Girl Raped By Father: ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎలాంటి శిక్షలు విధంచిన మానవ మృగాలకు లెక్క లేకుండాపోయింది. దేశంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. జీవితంలో మంచి చెడులు నేర్పించి.. ఉన్నతమైన భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన కన్న తండ్రి.. కుమార్తెనే కాటేశాడు. కామం కళ్లను కప్పేయడంతో కోరిక తీర్చుకోవడానికి స్వయాన సొంత కూతురుపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కామాంధుడయ్యాడు. అభం శుభం తెలియని కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కడప జిల్లా పెద్దముడియం మండలంలో జరిగిందీ ఘటన. నెమల్లదిన్నెకు చెందిన ఓబులేసు మద్యానికి బానిసయ్యాడు. భార్య చంద్రకళ కూలీ పనులకు వెళ్తుండేది. ఉదయం మద్యం మత్తులో ఉన్న ఓబులేసు తన కుమార్తె పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అమ్మాయి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. కీచక తండ్రికి దేహశుద్ధి చేశారు.
Also Read: పోలీసులకే భద్రత లేదు.. మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం..
విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి తన భర్తపై పెద్దముడియం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకుంది. ఎస్సై సుబ్బారావు నిందితున్ని అదుపులోకి తీసుకొన్నాడు. రిమాండ్‌కు తరలించారు. వైద్య పరీక్షల కోసం బాలికను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరో వైపు.. సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. హుస్నాబాద్ పట్టణంలో ఇంటి ముందు ఆడుకుంటున్న మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను బలవంతంగా సమీపంలోని ఓ రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు చెబుతున్నారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు.