EPAPER

Yo Edge – Ampere Reo Li Plus: వృద్ధులకు సో బెటర్.. రూ. 49000కే ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజీలో కింగ్..!

Yo Edge – Ampere Reo Li Plus: వృద్ధులకు సో బెటర్.. రూ. 49000కే ఎలక్ట్రిక్ స్కూటర్.. మైలేజీలో కింగ్..!

Yo Edge – Ampere Reo Li Plus: ప్రస్తుతం స్కూటర్ అనేది రోజు వారి వినియోగంలో ఒక భాగం అయిపోయింది. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి, పిల్లలను స్కూల్‌కు డ్రాప్ చేసే వారికి, ఇంటి దగ్గర చిన్న చిన్న పనులకు స్కూటర్లే బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. మహిళలు, వృద్ధులకు ఇవే బెటర్ కూడా. అందువల్లనే మార్కెట్‌లోకి కొత్త కొత్త స్కూటర్లు రోజూ దర్శనమిస్తున్నాయి. అందులోనూ ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగిపోవడంతో అంతా ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది.


తక్కువ ధరలో, ఎక్కువ మైలేజీ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లనే కొంటున్నారు. ఈ లైట్ వెయిట్ స్కూటర్లు అధిక డ్రైవింగ్ పరిధిని అందిస్తాయి. పెట్రోల్‌తో పోలిస్తే ఈ స్కూటర్లు చాలా ఉత్తమమైనవి కూడా. కొత్త తరం కోసం ఈ స్కూటర్‌లు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, ఫీచర్లతో అందించబడుతున్నాయి. మరి మీరు కూడా తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే ఎలక్రిక్ స్కూటర్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీకో గుడ్ న్యూస్. మార్కెట్లో అలాంటి స్కూటర్లలో ఒకటి ‘యో ఎడ్జ్’ (Yo Edge). ఈ స్మార్ట్ స్కూటర్ కేవలం రూ.49000 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

ఇది హై రేంజ్ స్కూటర్. దీనికి ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 60 కిమీల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. దీన్ని నడపడానికి ఎలాంటి లైసెన్స్ కూడా అవసరం లేదు. సరసమైన ధరలో అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ రోడ్డుపై గంటకు 25 కి.మీల వేగంతో పరుగులు పెడుతుంది. యో ఎడ్జ్ లైట్ వెయిట్ స్కూటర్ 59 కిలోలు బరువును కలిగి ఉంటుంది. దీంతో ఇంట్లోని పిల్లలు, మహిళలు, వృద్ధులు రోడ్డుపై సులభంగా అదుపు చేయగలుగుతారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 7 నుండి 8 గంటల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ 180 కిలోల బరువును సులభంగా మోయగలదు.


Also Read: అట్రాక్ట్ చేసే ఫీచర్లు.. ఫెస్టివల్ కలర్‌లలో రెండు సుజుకి స్కూటర్‌లు లాంచ్..!

యో ఎడ్జ్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్కూటర్‌లో USB ఛార్జర్ పోర్ట్ ఉంది. దీని ద్వారా మీరు స్కూటర్‌లో మొబైల్, ల్యాప్‌టాప్‌ను ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. భద్రత కోసం స్కూటర్‌లో డ్రమ్ బ్రేక్‌లు అందించబడ్డాయి.
సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సింగిల్ పీస్ సీటుతో ఈ స్కూటర్ అందించబడుతోంది. ఈ స్మార్ట్ స్కూటర్ వెనుక సీటుపై బ్యాక్ రెస్ట్ ఉంది. ఇది అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. స్టైలిష్ లుక్‌ని ఇస్తుంది. ఈ స్కూటర్ సాధారణ హ్యాండిల్ బార్, రియర్ వ్యూ మిర్రర్‌తో వస్తుంది. పెద్ద హెడ్‌లైట్, షార్ప్ ఫ్రంట్ లుక్‌ని కలిగి ఉంది.

కాగా యో ఎడ్జ్ మార్కెట్లో ఆంపియర్ రియో ​​లి ప్లస్‌తో పోటీపడుతోంది. ఇప్పుడు ఆంపియర్ స్కూటర్ విషయానికొస్తే.. ఈ స్కూటర్ ఆన్-రోడ్ రూ. 66,719 వద్ద అందుబాటులో ఉంది. ఆంపియర్ రియో ​​లి ప్లస్ డ్రైవింగ్ రేంజ్, పవర్ విషయానికొస్తే.. Ampere Reo Li Plus ఒక హై క్లాస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 70 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ హై స్పీడ్ స్కూటర్ గంటకు గరిష్టంగా 25 kmph వరకు వేగాన్ని అందిస్తుంది.

ఈ స్కూటర్ 6 గంటల్లో 0 నుండి 100% వరకు ఛార్జింగ్ అవుతుంది. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. Ampere Reo Li Plus బ్యాటరీ, స్పెసిఫికేషన్లు విషయానికొస్తే.. Ampere Reo Li Plus ప్రస్తుతం 1 వేరియంట్‌లో వస్తుంది. ఈ స్కూటర్ యువకుల కోసం 4 కలర్ ఎంపికలలో అందించబడుతుంది. ఈ అద్భుతమైన స్కూటర్ ముందు, వెనుక టైర్లలో డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది. ఇందులో శక్తివంతమైన 1.3kWh బ్యాటరీ ఉంది.

Related News

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Big Stories

×