EPAPER

Viral News: ఇలాంటి డ్రెస్సా? యాసిడ్ దాడి చేస్తానంటూ మహిళకు వార్నింగ్

Viral News: ఇలాంటి డ్రెస్సా? యాసిడ్ దాడి చేస్తానంటూ మహిళకు వార్నింగ్

Bengaluru Man Threatens Acid Attack On Woman: సోషల్ మీడియా వేదికగా అడ్డగోలుగా కామెంట్స్ పెడితే ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో చెప్పేందుకు ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. బెంగళూరులో ఓ మహిళ డ్రెస్సింగ్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు యాసిడ్ దాడి చేస్తానని హెచ్చరించడంతో పోలీసులు అతడి మీద కేసు నమోదు చేశారు. సదరు యువకుడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఆయన పని చేసే కంపెనీ వెల్లడించింది. ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్టు తన జీవితాన్ని తారుమారు చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


మహిళపై యాసిడ్ అటాక్ చేస్తానని హెచ్చరించిన నిఖిత్ శెట్టి

నిఖిత్ శెట్టి అనే యువకుడు బెంగళూరులోని ఇతియోస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు. తాజాగా సోషల్ మీడియా ఇన్లూయెన్సర్ షెహబాజ్ అన్సారీ భార్య ఖ్యాతిశ్రీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమె సరిగా బట్టలు వేసుకోవడం లేదని, ఇలాగే డ్రెస్సింగ్ చేసుకుంటే  యాసిడ్ దాడి చేస్తానని హెచ్చరించారు. భార్యను కంట్రోల్ లో పెట్టుకోవాలంటూ అన్సారీకి వార్నింగ్ ఇస్తూ మెసేజ్ పెట్టాడు. నిఖిత్ శెట్టి తనకు పెట్టిన మెసేజ్ స్క్రీన్ షాట్ తీసి అన్సారీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కర్నాటక డీజీపీ, కర్నాటక సీఎంవోతో పాటు డీకే శివకుమార్ కు ట్యాగ్ చేశారు. తన భార్యకు నిఖిత్ నుంచి ప్రాణహాని ఉందని, వెంటనే పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


నిఖిత్ ను ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ

మరోవైపు నిఖిత్ శెట్టి పని చేస్తున్న కంపెనీకి ట్యాగ్ చేస్తూ మరో పోస్టు పెట్టారు అన్సారీ. “హలో ఇతియోస్ సర్వీసెస్. మీ ఎంప్లాయి నా వైఫ్ మీద యాసిడ్ దాడి చేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. కర్నాటక పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశాను. మీ కంపెనీలో ఉన్న లేడీ ఎంప్లాయీస్ గురించి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ యువకుడితో వాళ్లకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగులకు ప్రమాదం వాటిల్లకుండా ఉండాలంటే అతడి విషయంలో సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి” అని రాసుకొచ్చారు.

అన్సారీ పెట్టిన ఈ పోస్టుపై ఇతియోస్ సంస్థ సీరియస్ అయ్యింది. వెంటనే నిఖిత్ శెట్టిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కంపెనీ వెల్లడించింది. తమ ఎంప్లాయీస్ లో ఇలాంటి ప్రవర్తనను అస్సలు ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది. తమ కంపెనీకి కొన్ని రూల్స్ ఉన్నాయని, వాటిని ఎవరు ఉల్లంఘించినా చర్యలు తప్పవన్నారు. అటు తనకు సపోర్టు చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పారు. ఎదుటివారి విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదన్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు జీవించే స్వేచ్ఛ ఉందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు.

Read Also:గాడిద పాల పేరుతో రూ.10 కోట్ల మోసం, బాబోయ్.. ఇలా కూడా చెయ్యొచ్చా?

Related News

Woman Kills Parents: తల్లిదండ్రులను హత్య చేసిన యువతి.. 4 ఏళ్లుగా ఇంట్లోనే శవాలు.. ఎందుకంటే?..

Woman Throws Acid on Lover: హోటల్‌కు టిఫిన్ కోసం వెళ్లిన ప్రేమికులు.. ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి?..

Donkey Milk: గాడిద పాల పేరుతో రూ.10 కోట్ల మోసం, బాబోయ్.. ఇలా కూడా చెయ్యొచ్చా?

LPG Delivery Boy Crime: మైనర్ బాలికపై గ్యాస్ సిలిండర్ డెలివరీ బాయ్ ఘాతుకం.. అయిదేళ్ల తరువాత ఏం జరిగిందంటే?..

DKZ technologies fraud: హైదరాబాద్‌లో మోసం.. కస్టమర్లను ముంచేసిన డీకెజెడ్ టెక్నాలజీ, ఆపై అరెస్టులు

Baby Sold Beer: బీర్ కోసం పసిబిడ్డను అమ్ముకున్న తల్లితండ్రులు.. పోలీసులకు దారుణమైన పరిస్థితిలో దొరికిన బిడ్డ

Big Stories

×