EPAPER

Ambulance Driver: అంబులెన్స్ లో లైంగిక వేధింపులు.. భర్త ఆక్సిజన్ మాస్క్ తీసేసి..

Ambulance Driver: అంబులెన్స్ లో లైంగిక వేధింపులు.. భర్త ఆక్సిజన్ మాస్క్ తీసేసి..

Ambulance Driver Misbehaving for Patient Wife: దేశంలో రోజురోజుకు దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. చిన్నారుల నుంచి పెళ్లైన మహిళలను సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, భర్త చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన భార్యపై కామాంధులు కన్నేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా.. పేషెంట్ భర్తపై డ్రైవర్‌తో పాటు హెల్పర్ లైంగిక దాడికి యత్నించారు. అనంతరం వాళ్లను నడిరోడ్డుపై వదిలివేయడంతో ఆమె భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.


వివరాల ప్రకారం.. యూపీలోని సిద్ధార్థ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ.. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తను ఆగస్టు 28న ఘాజిపూర్‌లోని ఆరావాళి మార్గ్‌లో ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్పించింది. అక్కడ చికిత్స కోసం ఎక్కువ డబ్బులు అడగడంతో ఖర్చును భరించలేక తన భర్తను ఇంటికి తీసుకెళ్తానని వైద్యులకు చెప్పింది. దీంతో ఆయనను డిశ్చార్జ్ చేసి పంపించారు.

ఈ క్రమంలో ప్రైవేట్ అంబులెన్స్‌లో తన భర్తను, సోదరుడిని తీసుకొని తన ఇంటికి బయలుదేరింది. ఈ సమయంలో ఆ అంబులెన్స్ డ్రైవర్ ఆమెను తనతో పాటు ముందు సీట్లో కూర్చోవాలని చెప్పాడు. ముందు సీట్లో కూర్చుంటే మార్గ మధ్యలో రాత్రి వేల పోలీసులు ఆపరని నమ్మించాడు. కొంతదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్, హెల్పర్ ఇద్దరూ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. సదరు మహిళ అభ్యంతరం తెలపడంతో ఆమెను బెదిరింపులకు గురిచేశారు.


కాసేపటికే డ్రైవర్, హెల్పర్ మహిళను లైంగికంగా వేధింపులకు గురిచేశారు. ఆ మహిళ ప్రతిఘటించింది. వీరి ప్రవర్తనను గమనించిన ఆమె భర్త, సోదరుడు గట్టిగా కేకలు వేశారు. దీంతో డ్రైవర్, హెల్పర్ ఆమెతోపాటు భర్తను రోడ్డుపక్కనే దించేసి..ఆక్సిజన్ తొలగించి వెళ్లిపోయారు. వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే పరిస్థితి విషమించడంతో మహిళ భర్త మృతి చెందాడు.

Also Read: మిస్ కాల్ తో మొదలైన ప్రేమ.. ప్రియుడిని వివాహం చేసుకోవడానికి హంతకురాలిగా మారిన లేడి!

ఈ ఘటనపై సదరు మహిళ సోదరుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అంతేకాకుండా మహిళ వద్ద నుంచి రూ.10వేల నగదు, బంగారాన్ని లాక్కున్నట్లు ఆమె ఆరోపించినట్లు ఏడీసీపీ జితేంద్ర దూబే వెల్లడించారు.

Related News

Witchcraft: చేతబడి అనుమానంతో ఒకే కుటుంబంలో ఐదుగురి దారుణ హత్య

Bank Fraud Woman: పేదవారి బ్యాంక్ అకౌంట్ల నుంచి లక్షలు, కోట్లు లావాదేవీలు.. మోసగత్తె అరెస్ట్!

Brother In law kills: రెండు నెలలపాటు అత్తారింట్లోనే అల్లుడు.. మరదలిని ఏం చేశాడంటే

Bride on Sale Elopes: కొత్త కోడలు చేసిన వంట తిని తీవ్రంగా నష్టపోయిన కుటుంబం.. పోలీసులకు ఫిర్యాదు! ..

Triangle Love Story: తిరుపతిలో దారుణం.. కత్తిపోట్లకు దారితీసిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..

Passengers Beat Railway Employee To Death: రైల్వే ఉద్యోగిని చితకబాది హత్య చేసిన ప్రయాణికులు.. ఏం చేశాడంటే?..

Gujarath insident: గణేశుని నిమజ్జనంలో అపశృతి.. నదిలో మునిగి 8 మంది మృతి

Big Stories

×