EPAPER

Actor Vinayakan: జైలుకెళ్లిన జైలర్ నటుడు.. రియల్ లైఫ్ లోనూ విలనిజమే?

Actor Vinayakan: జైలుకెళ్లిన జైలర్ నటుడు.. రియల్ లైఫ్ లోనూ విలనిజమే?

Malayalam actor Vinayakan arrested at Hyderabad airport: జైలర్ మూవీలో ప్రధాన విలన్ గా నటించి మెప్పించారు వినాయకన్. నలుడుగానే కాదు డ్యాన్సర్ గా, సింగర్ గా మల్టీ ట్యాలెంటెడ్ నటుడిగా సినిమా రంగంలో తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. 1995లో వచ్చిన మలయాళ చిత్రం మాంత్రికంలో వినాయకన్ కేవలం అతిథి పాత్రలో మెప్పించాడు. ఆ మూవీతోనే సినీ రంగ ప్రవేశం చేశాడు.ఆ మూవీలో మోహన్ లాల్, రఘువరన్ వంటి దిగ్గజాలు నటించారు. నటించింది చిన్న పాత్రే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మెల్లగా సమాయనటుడి పాత్రలు, హాస్య పాత్రలు చేస్తూ వచ్చాడు వినాయకన్. 2016 లో కమ్మటి పాడమ్ అనే మలయాళ మూవీలో గంగ గా నటించాడు వినాయకన్. ఆ మూవీలో ఉత్తమ నటన కనబరిచినందుకు గాను కేరళ రాష్ట్ర చలన చిత్ర రంగం తరపును ఉత్త మ నటుడి పురస్కారం అందుకున్నాడు. ఆ మూవీలో ఓ పాటకు లిరిక్స్ కూడా తానే స్వయంగా సమకూర్చడం విశేషం.


జైలర్ లో వర్మగా..

టాప్ 25 మలయాళ మూవీలలో ఒకటైన ఈమా..యౌ అనే మూవీలోనూ నటించడంతో అతని పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ జైలర్ లో వినాయకన్ నటనకు ప్రేక్షకుడు ఫిదా అవ్వాల్సిందే. హీరోని కూడా డామినేట్ చేసే పాత్రలో వినాయకన్ మెప్పించాడు. ఒక పక్క క్రూరమైన విలన్ గా నటిస్తూనే జైలర్ మూవీలో రెండు మూడు డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తాడు. మల్టీ ట్యాలెంటెడ్ యాక్టర్ గా ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునేలా చేయడంతో జైలర్ పాత్ర వినాయకన్ కు డబుల్ ప్రమోషన్ తెచ్చిపెట్టింది. దానితో పలు సినిమా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి వినాయకన్ కు. అయితే వినాయకన్ ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్ హైదరాబాద్ నుండి గోవా వెళుతుండగా సీఐఎస్ఎఫ్ అధికారులు వినాయకన్ ను అదుపులోకి తీసుకున్నారు. విషయం ఏమిటంటే వినాయకన్ మద్యం తాగిన మత్తులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పై దాడి చేయడంతో పోలీసులు వినాయకన్ పై కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు. అయితే పోలీసులు తనని అకారణంగా ఏ తప్పూ చేయకపోయినా అరెస్టు చేయడంపై వినాయకన్ తన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


తాగిన మత్తులో దాడి

ఎయిర్ పోర్టులో తాగిన మత్తులో ఉన్న వినాయకన్ సీఐఎస్ఎఫ్ అడిగిన ప్రశ్నలకు తల బిరుసుగా సమాధానం ఇచ్చాడని..అదేమిటని అడిగిన సీఐఎస్ఎఫ్ అధికారిపై వినాయకన్ చెయ్యి కూడా చేసుకున్నాడని..ఆ నేరంపైనే అతనిని అదుపులోకి తీుకున్ామని అధికారులు చెబుతున్నారు. తనని అన్యాయంగా పోలీసులు కేసు పెట్టి జైలుకు తీసుకెళ్లారని..కావాలంటే సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుందని..తప్పెవరు చేశారో తెలుస్తుందని అన్నారు వినాయకన్. గతంలోనూ వినాయకన్ పై ఇలాంటి దురుసు ప్రవర్తనపై పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారు. కాగా జైలర్ మూవీలో వర్మగా నటించి మంచి పేరు తెచ్చుకున్న వినాయకన్ ను నెటిజెన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదేంటి వర్మా..జైలర్ లో నటించి జైలుపాలయ్యావా? అంటూ ట్రోలింగ్ చేస్తుంటే మరికొందరు వినాయక చవితి రోజున వినాయకన్ ను అరెస్ట్ చేయడంపై ట్రోలింగ్ చేస్తున్నారు.

Related News

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Big Stories

×