EPAPER

Woman Kills Parents: తల్లిదండ్రులను హత్య చేసిన యువతి.. 4 ఏళ్లుగా ఇంట్లోనే శవాలు.. ఎందుకంటే?..

Woman Kills Parents: తల్లిదండ్రులను హత్య చేసిన యువతి.. 4 ఏళ్లుగా ఇంట్లోనే శవాలు.. ఎందుకంటే?..

Woman Kills Parents| దురాశ దుఖానికి చేటు అని అంటారు. విలాసాలు, వ్యసనాలకు అలవాటు పడి కొందరు నేరాలకు పాల్పడుతుంటారు. అలా తన విలాసాల కోసం డబ్బు అవసరం కావడంలో ఒక యువతి తన తల్లిదండ్రులను హత్య చేసింది. హత్య చేయడమే కాదు.. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని 4 సంవత్సరాలపాటు తల్లిదండ్రుల మృతదేహాలను ఇంట్లోనే ఎవరికీ కనబడకుండా దాచి పెట్టింది. ఈ ఘటన బ్రిటన్ లో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్ లోని ఇంగ్లాండ్ దేశం ఎసెక్స్ కౌంటీలొ వర్జీనియా మెక్కల్లా అనే 36 ఏళ్ల యువతి నివసిస్తోంది. ఆమె వివాహం చేసుకోలేదు. ఇంతవరకు తన తల్లిదండ్రులతోనే నివసిస్తోంది. అయితే గత నాలుగేళ్లుగా ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారో ఎవరికీ తెలీదు. వర్జీనియాకు ఒక సోదరి, ఒక సోదరుడు కూడా ఉన్నారు. బంధువులు, మిత్రులు, తన తోబుట్టువులు ఇలా అందరూ ఆమెను తల్లిదండ్రులు ఎక్కడున్నారని ప్రశ్నించేవారు. అందరికీ ఆమె వేర్వేరు కథలు చెప్పేది.

Also Read: హోటల్‌కు టిఫిన్ కోసం వెళ్లిన ప్రేమికులు.. ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి?..


తన తోబుట్టువులకేమో తల్లిదండ్రులు వేరే దేశాలకు టూర్ కు వెళ్లారని చెప్పింది. బంధువులకు, మిత్రులకు మాత్రం తల్లిదండ్రలు అనారోగ్యం కారణంగా ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారని చెప్పింది. ఈ క్రమంలో ఆమె సోదరుడు మూడేళ్లపాటు తన తల్లిదండ్రులు కనీసం తనతో మాట్లాడకపోవడంపై ఆశ్చర్యపోయాడు. దీంతో వర్జీనియాని అసలు ఏం జరిగిందని నిలదీశాడు. అయినా వర్జీనియా తనకేమీ తెలియదని విదేశాలకు వెళ్లిన వారు ఏమయ్యారు తెలియదని చెప్పింది.

దీంతో ఆమె సోదరుడు మరికొంతకాలం ఎదురుచూసి 2023లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి జాన్ మెక్కల్లా(70), లాయిస్ మెక్కాల్లా (71) దాదాపు నాలుగేళ్లుగా కనిపించలేదని. కనీసం తనతో ఫోన్లో కూడా మాట్లాడలేదని పోలీసులకు తెలిపాడు. తనకు తన సోదరి వర్జీనియాపై అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పోలీసులు తమకు అందిన ఫిర్యాదుపై జాన్ మెక్కల్లా, లాయిస్ మెక్కల్లా మిస్సింగ్ కేసులో విచారణ ప్రారంభించారు. ముందుగా వర్జీనియాని పోలీస్ స్టేషన్ కు పిలిచి ప్రశ్నించారు. కానీ ఆమె నుంచి ఏ సమాచారం లభించలేదు. దీంతో ఆమె నివసిస్తున్న ఇంటిని సోదా చేశారు. అక్కడ నమ్మలేని నిజం బయటపడింది. ఇంట్లో జాన్ మెక్కల్లా, లాయిస్ మెక్కల్లా మృతదేహాలు కుళ్లిపోయి, ఎండిపోయిన స్థితిలో లభించాయి.

ఈ కారణంగా పోలీసులు వర్జీనియాని అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నించారు. తల్లిదండ్రులను ఆమె ఎందకు హత్య చేసిందని అడిగారు. అప్పుడు వర్జీనియా అసలు నిజం చెప్పింది. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని, దాని కోసం తన వద్ద డబ్బులు లేకపోయే సరికి తన తండ్రి, తల్లి కూడా అడిగితే డబ్బులు ఇవ్వలేదని.. అందుకే 2019 జూన్ లో తన తండ్రి జాన్ మెక్కల్లా తాగే మద్యంలో విషం కలిపి ఇచ్చానని.. అది తాగడం వల్లే ఆయన మరణించాడని తెలిపింది. మరోవైపు తల్లి లాయిస్ మెక్కల్లాని తాను తలపై సుత్తితో దాడి చేసి, ఆ తరువాత ఆమె స్పృహ తప్పిపోయాక కత్తితో ఆమె చనిపోయేంతవరకు పొడిచానని చెప్పింది. తన తండ్రి శవాన్ని ఇంట్లో పెరట్లో పాతిపెట్టి.. దానిపై రాళ్లతో కవర్ చేశానని, తల్లి శవాన్ని మాత్రం కబోర్డులో ఒక స్లీపింగ్ బ్యాంగులో దాచానని చెప్పింది.

ఆ తరువాత వారి క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ల నుంచి వారి పెన్షన్ డబ్బులు తీసుకొని ఖర్చు చేసుకునేదాన్ని అని వెల్లడించింది. ఏదో ఒక రోజు తాను పట్టుబడతానని తనకు ముందే తెలుసునని అందుకే చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తానని కోర్టులో తన నేరం అంగీకరించింది. ఎస్సెక్స్ లోని చెమ్స్‌ఫర్డ్ కోర్టు ఆమెకు 36 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Related News

Viral News: ఇలాంటి డ్రెస్సా? యాసిడ్ దాడి చేస్తానంటూ మహిళకు వార్నింగ్

Woman Throws Acid on Lover: హోటల్‌కు టిఫిన్ కోసం వెళ్లిన ప్రేమికులు.. ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి?..

Donkey Milk: గాడిద పాల పేరుతో రూ.10 కోట్ల మోసం, బాబోయ్.. ఇలా కూడా చెయ్యొచ్చా?

LPG Delivery Boy Crime: మైనర్ బాలికపై గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ ఘాతుకం.. అయిదేళ్ల తరువాత ఏం జరిగిందంటే?..

DKZ technologies fraud: హైదరాబాద్‌లో మోసం.. కస్టమర్లను ముంచేసిన డీకెజెడ్ టెక్నాలజీ, ఆపై అరెస్టులు

Baby Sold Beer: బీర్ కోసం పసిబిడ్డను అమ్ముకున్న తల్లితండ్రులు.. పోలీసులకు దారుణమైన పరిస్థితిలో దొరికిన బిడ్డ

Big Stories

×