EPAPER
Kirrak Couples Episode 1

Kidnappers Sentenced After 17 Years: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..

Kidnappers Sentenced After 17 Years: 7 ఏళ్ల బాలుడు కిడ్నాప్.. కిడ్నాపర్లపై పగతో ఆ పిల్లాడు ఎంత పనిచేశాడంటే..

Kidnappers Sentenced After 17 Years| సమాజంలో చాలామంది సామాన్యులతో పాటు బలమైన వ్యక్తితత్వం కలవారు కూడా ఉంటారు. అలాంటి వారిలో ఒకరు హర్ష్ గార్గ్. 7 ఏళ్ల వయసులో హర్ష్ గార్గ్ ని కొందరు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాపర్లను అడ్డుకోబోయిన హర్ష్ తండ్రి.. తుపాకీ కాల్పులకు గురయ్యాడు. ఆ తరువాత ఆ కిడ్నాపర్లు హర్ష్ ఎంతో వేధించారు. అలా సమయంలో హర్ష్ తాను అనుభవించిన శారీరక, మానసిక వేదన.. అతనిలో పగను రగిలించింది. దీంతో అతను కిడ్నాపర్లను శిక్షించడానికి ఎంతో కసితో ఏళ్ల తరబడి ప్రయత్నించాడు. చివరికి ఆ కిడ్నాపర్లకు జైలుకు పంపించాడు. ఈ ఘటన ఆగ్రా నగరంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఆగ్రాలో నివసించే హర్ష్ గార్గ్ (24) , ఫిబ్రవరి 10, 2007న తనకు 7 ఏళ్ల వయసున్నప్పుడు కిడ్నాప్ అయ్యాడు. కిడ్నాప్ సమయంలో హర్ష్ తండ్రి రవి కుమార్ గార్గ్ తన కొడుకుని కాపాడడానికి ప్రయత్నించగా కిడ్నాపర్లు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రవికుమార్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ తరువాత కిడ్నాపర్లు రూ.55 లక్షలు డిమాండ్ చేశారు. రవికుమార్ వద్ద సడెన్ గా అంత డబ్బులు లేకకాస్త సమయం అడిగాడు.. అలా 26 రోజుల తరువాత రవికుమార్ తన కొడుకుని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించుకున్నాడు. ఆగ్రాలో కిడ్నాప్ అయిన హర్ష్, మధ్యప్రదేశ్ రాష్ట్రం శివ్ పురిలో దొరికాడు.

Also Read: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే


అయితే ఆ 26 రోజులలో ఏడేళ్ల హర్ష్ ను ఆ కిడ్నాపర్లు ప్రతి రోజూ కొట్టేవారు. అసభ్యంగా మాట్లాడుతూ.. అతని తండ్రి డబ్బులివ్వకపోతే తనని ముక్కలుగా నరికి అతని తండ్రికి కానుక ఇస్తామనేవారు. రోజూ భయంతో హర్ష్ వణికపోయేవాడు. కానీ కిడ్నపర్ల వద్ద నుంచి విడుదలయ్యాక ఇంటికి వచ్చిన హర్ష్ తన తండ్రికి అయిన గాయాలు చూసి.. తనను తన కుటుంబాన్ని హింసించిన ఆ కిడ్నాపర్లను శిక్షించాలని పగ పట్టాడు.

అయితే పోలీసులు కొంత కాలం తరువాత హర్ష్ ను కిడ్నాప్ చేసిన గ్యాంగ్‌లో 8 మందిని పట్టుకున్నారు. వారికి జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే అసలు హర్ష్ కిడ్నాపింగ్ కేసులో అసలు దోషులు మరో నలుగురు తప్పించుకున్నారు. కోర్టులో ఆ నలుగురికి వ్యతిరేకంగా సరైన ఆధారాలు లేకపోవడంతో వారిని కోర్టుని నిర్దోషులుగా ప్రకటించింది.

Also Read: సిబిఐ అధికారులగా పోజులిచ్చి రూ.4.4 కోట్లు దోపిడి.. మోసపోయిన డాక్టర్!

ఇదంతా చూసి హర్ష్ కు కోపం వచ్చింది. తనను కిడ్నాప్ చేసిన వారిలో ఒక్కరు కూడా తప్పించుకోకూడదని హర్ష్ భావించాడు. బాగా చదువుకొని 2022లో లాయర్ అయ్యాడు. 17 ఏళ్ల తరువాత 24 ఏళ్ల వయసులో హర్ష్ తన కిడ్నాపింగ్ కేసుని తిరిగి విచారణ చేయించాడు. ఇటీవలే ఆగ్రా కోర్టులో హర్ష్ కిడ్నాపింగ్ కేసుని విచారణ జరిగింది. ఆ కేసుని హర్ష్ స్యయంగా వాదించాడు. కిడ్నాపర్లపై ప్రశ్నల వర్షం కురిపించి.. వారి చేత నిజం రాబట్టాడు. వాదనలన్నీ విన్న తరువాత ఆగ్రా కోర్టు అడిషనల్ జిల్లా జడ్జి నీరజ్ కుమార్ బక్షి ఆ నలుగురికీ జీవిత ఖైదు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధించారు.

Also Read: ఎంత దారుణం.. 6 ఏళ్ల పాపను హత్య చేసి.. ఏమీ తెలియనట్లు బుకాయించిన పెద్దమనిషి

Related News

Cyber Fruad: సిబిఐ అధికారులగా పోజులిచ్చి రూ.4.4 కోట్లు దోపిడి.. మోసపోయిన డాక్టర్!

Gujarat School Girl Rape And Murder: ఎంత దారుణం.. 6 ఏళ్ల పాపను హత్య చేసి.. ఏమీ తెలియనట్లు బుకాయించిన పెద్దమనిషి

Borabanda: బోరబండలో విషాదం.. బస్సు చక్రాలకింద పడి విద్యార్థి మృతి

Ananthapuram: దంపతుల్ని బలిగొన్న టమోటా లోడ్ లారీ.. తెగిపడిన మొండెం

Bangalore Mahalakshmi Murder case: బెంగుళూరు మహాలక్ష్మి హత్య, 30 ముక్కలు చేసి, ఆపై..

Birthday Party Assault: బర్త్‌డే పార్టీకి వెళ్లిన యువతి.. ఆమెను జ్యూస్ తాపించి మరో యువతి ఏం చేసిందంటే

Big Stories

×