EPAPER

Mumabai : ముంబైలో దారుణం.. తల్లి తండ్రి కళ్ళముందే నడిరోడ్డుపై వ్యక్తి హత్య

Mumabai : ముంబైలో దారుణం.. తల్లి తండ్రి కళ్ళముందే నడిరోడ్డుపై వ్యక్తి హత్య

Mumabai : మహారాష్ట్ర రాజధాని ముంబై లో దారుణం చోటు చేసుకుంది. నడి రోడ్డు పై కొందరు దుండగులు చెలరేగిపోయారు. మంచి చెడు మరిచి విచక్షణా రహితంగా ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. తల్లి తండ్రీ వారిస్తున్నా వినకుండా  దాడి చేయడంతో ఆకాష్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


ముంబై లోని మలాడ్ రోడ్ లో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఓ కారు ఢీకొట్టడంతో వివాదం మొదలైంది. అనంతరం ఆటో డ్రైవర్ కు మద్దతుగా నిలిచిన కొందరు వ్యక్తులు.. కారు డ్రైవర్ పై దాడి చేశారు. ఈ దాడిలో 28 ఏళ్ల నవ నిర్మాణ సేన కార్యకర్త ఆకాశ్ మీనన్ మరణించాడు. ఇక దాడి జరుగుతున్న సమయంలో అతని తల్లి తండ్రి పక్కనే ఉన్నారు.

ముంబైలోని మలాయ్ రోడ్ లో పుష్ప పార్క్ సమీపంలో కారు డ్రైవర్ ఆకాష్ ఓ ఆటో రిక్షాను ఓవర్టేక్ చేస్తూ ఢీ కొట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది. అనంతరం అక్కడి నుంచి ఆటో డ్రైవర్ వెళ్లిపోగా… అతనికి మద్దతుగా నిలిచిన కొందరు వ్యక్తులు కారు డ్రైవ్ చేస్తూ వచ్చిన ఆకాశ్ పై దాడి చేశారు. అతని తండ్రి వారిస్తున్నప్పటికీ వినకుండా దారుణంగా కొట్టారు. దాడి సమయంలో అతను తల్లి సైతం ఆకాశ్ కు అండగా నిలిచి ఏడుస్తూ తన కొడుకును కొట్టొద్దని వారించింది. అయినప్పటికీ దుండగులు వినకుండా చెలరేగి పోవడంతో తీవ్ర గాయాల పాలైన ఆకాశ్ మీనన్ అక్కడిక్కడే చనిపోయాడు.


ALSO READ : గచ్చిబౌలిలో దారుణం.. మహిళా టెక్కీపై ఇద్దరు అత్యాచారం, ఆపై..

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆకాశ్ మీనన్ ను గట్టిగా కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయని… వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ మృతి చెందాడని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఇక నిందితులను అదుపులోకి తీసుకున్నామని.. భారతీయ న్యాయ సంహిత కింద కేసు ఫైల్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ దాడిలో పట్టుబడిన 9 మందిని అక్టోబర్ 22 వరకు కస్టడీలో ఉంచనున్నట్టు తెలిపారు.

ఇక ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు. నడి రోడ్డు పై ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపినప్పటికీ ఎవరూ అడ్డుకోలేదని… స్థానికులు అంతా చూస్తూ ఉండిపోయారని మండిపడుతున్నారు. మానవీయ విలువలు ఎక్కడ వరకు దిగజారిపోతున్నాయో తెలపడానికి ఈ విషయం ఓ నిదర్శనం అని… కన్నతల్లి తండ్రి ముందే కొడుకును అతి కిరాతకంగా హత్య చేయటం దారుణమని చెప్పుకొస్తున్నారు. వీడియోలు తీస్తూ నిల్చున్నారే తప్పా అడ్డుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై విచారణ వేగవంతం చేసి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సైతం హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఒక వ్యక్తి పై నడి రోడ్డు పై ఇలాంటి ఘటన జరగడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉండి ఉంటాయని కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Related News

Hyderabad Crime News: గచ్చిబౌలిలో దారుణం.. మహిళా టెక్కీపై ఇద్దరు అత్యాచారం, ఆపై..

Lover Murder: ప్రియుడి కోసం లాడ్జికి వెళ్లిన యువతి.. పోలీసుల ఎదురుగానే హత్య!

Mayor Vijayalakshmi case: సౌండ్ పొల్యూషన్.. మేయర్ విజయలక్ష్మిపై కేసు, అసలేం జరిగింది?

Contract Killer Lover: కూతుర్ని హత్య చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన తల్లి.. చిన్న ట్విస్ట్.. హంతకుడు ఏం చేశాడంటే?..

Hindupur Rape Case: హిందూపురం.. అత్తాకోడళ్ల అత్యాచారం కేసు, నిందితులు మైనర్లు?

Vijayawada Locopilot Murder: విజయవాడ రైల్వే స్టేషన్‌ లోకోపైలెట్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. బీహార్‌కు చెందిన నిందితుడు అరెస్ట్

Big Stories

×