EPAPER

Landslide sweeps 2 buses in Nepal: నేపాల్‌లో నదిలో పడిన రెండు బస్సులు.. ఇద్దరు డ్రైవర్లతో సహా 65 మంది గల్లంతు!

Landslide sweeps 2 buses in Nepal: నేపాల్‌లో నదిలో పడిన రెండు బస్సులు.. ఇద్దరు డ్రైవర్లతో సహా 65 మంది గల్లంతు!

Two buses into Trishuli River in Nepal: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకృతి బీభత్సానికి నారాయణఘాట్, ముగ్‌లింగ్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో భారీ వర్షం కూడా కురుస్తుండగా.. అదే మార్గంలో వెళ్తున్న రెండు బస్సులపై ఆ కొండచరియలు విరిగిపడడంతో పక్కనే ఉన్న త్రిశూన్ నదిలో పడిపోయాయి. ఈ రెండు బస్సుల్లో 63 మంది ప్రయాణికులు ఉండగా.. ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తం 65 మంది గల్లంతయ్యారు. కాగా, ఇందులో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు సమాచారం.


నేపాల్ రాజధాని ఖాట్మండుకు ఏంజెల్ బస్సు, గణపతి డీలక్స్ బస్సులు వెళ్తుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి కొండచరియలు విరిగిపడి బస్సులపై పడ్డాయి. దీంతో అదుపు తప్పి పక్కన ఉన్న నదిలో పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ మేరకు పడవలతో నదిలో దిగి గల్లంతైన 65మంది ఆచూకీ కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు చిత్వాన్ చీఫ్ ఆఫీసర్ ఇంద్రవేవ్ యాద్ తెలిపారు.

ఖాట్మండు వెళ్తున్న ఓ బస్సులో 24 మంది ప్రయాణికులు ఉండగా.. మరో బస్సులో 41మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో గణపతి డీలక్స్‌కు చెందిన బస్సు నుంచి ముగ్గురు ప్రయాణికులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదానికి గురైన వెంటనే బయటకు దూకినట్లు సమాచారం. ఇదే మార్గంలో మరో బస్సుపై కొండచరియలు పడడంతో డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మృతుడు మేఘనాథ్‌గా గుర్తించారు.


Also Read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి

బస్సు ప్రమాదాలపై నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు బాధితుల ఆచూకీని తెలుసుకునేలా అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఆ దేశ సాయుధ దళాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

Tags

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×