EPAPER

Retired Employee Love: లేటు వయసులో సోగ్గాడి వేషాలు.. యువతులు కావాలని ఆ రిటైర్డ్ ఉద్యోగి ఏం చేశాడంటే..

Retired Employee Love: లేటు వయసులో సోగ్గాడి వేషాలు.. యువతులు కావాలని ఆ రిటైర్డ్ ఉద్యోగి ఏం చేశాడంటే..

Retired Employee Love| యవ్వనంలో మనిషి ప్రేమలో పడడం సహజం. కానీ ఒక వ్యక్తి ముసలి తనంలో మనసు పారేసుకున్నాడు. అయితే దానికి తగ్గటు ఫలితం కూడా అనుభవించాడు. ఒక రిటైర్డ్ ఉద్యోగి యువతులతో స్నేహం చేయాలని చేసిన విచిత్ర పనుల వల్ల భారీగా నష్టపోయాడు. అతను ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసి ఇటీవలే రిటైర్ అయ్యాడు. అయితే ఇంట్లో రిటైర్ అయిన తరువాత ఖాళీ ఉండలేక మగువలతో స్నేహం చేయడానికి గూగుల్ సెర్చ్ లో ఎస్కార్ట్ సర్వీస్ కోసం వెతికాడు. డేటింగ్ యాప్ ద్వారా యువతులను కూడా సంప్రదించాడు. అయితే ఆ సీనియర్ సిటిజెన్ డేటింగ్ వలయంలో చిక్కుకొని లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.


టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. కొన్ని నెలల క్రితమే రిటైర్ అయిన నరేష్ కుమార్ (పేరు మార్చబడినది) కోంపల్లి ప్రాంతంలో నివసిస్తున్నాడు. నరేష్ కుమార్ తన జీవితంలో ఒక ఆడ తోడు కావాలని ఆశపడ్డాడు. దీని కోసం జూలై నెలలో గూగుల్ సెర్చ్ లో ఎస్కార్ట్ సర్వీస్ ఇచ్చే ఏజెన్సీల కోసం వెతికాడు. ఈ క్రమంలో ‘దీపు సస్సీ’ సర్వీస్ అన ఏజెన్సీని సంప్రదించాడు. అయితే దీపు సస్పీ ఏజెన్సీ.. నరేష్ కుమార్ వాట్సాప్ లో యువతుల ఫొటోలు పంపించింది. వారి వివరాలు కావాలంటే ముందుగా రూ.1500 రిజిస్ట్రేష్ ఫీజు అవుతుందని ఏజెన్సీ తెలిపింది. దీంతో నరేష్ కుమార్ వెంటనే రూ.1500 చెల్లించేశాడు. డబ్బులు యుపిఐ ద్వారా రాకేష్ అహారీ అనే పేరు గల నెంబర్ కు పంపాడు.

ఆ తరువాత ఏజెన్సీ నుంచి యువతుల వివరాలు వాట్సాప్ ద్వారా వచ్చాయి. యువతి వయసు, రంగు, విద్యార్హత. ఆ యువతితో మాట్లాడాలంటే ఎంత ఫీజు, ఒక రోజు యువతితో గడపాలంటే ఎంత రేటు ఈ వివరాలన్నీ ఏజెన్సీ తెలియజేసింది.


ఆ తరువాత నరేష్ కుమార్ బాగా ఆలోచించుకొని ఏజెన్సీ వారికి మళ్లీ వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. కానీ ఏజెన్సీ వారు నరేష్ కుమార్ కు ప్రతిరోజు ఏదో ఒక విషయం చెప్పి.. ఆలస్యం చేశారు. దీంతో విసిగిపోయిన నరేష్ కుమార్ వారికి అడిగిన దాని కంటే ఎక్కువ చెల్లిస్తానని ఆఫర్ చేశాడు. తనకు త్వరగా ఒక అమ్మాయి కావాలని అడిగాడు. అప్పుడు ఆ ఎస్కార్ట్ ఏజెన్సీ వారు ఆయనకు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కోసం ముందుగా రూ.50 వేలు డిపాజిట్ చేయాలని అడిగారు. నరేష్ కుమార్ వెంటనే రూ.50 వేలు కిషన్ లాల్ గోమతి పేరుతో ఉన్న యుపిఐ నెంబర్ కు పంపాడు.

ఆ తరువాత ఎస్కార్ట్ ఏజెన్సీ తరుపున నరేష్ కుమార్ కు ఒక యువతి ఫోన్ లో మాట్లాడేది. అయితే ప్రతి రోజు ఫోన్ లో మాట్లాడాలంటే రూ.10000 నుంచి రూ.20000 తీసుకునేది. అలా కొన్ని రోజుల పాటు నరేష్ కుమార్ ఫోన్ లోనే ఎస్కార్ట్ సర్వీస్ యువతితో మాట్లాడేవాడు. కానీ నరేష్ కుమార్ ఒక రోజు ఆ యువతి రూ.3 లక్షలు అడిగింది. దీనికి నరేష్ కుమార్ ఒప్పుకోలేదు. అయినా ఆ డబ్బులు అప్పుగా ఇవ్వమని తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. దానికి నరేష్ కుమార్ ఒప్పుకున్నాడు. కానీ తనతో ఏకాంతంగా కలిసేందుకు రావాలని ఆ యువతిని కోరాడు. ఆ యువతి కూడా మరో రెండు రోజుల్లో కలుస్తానని చెప్పింది.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

అయితే రెండు రోజుల తరువాత ఆ యువతి ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో నరేష్ కుమార్ ఆమె కోసం మళ్లీ ఎస్కార్ట్ ఏజెన్సీకి వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. వారికి ఆ యువతి తన వద్ద రూ.3 లక్షలు తీసుకుందని.. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని అడిగాడు. దీంతో ఆ ఎస్కార్ట్ ఏజెన్సీ నరేష్ కుమార్ నెంబర్ ని బ్లాక్ చేసింది. అప్పుడు నరేష్ కుమార్ కు తాను మోసపోయానని అర్థమైంది. కానీ అప్పటికే నరేష్ కుమార్ మొత్తం రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఏం చేయాలో తెలియక నరేష్ కుమార్ సైబరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు నరేష్ కుమార్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. విచారణ చేస్తున్నారు.

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×