EPAPER

Telangana Police: అలాంటి తప్పులు చేసేవారికి ఇకపై వెరైటీ శిక్షలు.. తెలంగాణ పోలీసుల వినూత్న నిర్ణయం!

Telangana Police: అలాంటి తప్పులు చేసేవారికి ఇకపై వెరైటీ శిక్షలు.. తెలంగాణ పోలీసుల వినూత్న నిర్ణయం!

Telangana Police Change the Petty Case Punishment Victims into Social Service: రోజురోజుకూ ఎంత పోలీసు నిఘా ఉన్నా..ఆడవారిపై ఈవ్ టీజింగ్ నేరాలు, మద్యం తాగి వాహనాలు నడపడాలు, కాలేజీలలో ర్యాగింగులు, భార్యలను హింసించడం, షాపింగ్ మాల్స్ లో చేతివాటం చూపించడం,సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్లు దొంగిలించడం, దొంగ తాళాలతో బైకులు తస్కరించడం ఇవన్నీ చిన్న చిన్న పెట్టీ కేసుల కిందకు వస్తాయి. వీళ్లందరికీ ఇప్పుడు జైళ్లు కూడా దొరకడం కష్టమైపోతోంది. పైగా వీళ్లని అరెస్ట్ చేసి కేసు నడిచినంతకాలం వీళ్ల పోషణ కూడా పోలీసులకు భారంగా మారింది. గతంలో ఇలాంటి కేసులకు ధన రూపంలో జరిమానాలు విధించేవారు.


లేకపోతే సింపుల్ గా రెండు లేక మూడు రోజుల పాటు జైలులో ఉంచడం చేసేవారు. అలా చేసినా మళ్లీ మామూలే. నేరాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. నేరస్తులలో పరివర్తన కూడా కలగడం లేదు. సరదాగా ఓ వారం పాటు జైలుకు వెళ్లి వస్తే చాలు మళ్లీ మన పని మనం చేసుకోవచ్చని భావిస్తున్నారు నిందితులు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షలకు పైగా కేసులు నమోదవడం గమనార్హం. వీటన్నింటినీ చూసుకోవడం తెలంగాణ పోలీసు వ్యవస్థకు తలనొప్పిగా మారింది. పైగా డిపార్టుమెంట్ లో సిబ్బంది కొరతతో వీటి పరిష్కారం రోజురోజుకూ జఠిలం అవుతోంది.

నిందితులతో సామాజిక సేవ


తెలంగాణ పోలీసులు ఈ విషయంలో ఇకపై అలాంటి నిందితులకు జైలు, జరిమానాలు కాకుండా వెరైటీ శిక్షలు విధిద్దామనుకుంటోంది. నిందితులతో సామాజిక సేవ చేయించడం ద్వారా వారిలో సత్ప్రవర్తన తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఉదాహరణకు కాలేజీలో ర్యాగింగ్ కు పాల్పడ్డ నిందితులతోనే అదే కాలేజీ క్యాంపస్ లో వారితోనే ర్యాగింగ్ చేయడం ఎంత తప్పూ విద్యార్థులకు వివరించేలా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సదరు సందేశాత్మక శిక్షలు అమలు చేయాలని యోచిస్తోంది తెలంగాణ పోలీసు శాఖ.

Also Read: Revanth Reddy: కుక్కల దాడిలో బాలుడు మృతి.. ఘటనపై స్పందించిన రేవంత్ రెడ్డి

వాస్తవానికి ఈ తరహా సామాజిక సేవలు చేసే ప్రత్యామ్నాయ శిక్షలు అమలుకు 1978లోనే ఓ చట్టం అమలులో ఉంది. అయితే పోలీసులు ఆ చట్టాన్ని ఇన్నాళ్లూ లైట్ గా తీసుకుని నేరస్థులకు కఠిన శిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయినా నిందితులలో ఎలాంటి మార్పులు రాకపోవడం..పైగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతో ఇక ఇలాంటి తరహా శిక్షలు అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అసలు ఇలాంటి చిన్న నేరాలను చేసే నిందితులకు శిక్షలు కాదు..వాళ్లలో మార్పు వచ్చేలా సామాజిక సేవ చేయంచుకోవాలని యూపీ కి చెందిన కోర్టు నందా అనే నిందితుడి కేసులో పేర్కొంది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆ దిశగా నేరస్థులలో మార్పులు తేవాలని ఆలోచిస్తున్నారు.

Tags

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×