Beautician murder: ఓ బ్యూటీషియన్ దారుణ హత్యకు గురైంది. తెలిసిన వ్యక్తి ఆమెని హత్య చేసినట్టు తెలుస్తోంది. మహిళ శరీరాన్ని ఆరు ముక్కలు చేసి ఇంటి సమీపంలో పాతి పెట్టాడు నిందితుడు. బాధిత మహిళ రెండు రోజలు కిందట అదృశ్యమైంది. సంచలనం రేపిన ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో అనితా చౌదరి బ్యూటీపార్లర్ నడుపుతోంది. ఆమె వయస్సు 50. అనితా చౌదరి బ్యూటీ పార్లర్‌ను మూసివేసి రాత్రి ఇంటికి రాలేదు. దీంతో అదృశ్యమైందని భావించాడు ఆమె భర్త మన్మోహన్ చౌదరి. తన భార్య కనిపించలేదని అక్టోబర్ 28న జోధ్‌పూర్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇంతకీ అనిత మిస్సింగ్ అయ్యిందా? ఎవరైనా చంపారా? ఈ కేసు పోలీసులకు కత్తి మీద సాముగా మారింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు పోలీసుల వద్ద లేవు. ఎవరితో అనిత చౌదరి మాట్లాడేది అనేదానిపై పోలీసులు కూపీ లాగారు. గుల్ మహ్మద్ అనే వ్యక్తి అని తేలింది.
సీసీటీవీ కెమెరాల ద్వారా అనిత మిస్సయిన రోజు రాత్రి ఆటో ఎక్కడం గమనించారు పోలీసులు. దీంతో ఆటోడ్రైవర్లను ప్రశ్నించారు. చివరకు గుల్ మమ్మద్ ఇంటిని గుర్తించారు. గుల్ మమ్మద్ ఫోన్ కాల్‌పై ఆరా తీశారు. అనిత షాపుకు దగ్గరలో గుల్ మహ్మద్ షాపు ఉండేది. ఆమెతో అతడికి పరిచయం ఉందని తేలింది.
ALSO READ: బోరుగడ్డ అనిల్ ఆ మూడింటికి వార్నింగ్.. వెనక్కి తగ్గేదిలే
అనిత ఎక్కడ? నిందితుడు కనిపించలేదు. వీరిని పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. గుల్ మహ్మద్ భార్య మూడు రోజుల తర్వాత తన సోదరి నుంచి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత పోలీసులు ఆమెని ప్రశ్నించారు. చివరకు అసలు విషయం చెప్పేసిందామె.
అనితను తన భర్త హత్య చేసి, ఆమె శరీరాన్ని ఇంటి వెనుక పూడ్చి పెట్టినట్టు వివరాలు ఇచ్చేసింది. దీంతో పోలీసులు బుల్డోజర్ సాయంతో తవ్వకాలు చేపట్టారు. చివరకు 15 అడుగుల లోతులో అనిత శరీర భాగాలు కనిపించారు.
ఆమెని చంపి శరీరాన్ని ఆరు బాగాలు చేశాడు నిందితుడు. వాటిని ప్లాస్టిక్ సంచిలో వేసి పూడ్చిపెట్టారు. అనిత బాడీ కనిపించగానే పోలీసులు షాకయ్యారు. మొత్తం ఆరు భాగాలను పైకి తీసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. నిందితుడు పట్టుబడితే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.