EPAPER

Bike Taxi Stalker: ‘నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను’.. మహిళా కస్టమర్ ను టార్చర్ చేసిన ట్యాక్సీ బైకర్!

Bike Taxi Stalker: ‘నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను’.. మహిళా కస్టమర్ ను టార్చర్ చేసిన ట్యాక్సీ బైకర్!

Bike Taxi Stalker| హైదరాబాద్ లో నివసిస్తున్న 26 ఏళ్ల గీత(పేరు మార్చబడినది) ఆ రోజు రాత్రి 10 గంటలకు ఇంటికి చేరింది. బాగా అలసిపోయిన గీత ఫ్రెషప్ అయి తన బెడ్ రూమ్ లోకి పడుకోవడానికి వెళ్లగానే ఆమె ఫోన్ మోగింది. అందులో ఒక మెసేజ్ వచ్చింది. ‘అబ్బాయిలు మోసం చేయరు’ అని ఉంది. ఆ మెసేజ్ ఒక అన్ నోన్ నెంబర్ తో రావడంతో గీత పట్టించుకోలేదు. కాసేపటి తరువాత మళ్లీ మెసేజ్ వచ్చింది. ‘నేను నిన్ను ఎప్పటికీ మరిచిపోను’ అని రాసి ఉంది. ఈ సారి గీతకు ఆ మెసేజ్ ఎవరు పంపిస్తున్నారో కొంత వరకు అనుమానం కలిగింది.


కొన్ని నెలల క్రితమే గీత ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ కు కూడా ఇలాంటి మెసేజెస్ వచ్చేవి. ఒకసారి ఆ మెసేజెస్ పంపే వ్యక్తి గీతను బెదిరిస్తూ మెసేజ్ లు పెడితే.. ఆమె ఆ అకౌంట్లను బ్లాక్ చేసింది. ఆ తరువాత ఆమె ఫోన్ కు వేరే నెంబర్ల నుంచి మెసేజెస్ వచ్చేవి. అయితే ఇప్పుడు గీత ఫోన్ కు ఒక చివరి మెసేజ్ వచ్చింది. అది చూసి గీత ఒక్కసారిగా భయపడిపోయింది. ఆమె షాక్ లో నిలబడలేక కిందపడిపోయింది. ఎందుకంటే గీతకు అయిదేళ్ల క్రితం ఒక వ్యక్తి ఇలాగే వేధించాడు.

అయిదేళ్ల క్రితం 2019లో గీత ఒకసారి వేసవి సెలవుల్లో స్నేహితులతో కలిసి బెంగళూరుకి వెళ్లింది. అక్కడ ఒక రోజు రాత్రి పార్టీ తరువాత పబ్ నుంచి హోటల్ వెళ్లడానికి యాప్ ద్వారా బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంది. ఆ వచ్చిన బైకర్ పేరు సురేష్. గీత అతని బైక్ పై హోటల్ చేరుకుంది. కానీ దారి పొడువున సురేష్ ఆమెతో చాలా సన్నిహితంగా మాట్లాడాడు. గీత అతని వ్యవహారం నచ్చడంతో టిప్ కూడా ఇచ్చింది. అలా హోటల్ చేరుకున్న కాసేపటి తరువాత సురేష్ ఆమె ఫోన్ నెంబర్ పై కాల్ చేశాడు. సురేష్ ఆ కాల్ కేవలం ఆమె నెంబర్ ధృవీకరించుకోవడానికే చేశాడు. గీతకు సురేష్ అలా కాల్ చేయడం విచిత్రంగా అనిపించింది. అయితే మరో గంట తరువాత సురేష్ నెంబర్ నుంచి గీతకు చాలా మెసేజ్ లు వచ్చాయి.


Also Read:  వెబ్ సిరీస్ చూసి బాలుడి మర్డర్.. ప్రేమ కోసం హంతకురాలిగా మారిన ఎంబిబియస్ విద్యార్థిని

ఆ మెసేజ లలో గీత చాలా అందంగా ఉందని.. ఆమెతో సురేష్ స్నేహం చేయాలని భావిస్తున్నట్లు ఉంది. సురేష్ పంపిన మెసేజ్ లు చూసిన గీత విసుగెత్తిపోయి.. ట్యాక్సీ యాప్ బుకింగ్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేసింది. ఆ తరువాత సురేష్ నెంబర్లను కూడా బ్లాక్ చేసింది. అయినా వేరే నెంబర్లతో సురేష్ మెసేజ్ లు పంపించడంతో ట్యాక్సీ యాప్ కంపెనీకీ ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. దీంతో కంపెనీ సురేష్ లైసెన్స్ ను రద్దు చేసింది. ఇదంతా జరిగిన కొన్ని నెలల వరకు గీతకు సురేష్ ఫోన్, లేదా మెసేజ్ చేయలేదు. కానీ మూడు నెలల తరువాత మళ్లీ మెసేజ్ లు చేయడం మొదలుపెట్టాడు. గీత అతడిని ఒకసారి ఫోన్ చేసి హెచ్చరించిన తరువాత కొన్నిరోజులు సురేష్ ఆగిపోయేవాడు. కానీ కొంతసమయం తరువాత మళ్లీ మొదలుపెట్టేవాడు. ఫోన్ నెంబర్లు బ్లాక్ చేస్తే తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ కు మెసేజ్ చేసేవాడు.

ఇంతవరకు గీత అతడిని సీరియస్ గా తీసుకోలేదు. కానీ సురేష్ ఒకరోజు గీతను ప్రేమిస్తున్నట్లు మెసేజ్ చేశాడు. దీంతో గీత కోపంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. కానీ సురేష్ మాత్రం గీత మాటలకు బెదరలేదు. విసుగెత్తిపోయిన గీత తన ఫోన్ నెంబర్, ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ రెండూ మార్చేసింది. దీంతో సురేష్ గత అయిదేళ్లుగా గీతకు మెసేజ్ లు చేయలేపోయాడు.

Also Read: ‘ఉద్యోగం కావాలంటే బాస్ తో సమయం గడపాలి’.. మహిళకు కండిషన్ పెట్టిన మేనేజర్

ఇప్పుడు అయిదేళ్ల తరువాత గీత హైదరాబాద్ లో ఉండగా.. ఆమె కొత్త ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ కు మళ్లీ అలాంటి మెసేజ్ లు వస్తున్నాయి. అయితే ఈ సారి సురేష్.. గీతకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆమె తాను చెప్పినట్లు చేయకపోతే ఆమె పర్సనల్ ఫొటోలు తన వద్ద ఉన్నాయని.. వాటిని మార్పింగ్ చేసి గీతను నగ్నంగా ఫొటోల్లో చూపిస్తూ.. సోషల్ మీడియాలో పెట్టబోతున్నట్లు మెసేజ్ చేశాడు. నిజానికి ఆ ఫొటోలు.. గీత ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్, ఫేస్ బుక్ లోనివి. వాటిలో ఎడిటింగ్ ద్వారా ఆమెను నగ్నంగా చూపిస్తానని సురేష్ బెదిరించాడు.

Also Read: డిగ్రీ చదవకుండానే సంవత్సరానికి రూ.5 కోట్లు సంపాదిస్తున్న యువతి.. ఎలాగంటే?..

ఆ మెసేజ్ చూసి గీతకు ఏం చేయాలో తోచలేదు. చివరికి ధైర్యం చేసి తల్లితండ్రులకు ఇంతకాలం జరిగినదంతా చెప్పింది. దీంతో గీత తల్లిదండ్రులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రస్తుతం గీతకు వచ్చిన మెసేజ్ లు పంపిన ఫోన్ నెంబర్లు, ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ట్రాక్ చేస్తున్నారు. త్వరలోనే నిందితుడు సురేష్ ను పట్టుకంటామని హామీ ఇచ్చారు.

Also Read: బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×