EPAPER

Couple Kills Man: యువకుడిని హత్య చేసిన దంపతులు.. సోదరుడి భార్యను కామంతో..

Couple Kills Man: యువకుడిని హత్య చేసిన దంపతులు.. సోదరుడి భార్యను కామంతో..

Couple Kills Man| వివాహేతర సంబంధాలు చివరికి దు:ఖాన్నే మిగుల్చుతాయి. సోదురుడి భార్యను వివాహం చేసుకోవాలని ఒక యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఒక హత్య జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలోని థానె జిల్లాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. థానె జిల్లాకు చెందిన రాహిల్ (24) అనే యువకుడు గత వారం రోజులుగా కనబడడం లేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రాహిల్ మిస్సింగ్ కేసులో విచారణ చేయగా అతను చివరగా ఝర్ఖండ్ వెళ్లినట్లు తెలిసింది. కానీ రాహిల్ అక్కడ ఎందుకు వెళ్లాడో ఎవరికీ తెలియలేదు.

రాహిల్ ఫోన్ చివరి లొకేషన్ ట్రేస్ చేయగా.. పోలీసులకు ఝార్ఖండ్ లో అన్సారి (32) అనే వ్యక్తి ఇంటి వద్దకు ఆ లొకేషన్ చూపించింది. కానీ అన్సారీ గత నాలుగు రోజులుగా ఇంట్లో లేడని.. అతని భార్య రజియా కూడా కనిపించడం లేదని ఇరుగుపొరుగువారు తెలిపారు. దీంతో పోలీసులు మొహమ్మద్ సిరాజ్ అన్సారి, అతని భార్య రజియా గురించి సమాచారం సేకరించారు.


Also Read:  పోలీసులకే భద్రత లేదు.. మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం..

వారిద్దరూ మరెవరో కాదు.. కనబడకుండా పోయిన రాహిల్ సోదరుడు, వదిన. అయితే రాహిల్ తండ్రి మొదటి భార్య కుమారుడు అన్సారి. ఇద్దరి తల్లులు వేరైనప్పటికీ రాహిల్, అన్సారి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే రాహిల్ తరుచూ తన అన్న ఇంటికి వచ్చేవాడు. కానీ పోలీసులకు రాహిల్, అన్సారిల ఆచూకీ తెలియలేదు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేస్తే అన్సారి, రజియా ఇద్దరూ రజియా పుట్టింట్లో ఉన్నారని తెలిసింది.

పోలీసులు అన్సారి, రజియాను అదుపులోకి తీసుకొని.. రాహిల్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ముందు తమకు ఏమీ తెలియదని బకాయించిన అన్సారి ఆ తరువాత నిజం చెప్పేశాడు.

పోలీసుల కథనం ప్రకారం.. అన్సారి ఇంట్లో లేనప్పుడు.. రాహిల్ తన వదిన రజియాపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. రజియాను తాను పెళ్లి చేసుకుంటానని చెప్పి లొంగదీసుకోవాలని ప్రయత్నించాడని.. అప్పుడే అక్కడికి అన్సారి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో అన్సారి ఒక లావు కట్టెతో రాహిల్‌ను చితకబాదాడు. దీంతో రాహిల్ తలకు గాయలయ్యాయి. రాహిల్ చనిపోయాడు.

ఆ తరువాత రాహిల్ శవాన్ని అన్సారి, అతని భార్య రజియా కలిసి ముక్కలుగా నరికి.. ఆ తరువాత వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపి ఊరి చివర చెరువులో పడేశారు. పోలీసులు ప్రస్తుతం రాహిల్ శవం ముక్కలను వెలికితీసి పోస్టుమార్టం, డిఎన్ఏ పరీక్షలకు తరలించారు. రాహిల్ హత్య కేసులో అన్సారి, రజియాలను అరెస్టు చేశారు.

Also Read: కలెక్టర్ బంగ్లా పక్కన బిజినెస్‌మ్యాన్ భార్య శవం లభ్యం.. 4 నెలల క్రితం హత్య!

ఇలాంటిదే మరో ఘటన కొద్ది రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లోన కాన్పూర్ లో జరిగింది. ఒక బడా వ్యాపారి భార్య ఒక జిమ్ ట్రైనర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ జిమ్ ట్రైనర్ ఆమెను పెళ్లి చేసుకుందామని అడిగినా.. అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో అతను మరో యువతితో వివాహం చేసుకోబోతుండగా.. ఆమె అడ్డు పడింది. ఈ క్రమంలో ఒక రోజు జిమ్ బయట కారులో వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆ మహిళను ఆమె ప్రియుడు హత్య చేశాడు.

ఆ తరువాత ఆ బడా వ్యాపారి భార్య శవాన్ని జిల్లా కలెక్టర్ నివాసం పక్కనే పాతిపెట్టాడు. జిమ్ ట్రైనర్ కావడంతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు అతను శిక్షణ ఇచ్చేవాడు. దీంతో ఆ ప్రాంతంలో అతను సులువుగా వెళ్లి శవాన్ని పాతిపెట్టాడు. ఆ తరువాత ఊరు వదిలి పారిపోయాడు. అయితే నాలుగు నెలల తరువాత పోలీసులు అతడి ఆచూకీ తెలుసుకొని అరెస్టు చేశారు. ఆ తరువాత శవాన్ని వెలికి తీశారు.

Related News

Beautician murder: బ్యూటీషియన్ దారుణ హత్య, ఆమెని ఆరు ముక్కలు చేసి..

Borugadda Anil warning: బోరుగడ్డ అనిల్ ఆ మూడింటికి వార్నింగ్.. వెనక్కి తగ్గేదిలే

Teen Beheaded: 17 ఏళ్ల పిల్లాడి తల నరికివేత.. కుటుంబ కక్షలకు టీనేజర్ బలి!

Momos Eat Death: మోమోస్ తిని హైదరాబాదీ యువతి మృతి.. కడుపులో 2cmల చేపముల్లు

Girl Raped By Father: కంటి రెప్పే కాటేసింది.. కుమార్తెపై కన్నతండ్రి అఘాయిత్యం

Constable Rape: పోలీసులకే భద్రత లేదు.. మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం..

×