EPAPER

Online Trading: ట్రేడింగ్ స్కాంలో రూ. 2200 కోట్లు కొల్లగొట్టారు.. అంతా ఆన్‌లైన్ మహిమే..!!

Online Trading: ట్రేడింగ్ స్కాంలో రూ. 2200 కోట్లు కొల్లగొట్టారు.. అంతా ఆన్‌లైన్ మహిమే..!!

Scam: టెక్నాలజీ పెరుగుతున్నట్టే కుంభకోణాలు కూడా ఆర్థిక మోసాలు కూడా రంగులు మారుస్తున్నాయి. మనం మోసం పోయామని కూడా మనకు తెలియదు. తీరా డబ్బులన్నీ పోయాక కొంత సమయానికి గానీ తెలియరాదు. కొన్నిసార్లు మనకు మనమే మోస పోవడానికి పురికొల్పించుకుంటాం. మరేదో ఆశించి చేతులారా డబ్బులు మోసగాళ్లకు సమర్పించుకుంటాం. వాళ్లు బిచాణా ఎత్తేసే దాకా గంపెడు ఆశలతో లాభాల కోసం ఎదురుచూస్తుంటాం. పిషింగ్ లింక్‌లు పంపి మనల్ని క్లిక్ చేయించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడం ఒక విధామైతే.. మనకు మనమే డబ్బులు వారికి సమర్పించుకోవడం మరో పద్ధతి.


ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌లో ఈ రెండో పద్ధతిని మోసగాళ్లు ఫాలో అవుతున్నారు. ఈ స్కాములో మనమే పొలోమని వెళ్లి మోసపోతాం. తమది ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ అని చెప్పి వాళ్లు మోసపుచ్చుతారు. స్వల్ప వ్యవధిలోనే పెద్ద మొత్తంలో లాభాలను సంపాదించి అందిస్తామని నమ్మబలుకుతారు. వారి మాటలను విశ్వసించి డబ్బులు వారి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నామనే భ్రమలో పెట్టుబడులు పెడుతాం. ఆ తర్వాత కంపెనీ బోర్డు తిప్పేస్తుంది. పెట్టిన డబ్బులు అంతా ఆవిరైపోతాయి.

ఇలాంటి మోసపూరిత ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కాంలో భాగంగానే అసోంకు చెందిన ఇద్దరు ఘరానా చోరులు ఏకంగా రూ. 2200 కోట్లు వసూలు చేశారు. దిబ్రుగడ్‌కు చెందిన 22 ఏళ్ల ఫుకాన్, గువహతికి చెందిన స్వప్నిల్ దాస్‌లు ఈ మోసానికి తెరతీశారు. తమ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడు పెడితే 60 రోజుల్లోనే 30 శాతం లాభాలను గ్యారంటీగా అందిస్తామని చెప్పారు. చాలా మంది నుంచి డబ్బులు వసూలు చేశారు.


Also Read: Chamala Comments: జీప్ ఎక్కి మాట్లాడటం కాదు.. ప్రజల కష్టాలను చూడాలి: చామల

విలాసవంతమైన తన జీవన విధానాన్ని, లగ్జరీ లైఫ్‌ను ఇన్వెస్టర్లకు చూపించి పెట్టుబడులను ఫుకాన్ రాబట్టేవాడు. ఫుకాన్ నాలుగు ఫేక్ కంపెనీలను ఎస్టాబ్లిష్ చేశాడు. అస్సామీస్ సినిమాలో పెట్టుబడులు పెట్టాడు. ఈ స్కీంలో భాగంగానే అనేక ఇతర ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు వీరి నివాసాల్లో తనిఖీలు చేశారు. దిబ్రుగడ్‌లోని ఫుకాన్ నివాసంలో రెయిడ్ చేయగా.. ఈ స్కాంకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు లభించాయి. వీరితోపాటు అస్సామీ కొరియోగ్రాఫర్ సుమి బోరా కోసం పోలీసులు గాలింపులు జరుపుతున్నారు. సుమి బోరా కూడా ఫుకాన్ నెట్ వర్క్‌లో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇలాంటి మోసాలకు బలికావొద్దని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ సూచనలు చేశారు. ఇలాంటి అవాస్తవ, మోసపూరిత స్కీంలను నమ్మొద్దని తెలిపారు. ఇలాంటి ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీల ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి న్యాయబద్ధమైన వ్యవస్థ ఏమీ లేదని వివరించారు. ఇలాంటి స్కీంలకు దూరంగా ఉండాలని సీఎం హిమంత పిలుపు ఇచ్చారు. ఇలాంటి అక్రమ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లపై రాష్ట్ర పోలీసులు ఫోకస్ పెట్టారని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యవహారాలు ఎక్కడ కనిపించినా.. అనుమానాలు వచ్చినా పోలీసులు రంగ ప్రవేశం చేస్తారని హెచ్చరించారు. ఇన్వెస్టర్లు కూడా తమ డబ్బులు ఎక్కడ పెడుతున్నామో ముందుగా క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.

Tags

Related News

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Brother In law kills: రెండు నెలలపాటు అత్తారింట్లోనే అల్లుడు.. మరదలిని ఏం చేశాడంటే

Bride on Sale Elopes: కొత్త కోడలు చేసిన వంట తిని తీవ్రంగా నష్టపోయిన కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు! ..

Triangle Love Story: తిరుపతిలో దారుణం.. కత్తిపోట్లకు దారితీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

Passengers Beat Railway Employee To Death: రైల్వే ఉద్యోగిని చితకబాది హత్య చేసిన ప్రయాణికులు.. ఏం చేశాడంటే?..

Gujarath insident: గణేశుని నిమజ్జనంలో అపశృతి.. నదిలో మునిగి 8 మంది మృతి

Big Stories

×