EPAPER

Noida Kid Murder: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని

Noida Kid Murder: వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని

Noida Kid Murder| ఎంబిబియస్ కోర్సు చదువుకొని డాక్టర్ కావాల్సిన యువతి ప్రియుడి మాటలు విని డబ్బుల కోసం ఓ బాలుడి ప్రాణాలు తీసింది. ఆమె ప్రియుడు తన స్నేహితులతో కలిసి ఆ బాలుడిని కిడ్నాప్ ప్లాన్ చేసేందుకు ముందుగా చాలా వెబ్ సిరీస్ చూశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఊహకందని తెలివితేటలు ప్రదర్శించారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో జరిగింది.


పోలీసుల కథనం మేరకు నోయిడాలో నివసిస్తున్న హిమాన్షు అనే యువకుడికి సోషల్ మీడియా ద్వారా తన్వికు పరిచయమయ్యాడు. హరియాణాకు చెందిన తన్వి శర్మ నోయిడాలోని మెడికల్ కాలేజీలో ఎంబిబియస్ కోర్సు చదువుకుంటోంది. అయితే హిమాన్షు ప్రేమలో పడి ఆమె అతనితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో హిమాన్షు త్వరగా డబ్బులు సంపాదించడానికి ఒక ప్లాన్ వేశాడు. గ్రేటర్ నోయిడా ప్రాంతానికి చెందిన బిజెనెస్ మెన్ కృష్ణ కుమార్ శర్మను టార్గెట్ చేశాడు. కృష్ణ శర్మకు ఓ 14 ఏళ్ల కొడుకు ఉన్నాడని అతడిని కిడ్నాప్ చేసి కృష్ణ శర్మ నుంచి కోట్లు వసూలు చేయవచ్చునని తన్వికి చెప్పాడు. అతని మాటలు విని ముందుగా తన్వి ఒప్పుకోలేదు.

Also Read: ‘డబ్బులిస్తేనే శృంగారం’.. భార్య డిమాండ్.. కోర్టుకెక్కిన భర్త!


కానీ ఆ తరవాత హిమాన్షుతో పాటు అతని ఇద్దరు స్నేహితులు మనోజ్ శర్మ, కృణాల్ భాటీ కూడా ఈ ప్లాన్ బాగుందని.. తన్వి సహాయం చేస్తే.. ఈజీగా పనిజరిగిపోతుందని నమ్మించారు. హిమాన్షు మాటలు విని తన్వి వారికి సహాయం చేసేందుకు ఒప్పుకుంది. బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ముందుగా ఒక నెల రోజుల పాటు బిజెనెస్ మెన్ కృష్ణ కుమార్ శర్మ, అతని కొడుకు కోసం రెక్కీ చేశారు. ప్లానింగ్ కోసం చాలా వెబ్ సిరీస్ లు చూశారు. కృష్ణ కుమార్ శర్మ కొడుకు తరుచూ కిడ్నాపర్లలో ఒకరైన మనోజ్ శర్మ ఢాబాకు వచ్చే వాడు. అలా ఒక రోజు ఆ పిల్లాడు మనోజ్ శర్మ ఢాబాకు వచ్చినప్పుడు.. తన్వి అతడితో ప్రేమగా మాట్లాడి.. తన వెంట ఢాబా వెనుక నిలబడి ఉన్న కారు వరకు తీసుకువచ్చింది. ఆ తరువాత కారులో ఉన్న హిమాన్షు, కృణాల్ భాటీ పిల్లాడిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు.

అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది. ఆ పిల్లాడిని ఊరు అవతల ఉన్న ఒక భవనంలో ఒక గోనే సంచెలో దాచిపెట్టి తీసుకెళ్లారు. ఆ తరువాత వెంటనే పిల్లాడిని నోరు మూసేసి అతని తల గోడకేసి కొట్టారు. దీంతో ఆ పిల్లాడు అక్కడే చనిపోయాడు. తన్వికి ఇదంతా చూసి షాక్ తగిలింది. పిల్లాడిని బంధించి అతడి తండ్రి నుంచి డబ్బులు వసూలు చేయాలి గానీ.. చంపేయడేమేంటని హిమాన్షుని ప్రశ్నించింది. అప్పుడు హిమాన్షు అసలు విషయం చెప్పాడు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

తనకు కృష్ణ కుమార్ శర్మ నుంచి వచ్చే డబ్బులు ముఖ్యం కాదని.. అతనిపై పగ తీర్చుకునేందుకు ఇదంతా చేశానని చెప్పాడు. నిజానికి కృష్ణ కుమార్ శర్మ వద్ద అతని దూరపు బంధువైన మనోజ్ శర్మ రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. మనోజ్ శర్మ ఫ్రెండ్ అయిన హిమాన్షు కూడా వడ్డీపై కృష్ణ కుమార్ శర్మ వద్ద రూ.2 లక్షలు తీసుకున్నాడు. ఆ ఇద్దరూ ఢాబాలో పెట్టుబడి పెట్టారు. కానీ నష్టాలు రావడంతో సమయానికి తిరిగి అప్పు చెల్లించలేకపోయారు. కానీ కృష్ణ కుమార్ శర్మ తన అప్పు వసూలు చేసేందుకు నిత్యం వారిని అవమానిస్తూ ఉండేవాడు. హిమాన్షు బైక్, మనోజ్ శర్మ ఢాబాని జప్తు చేశాడు. ఆ తరువాత తన సొంత ఢాబాలోనే మనోజ్ శర్మ పనివాడి చేయాల్సి వస్తోంది. కృష్ణ కుమార్ శర్మ వారికి అవమానానికి ప్రతీకారంగా అతని కొడుకుని చంపేశానని హిమాన్షు చెప్పాడు.

మరోవైపు పోలీసులు బాలుడి మిస్సింగ్ కేసులో నాలుగు రోజులుగా వెతుకుతుండగా.. నోయిడా సమీపంలోని బులంద్ షహర్ ప్రాంతంలో ఒక కాలువలో పిల్లాడి శవం దొరికింది. దీంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ముందుగా సిసిటీవిల ఆధారంగా తన్వి ఆ పిల్లాడిని కిడ్నాప్ చేసినట్లు తెలుసుకున్నారు. ఆ తరువాత తన్వి పరారీలో ఉండడంతో ఆమె ఫోన్ ట్రాక్ చేశారు.

చివరికి తన్వి, హిమాన్షుతో సహా నలుగురు నిందితులు ఒక కారులో నగరం నుంచి ఓ కారులో పారిపోతుండగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. పైగా పోలీసులు వారి కారుని ఆపమని చెప్పినప్పుడు ఆ కారు సదరు ఎమ్మెల్యేదని.. పోలీసులనే దబాయించారు. పోలీసులకు ఆ కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టికర్, కారు నెంబర్ పై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు పరిశీలించగా.. ఆ నెంబర్ నకిలీదని తేలింది. ఆ విధంగా అనుమానంతో పోలీసులను వారిని పట్టుకున్నారు. ఆ తరువాత వారి గురించి ఆరా తీస్తే.. తీగలాగితే డొంక కదిలినట్లు బాలుడి మర్డర్ కేసు మొత్తం బయటపడింది.

Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

Related News

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Big Stories

×