలో వాటిని ప్రయోగించాలి. అలాగే నో ఫ్లయింగ్ జోన్లపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వాలని చూస్తున్నారు.
ట్రాఫిక్ జామ్ నిరోధించేందుకు
ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ డ్రోన్ సహాయంతో ఎక్కెడెక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది..ఏ ప్రాంతాలలో వాహనాలను తరలించవచ్చో ఇకపై ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ డ్రోన్లకు లేటెస్ట్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) జోడించి పకడ్బందీగా నేర పరిశోధనకు ఉనయోగించాలని భావిస్తున్నారు. అలాగే ప్రకృతి విపత్తుల సమయంలో రెస్క్యూ టీమ్ వెళ్లలేని చోటికి ఈ డ్రోన్స్ పంపించి సాయం అందించేలా తర్ఫీదు నిస్తారు. ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితిలో మందులు అవసరం అవుతాయి. లేదా బ్లడ్ అవసరం ఉంటుంది. అలాంటప్పుడు ఒకచోట నుంచి మరో చోటికి చేరుకోవడానికి గంటల వ్యవధి అవుతుంది. అలాంటప్పుడు ఈ డ్రోన్ల సాయంతో సకాలంలో వైద్య సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడినట్లవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని పోలీసు శిక్షణ కేంద్రాలలో పోలీసు కానిస్టేబుళ్లకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
Also Read: Deputy CM Bhatti: ఆందోళన వద్దు.. అందరికి రుణమాఫీ
హైదరాబాద్ పేరు మార్మోగేలా..
విశ్వనగరం గా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లాంటి సిటీకి డ్రోన్స్ సేవలు పోలీస్ నేర విభాగానికి అత్యవసరం అని పోలీసు అధికారులు అంటున్నారు. ఇప్పటిదాకా పోలీసు శిక్షణలో శారీరక, మానసిక శిక్షణలే ఇచ్చేవారు. ఇకపై డ్రోన్ల వినియోగంపైనా శిక్షణ ఇచ్చే విధంగా పోలీసు నేర విభాగంలో పలు మార్పులు చేస్తున్నారు.
డ్రోన్ లు అందుబాటులోకి తెస్తే హైదరాబాద్ పేరు మరింతగా మార్మోగుతుందని స్థానిక ప్రజలు అంటున్నారు. ఇప్పటిదాకా నేరాలు పోలీసులకు సవాళ్లు విసిరేవి..ఇకపై నేరగాళ్లకే పోలీసులు సవాళ్లు విసిరేలా చేస్తాయి ఈ డ్రోన్లు నిస్సందేహంగా అని కితాబునిస్తున్నారు స్థానిక ప్రజలు.