EPAPER

Crime:ఇకపై సినిమాలలో అలాంటివి చూపిస్తే కఠిన చర్యలు

Crime:ఇకపై సినిమాలలో అలాంటివి చూపిస్తే కఠిన చర్యలు

Supreme Court issues guidelines on portrayal of persons with disabilities


కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ణుడు ఆరిస్టాటిల్ హాస్యం గురించి ఇలా అన్నారు. ‘ప్రస్తుత సమాజంలో యువత వెర్రిచేష్టలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ సమాజం ఎటుపోతుందో? ఏమవుతుందో తలచుకుంటేనే భయం వేస్తోంది’ అని అన్నారు. ప్రస్తుతం సినిమాలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వినోదం పేరిట వికృత హాస్యం అందిస్తున్నాయి. దివ్యాంగుల పాత్రలు సృష్టించి వారిపైనే భయంకరమైన జోకులు వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయి. ముఖ్యంగా అలాంటి సన్నివేశాలు చూసిన చిన్నారులు, యువకులలో మన పక్కనే తిరుగుతున్న దివ్యాంగులను చిన్నచూపు చూస్తున్నారు. కుంటి, గుడ్డి, మూగ, చెవుడు లాంటి పాత్రల నుంచి వెగటు హాస్యం క్రియేట్ చేస్తున్న సన్నివేశాలు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తాయో తెలియదు గానీ ఇలాంటివి ప్రసారం చేసే ఛానళ్లు, సినిమాలు కూడా కామెడీ గా భావించాలని చెబుతూనే వాళ్లను అవమానాలకు గురిచేస్తున్నారు.

తెలుగు సినిమాలలో వెగటు హాస్యం


ఇరవై ఏళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది. అందులో అల్లు రామలింగయ్యకు ఒక కాలు కుంటి. దానితో ఆ పాత్రకు కుం.క అని పెట్టేశారు. కుం.క అంటే కుంటి కనకయ్య. రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్ రంగస్థలంలో రామ్ చరణ్ చెవిటి పాత్ర. ఒకానొక సందర్భంలో సీనియర్ నరేష్ తన కొడుకైన రామ్ చరణ్ పై ఆపుకోలేని ఆగ్రహంతో చెవిటి నా కొడకా అనేస్తాడు. అల్లు అర్జున్ నటించిన బన్నీ సినిమాలో రఘుబాబు కళ్లులేని గుడ్డి పాత్ర పోషించారు. ఇక ఆ గుడ్డి పాత్రలో రఘుబాబు మీద సెటైర్లు వేయించాడు దర్శకుడు. విలన్ క్యారెక్టర్ చేసిన ప్రకాష్ రాజ్ రఘుబాబును పట్టుకుని ఆపుతావా నీ గుడ్డి పురాణం అంటూ కోప్పడతాడు. అయితే దివ్యాంగులను స్ఫూర్తిదాయకంగా చూపించిన సినిమాలు సైతం లేకపోలేదు. సుధాచంద్రన్ జీవితగాధ ఆధారంగా తీసిన మయూరి సినిమా అప్పట్లో ఎందరినో ఆలోచింపజేసింది. యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్న అమ్మాయి జాతీయ స్థాయిలో నృత్య కారిణిగా గుర్తింపు తెచ్చుకునే నేపథ్యంతో రూపొందించారు ఆ మూవీని. లయ, సాయికిరణ్ ప్రధాన పాత్రలలో వచ్చిన ‘ప్రేమించు’ మూవీలో లయ ఓ అంధురాలిగా నటించింది. అందులో లాయర్ గా నటించి మెప్పించింది. ఇలాంటి ఉదాత్తమైన సినిమాలు సభ్య సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

దివ్యాంగుల మనోభావాలు

అసలు ఇలాంటి సన్నివేశాలనుంచి హాస్యం పైకి బాగానే ఉన్నా దివ్యాంగులు తమ మనసులలో ఎంతగా బాధపడతారో వాళ్లకు తెలియదు. హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న జంధ్యాల సైతం అహ నా పెళ్లంట చిత్రంలో బ్రహ్మానందం ను నత్తి పాత్రలో, గుండు హనుమంతరావును చెవిటి పాత్రలలో చూపించి హాస్యాన్ని పండించారు. లోతుగా ఆలోచిస్తే దివ్యాంగుల మనోభావాలు దెబ్బ తీసినట్లే. అయితే ఇకపై దివ్యాంగుల మీద ఇలా ఇష్టారీతిన సినిమా పాత్రలు సృష్టిస్తే కుదరదు. అలాంటి మాధ్యమాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం నవ్వు తెప్పించుకోవడం కోసం ఇలాంటి పాత్రలు వాడుకోవడంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ డి.వై.చంద్రచూడ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. వీటిపై కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. అలాగే అలాంటి పాత్రలు క్రియేట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలన్నారు.

ఆంఖ్ మిచోలీ పై అభ్యంతరం

అలాంటి పాత్రలను చూపించాల్సి వస్తే హుందాగా చూపించాలని..వారు స్ఫూర్తిదాయకంగా నిలిచే పాత్రలు మాత్రమే చేయాలని సూచించారు. ఇందుకు సంబంధించి రచయితలు, దర్శకనిర్మాతలు అవగాహన కార్యక్రమాల వీడియోలు చెయ్యాలని సూచించింది. బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన ఆంఖ్ మిచోలీ సినిమాలో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నిపున్ మల్హోత్రా అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం ఇకపై అలాంటి సన్నివేశాలను పబ్లిక్ కు చూపించరాదని ఆదేశాలు జారీ చేసింది.

Tags

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×