EPAPER

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Bank Fraud Woman| కష్టపడి సంపాదించే ఓపిక లేక అడ్డదారుల్లో త్వరగా కోట్లు సంపాదించాలని కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాలు దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ మోసాల కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా బ్యాంక్ అకౌంట్ ఫ్రాడ్ కేసులో ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇంట్లో వందల కొద్ది బ్యాంకు పాస్ పుస్తకాలు, ఎటిఎం కార్డులు లభించాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగరం క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇటీవల చాలామంది ఒకే సమస్యతో ఫిర్యాదు చేశారు. తమ బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ చేస్తున్నట్లు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. దీంతో పోలీసులు అలాంటి ఫిర్యాదులు చేసేవారి బ్యాంకు అకౌంట్ల గురించి విచారణ మొదలు పెట్టారు. అయితే ఆ అకౌంట్లన్నీ వేర్వేరు బ్యాంకుల్లో ఉన్నాయి. దీంతో పోలీసులకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!


అయితే లోతుగా పరిశీలిస్తే.. వారికి రెండు విషయాలు కామన్ గా అనిపించాయి. ఒకటి ఆ బ్యాంకు అకౌంట్ల ద్వారా లక్షల, కోట్లలో లావాదేవీలు జరిగాయి. వాటి గురించి తమకేమీ తెలియదని ఫిర్యాదు చేసినవారు తెలిపారు. మరొకటి వారందరికీ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఒకే మహిళ సాయం చేసింది. ఈ క్లూ తో పోలీసులు ఆ మహిళ కోసం గాలించి పట్టుకున్నారు. ఆమె ఒక ప్రైవేట్ బ్యాంక్ లో చిన్న ఉద్యోగం చేస్తోంది.

ఆ మహిళ గ్వాలియర్ నగరంలోని డబ్రా ప్రాంతంలో నివసిస్తోంది. దీంతో పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు చేయగా.. వందల సంఖ్యలో బ్యాంక్ పాస్ పుస్తకాలు, ఎటిఎం డెబిట్ కార్డులు లభించాయి. వాటన్నింటినీ పరిశీలిస్తే.. ఆ అకౌంట్లన్నీ ఎవరో గ్రామస్తులు, లేబర్ పనిచేసేవారికి చెందినవిగా తెలిసింది.

ఆ తరువాత పోలీసులు సదరు మహిళను గట్టిగా ప్రశ్నిస్తే.. ఆమె షాకింగ్ విషయం చెప్పింది. ఒక గ్యాంగ్ కు చెందిన ఇద్దరు యువకులు తనను సంప్రదించారని.. ఎవరైనా పేదవారికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి.. వారి పేరు మీద సిమ్ కార్డులు కొనుగోలు తమకు ఇవ్వాలని వాళ్లు తనను అడిగారని చెప్పింది. పైగా ఒక్కో బ్యాంకు అకౌంట్ నెలకు రూ.2000 చెల్లిస్తామని ఆఫర్ చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం పోలీసులు ఆ గ్యాంగ్ వివరాలు తెలుసుకొని వారిని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

Also Read: భర్త కావలెను.. రూ.30 లక్షల ప్యాకేజీ, 3 BHK ఇల్లూ ఉండాలట,  రెండో పెళ్లి కోసం యాడ్ ఇచ్చిన మహిళ

ఈ గ్యాంగ్ ధనవంతులను టార్గెట్ చేసి.. వారి బ్యాంకు అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు దోచుకుంటారు. ఆ తరువాత క్షణాల్లో వందల మంది పేదల బ్యాంక్ అకౌంట్ల లోకి ఆ దోపిడీ సొమ్ము ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఈ వందల బ్యాంక్ అకౌంట్ల ఎటిఎం కార్డులు తమ వద్దే ఉండడంతో వాటి ద్వారా దోచుకున్న డబ్బుని విత్ డ్రా చేసుకుంటారు.

Related News

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Woman Burns Step-Daughter: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..

Zero FIR: జానీ మాస్టర్‌ కేస్.. ఇంతకీ జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఏ సందర్భంలో ఫైల్ చేస్తారో తెలుసా?

Cyber criminals: పోలీసు డీపీ.. వేస్తారు టోపీ, సైబర్ నేరస్తుల సరికొత్త ట్రాప్

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Big Stories

×