EPAPER

Raids on Pub: పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి, పట్టుబడిన వారిలో సినీ, రాజకీయ నేతల పుత్రరత్నాలు

Raids on Pub: పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి, పట్టుబడిన వారిలో సినీ, రాజకీయ నేతల పుత్రరత్నాలు

Raids on Pub: వీకెండ్ వస్తే చాలు సిటీల్లో పబ్‌ల హంగామా అంతాఇంతా కాదు. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లో ఓ పబ్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 140 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో సినీ, రాజకీయ రంగాలకు చెందిన పుత్రరత్నాలు ఉన్నట్లు సమాచారం.


బంజారాహిల్స్‌లోని టాస్ పబ్‌పై శుక్రవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసుల మెరుపు దాడి చేశారు. కస్టమర్లు ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులను రప్పించారు నిర్వాహకులు. ఆపై అసభ్యకరమైన నృత్యాలను చేయిస్తున్న ట్లు గుర్తించారు పోలీసులు.

ALSO READ: చిక్కుల్లో మాజీ మంత్రి బ్రదర్.. ఆపై కేసు


దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు. దీంతో నిర్వాహకులు షాకయ్యారు. మొత్తం 140 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 42 మంది యువతులు న్నారు. వారంతా వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది.

వారందరినీ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత పరీక్షలు చేయించినట్టు సమాచారం. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నారా అనేదానిపై ఆరా తీస్తున్నారు. తమకు ఏమీ తెలీదని ప్రొగ్రాం నిమిత్తం తీసుకొచ్చారని పట్టుబడిన యవతులు చెబుతున్నారు.  పబ్‌లో అసభ్య నృత్యాలతోపాటు నిషేధిత డ్రగ్స్ వినియోగిస్తున్నారన్నది సమాచారం.

టాస్ పబ్ ఇష్యూతో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో యువతులను ట్రాప్ చేసిందట యాజమాన్యం. వీకెండ్‌లో నాలుగు గంటలు పని చేస్తే రూ.2 వేలు ఇస్తామని ఆఫర్ ఇచ్చిందట.

అసభ్య, అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామని ఎర చూపిందని సమాచారం. పబ్ కి వచ్చే కస్టమర్లతో క్లోజ్‌గా ఎక్కువ మద్యం సేవించేలా చూడాలని యువతులకు సూచన చేసిందని అంతర్గత సమాచారం.

 

Related News

Mohammed Kaiser: హైదరాబాద్ రౌడీ షీటర్‌కు ఈడీ ఝలక్, ఆస్తులు సీజ్

FIR Against Harishrao Relatives: చిక్కుల్లో మాజీ మంత్రి బ్రదర్.. ఆపై కేసు

Woman Duped Movie Role: రూ.60 లక్షలు ఇస్తే.. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ అంటూ యువతిపై అత్యాచారం, దోపిడి

Doctor Suicide: బిజినెస్ కోసం రూ.కోటి అడిగిన భర్త.. ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్న మహిళా డాక్టర్

Urine in Food: మూత్రంతో వంట చేసిన పనిమనిషి.. ఆ విషయం ఎలా బయటపడిందంటే?

Son In Law Arrested: అత్తకు రోజూ అల్లుడు మెసేజ్‌లు.. అరెస్ట్ చేసిన పోలీసులు, పాపం ఆమె గుండె పగిలింది

Big Stories

×