EPAPER

Yamaha MT-09: యమహా నుంచి క్లచ్ లెస్ బైక్.. పిచ్చిరేపుతున్న స్పీడ్.. లాంచ్ ఎప్పుడంటే?

Yamaha MT-09: యమహా నుంచి క్లచ్ లెస్ బైక్.. పిచ్చిరేపుతున్న స్పీడ్.. లాంచ్ ఎప్పుడంటే?

Yamaha MT-09: ప్రస్తుత కాలంలో యువత ఎక్కువగా స్పోర్టీ లుక్ బైక్‌లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఇంటరెస్ట్ చూపుతున్నారు. వీటిలో లెటెస్ట్ ఫీచర్లు ఉంటాయి. అలానే మంచి రైడింగ్ ఫీల్‌ను అందిస్తాయి. ఈ క్రమంలో యమహా తన కొత్త బైక్‌ను తీసుకురానుంది. ఈ బైక్‌లో క్లచ్ లివర్ ఉండదని అనేక లీకులు వస్తున్నాయి. బైక్ హ్యాండిల్‌బార్‌పై చిన్న బటన్ ఉంటుంది. దాని ద్వారా మీరు మీ బైక్ గేర్‌లను వేగానికి అనుగుణంగా మార్చవచ్చు.


నివేదికల ప్రకారం ఈ టెక్నాలజీకి యమహా Y AMT అని పేరు పెట్టారు. ఇది ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. దీనిలో గేర్‌లను హ్యాండిల్‌పై అమర్చిన స్విచ్‌తో మార్చవచ్చు. కంపెనీ త్వరలో విడుదల చేయబోయే బైక్ యమహా MT-09 లో ఈ ఫీచర్‌ను అందించనుంది. ఈ హైస్పీడ్ బైక్ 2024 అక్టోబర్ నాటికి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. ఈ బైక్ గంటకు 198.3 కిమీల టాప్ స్పీడ్‌ను అందిస్తోంది. ఈ బైక్ గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. క్లచ్, క్లచ్‌లెస్ వెర్షన్‌లు రెండింటినీ దేశంలో ప్రారంభించవచ్చు.

Also Read: టీవీఎస్ సూపర్ ప్లాన్.. కార్గిల్ విజయ్ దివస్‌‌కి గుర్తుగా కొత్త బైక్!


కంపెనీ తన యమహా MT-09 ధరలను వెల్లడించలేదు. ఈ బైక్‌ను రూ.11.50 నుంచి 12 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేయవచ్చని అంచనా. యమహా బైక్ 890 cc పవర్‌ఫుల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది. ఈ బైక్ అధిక మైలేజీ కోసం 117.3 బిహెచ్‌పి పవర్ రిలీజ్ చేస్తుంది. ఈ బైక్ ముందు వైపు నుండి చాలా షార్ప్‌గా కనిపిస్తుంది. ఇది సింగిల్ పాడ్ హెడ్‌లైట్, ట్విన్ DRL కలిగి ఉంది. ఇవి బైక్‌కు మంచి లుక్‌ని అందిస్తాయి.

యమహా MT-09 ఒక హై పవర్ బైక్. ఇది 7000 rpm వద్ద 93Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ భారీ ఇంజన్ బైక్ రోడ్డుపై దాదాపు 20కిమీల మైలేజీని ఇస్తుంది. ఇందులో సియాన్ స్టార్మ్, ఐకాన్ బ్లూ, టెక్ బ్లాక్ అనే మూడు స్మార్ట్ కలర్స్‌‌లో కంపెనీ విడుదల చేయనుంది. ఈ కొత్త తరం బైక్ ఫ్లాట్ హ్యాండిల్‌బార్‌ను కలిగి ఉంటుంది. ఇది లాంగ్ జర్నీలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బైక్‌లో 14 లీటర్ మస్కులర్ లుక్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.

Also Read: కొత్త కంపెనీ ఎంట్రీ.. రూ. 1.31 కోట్లతో ఎస్‌యూవీ లాంచ్!

MT-09 దాని పవర్‌ట్రెయిన్‌లో మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ RS, Moto Guzzi V85 TT, ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్  KTM 890 డ్యూక్‌లకు పోటీగా ఉంటుంది. KTM 890 గురించి మాట్లాడితే ఈ బైక్ నవంబర్ 2024లో విడుదల కానుంది. బైక్ ప్రారంభ ధర రూ. 10 నుండి 12 లక్షల వరకు ఉండొచ్చు. ఈ బైక్ 889 cc ఇంజన్‌‌తో వస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ బైక్. దీనిలో 14 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్‌ లభిస్తుంది. బైక్  సీట్ ఎత్తు 820 mm. ఈ కూల్ బైక్ 113.98 bhp పవర్ రిలీజ్ చేస్తుంది.

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×