EPAPER

New Delhi:రెండు బొమ్మలలో రూ.30 కోట్ల విలువైన డ్రగ్స్..అదెలా సాధ్యం?

New Delhi:రెండు బొమ్మలలో రూ.30 కోట్ల విలువైన డ్రగ్స్..అదెలా సాధ్యం?

CBI detains German national at New Delhi airport with 6kg cocaine
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల కావేవీ కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. స్మగ్లర్లకు కూడా ఈ కవిత వర్తిస్తుందేమో అనిపిస్తుంది. ఎయిర్ పోర్టులలో ఎలాంటి నిఘా వ్యవస్థ ఏర్పాటుచేసినా, కస్టమ్స్ అధికారులు అంగుళం వదలకుండా గాలించినా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో స్మగ్లర్లు దొరుకుతుంటారు. దొరకని వాడు దొరలా తప్పించుకు వెళతారు.ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విస్తుగొలిపే సంఘటన జరిగింది. ఇండియన్ ఆరిజన్ కు చెందిన జర్మనీ వ్యక్తి చూడటానికి పెద్ద మనిషిలా; హుందాగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అడుగుపెట్టాడు. ముందే వచ్చిన సమాచారం ఆధారంగా గురువారం సీబీఐ అధికారులు సదరు వ్యక్తిని పట్టుకుని సోదాలు చేశారు.


6 కేజీల కొకైన్ స్వాధీనం

అతని వద్ద నుంచి దాదాపు 6 కిలోల కొకైన్ సీజ్ చేశారు. అతని రాక కోసం ముందుగానే సీబీఐ అధికారులు విమానాశ్రయం టెర్మినల్ వద్ద నిఘా ఉంచారు. అతగాడు తన సూట్ కేసులో ఉన్న బొమ్మలను చెక్ చేశారు అధికారులు. పైకి బొమ్మల్లా కనిపించేవాటిలో దాదాపు 270 దాకా క్యాప్సూల్స్ ఉన్నాయి. ఏవో మెడిసిన్ మందులు అని సర్ధి చెప్పేందుకు సదరు వ్యక్తి ట్రై చేశాడు. అయినా అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా ఆ క్యాప్సూల్స్ లో ఉన్నది మెడిసిన్ కాదు కొకైన్ మొత్తం కలిసి ఆరు కిలోల దాకా ఉండవచ్చని వాటి విలువ భారత కరెన్సీలో రూ.30 కోట్లకు పైగానే ఉండవచ్చని అంచనా. నిందితుడు అశోక్ కుమార్ దోహా నుంచి ఢిల్లీకి వ్యాపారిగా చెప్పి వచ్చాడు. ప్రస్తుతం పోలీసుల ఆధీనంలో ఉన్న వ్యక్తి ద్వారా అతనికి డ్రగ్స్ బల్క్ గా సరఫరా చేసేది ఎవరు? భారత్ లో అతని డ్రగ్స్ కొనుగోలు చేసేది ఎవరు? ఎంత మంది అతని ద్వారా వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు అనే విషయాలు ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీసులు.


Related News

Call Girl Deadbody: కాల్ గర్ల్ తల నరికి యువతి సోదరుడి ఇంట్లో పెట్టిన ప్రియుడు.. ఎందుకు చేశాడంటే..

Road Accident: ఘోరాతిఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి.. వాహనంలోనే నుజ్జునుజ్జైన ప్రయాణికులు

Suspicious Death: భోపాల్‌లో ఏపీ విద్యార్థి మృతి.. డ్రగ్స్ తీసుకోనందుకే చంపేశారంటున్న బంధువులు!

Cyanide killers: గుంటూరులో సైనైడ్ గ్యాంగ్.. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు.. నిందితులంతా మహిళలే

Selfy craze death: సెల్ఫీ మోజులో పడి పాముతో చెలగాటం..యువకుడు మృతి

Whiskey Ice Cream: వామ్మో పిల్లల ఐస్ క్రీమ్ లో విస్కీ..పోలీసుల అదుపులో నిందితులు

Ambulance Driver: అంబులెన్స్ లో లైంగిక వేధింపులు.. భర్త ఆక్సిజన్ మాస్క్ తీసేసి..

Big Stories

×